Latest Updates
-
మే 4: ఈ రాశుల వారికి ఊహించని ధన యోగం.. కెరీర్లో తిరుగులేని సక్సెస్! -
వేడి అన్నంలో చల్లటి బెండకాయ పెరుగు పచ్చడి..ప్రతి ముద్దా ఆహా అనిపించాల్సిందే! -
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే
అరటి దూట జ్యూస్ లోని ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు
పచ్చి అరటిపండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాగే బనానా స్టెమ్(అరటి దూటలో)లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే చాలా మందికి ఈ అరటి దూటలోని ప్రయోజనాలు కానీ, ఇతర న్యూట్రీషియన్ విలువలు కానీ తెలిసుండకపోవచ్చు.
ఈ స్టెమ్ జ్యూస్ త్రాగడం వల్ల డయాబెటిక్ నివారించవచ్చు. అంతే కాదు మలబద్దకాన్ని మరియు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను మరియు బరువును తగ్గడానికి సహాయపడుతుంది.
READ MORE: అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
ప్లాంటిన్ స్టెమ్ జ్యూస్ యవ్వనంలో ఉన్నపిల్లలకు కూడా గ్రేట్ గా సహాయపడుతుంది . ఎందుకంటే దీని ద్వారా వ్యాధినిరోధకశక్తిని నేచురల్ గా పెంచుకోవచ్చు . ఇది అన్ని రకాల జబ్బును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
అయితే ఈ స్టెమ్ జ్యూస్ (అరటి దూట జ్యూస్)ను ఎలా తయారుచేసి తీసుకోవాలో తెలుసుకోకంటే దీన్ని త్రాగడం కొంచెం కష్టం అవుతుంది. ఈ స్టెమ్ జ్యూస్ లో ఉండే ఫైబర్ ను మ్రింగడానికి కష్టం అవుతుంది. అంతే కాదు ఈ వెజిటేబుల్ ను క్లీన్ చేయడం కూడా ముఖ్యమే.
READ MORE: అరటి తొక్కలో ఆశ్చర్యం కలిగించే బ్యూటీ బెనిఫిట్స్
అంతే కాదు ఈ స్టెమ్ జ్యూస్ కొద్దిగా చేదుగా ఉండటం వల్ల దీన్ని తయారుచేయడానికి వివిధ రకాల ఇండియన్ మసాలాలు జోడించాల్సి ఉంటుంది . మరి ప్లాంటిన్ స్టెమ్ జ్యూస్ త్రాగడం వల్ల పొందే ప్రయోజనాలేంటో ఒక సారి తెలుసుకుందాం...

ప్లాంటిన్ స్టెమ్ జ్యూస్ రిసిపి:
రిసిపి: కావల్సిన పదార్థాలు: సన్నగా కట్ చేసిన బనానా స్టెమ్, నీళ్ళు, బెల్లం లేదా తేనె, యాలకల పొడి.
తయారుచేయుట: సన్నగా తరిగిన బనానా స్టెమ్ మరియు నీళ్ళు ను జ్యూసర్ లో పోసి గ్రైండ్ చేసి జ్యూస్ తీయిాలి. ఇప్పుడు అందులో బెల్లం లేద తేనె మిక్స్ చేసి యాలకలపొడి మిక్స్ చేసి తీసుకోవాలి.

కిడ్నీ స్టోన్ నివారిస్తుంది:
ఈ ప్లాంటిన్ స్టెమ్ జ్యూస్ త్రాగడం వల్ల చాల తక్కువ సమయంలోనే కిడ్నీలోని రాళ్ళు కరిగిపోతాయి.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
మీరు ఒక వారంలో బరువు తగ్గించుకోవాలనుకుంటే, ఇది ఒక ఉత్తమ పదార్థం ప్లాంటిన్ స్టెమ్ జ్యూస్ లో ఉండే ఔషధగుణాలు క్యాలరీలను తగ్గించడానికి మీ పొట్ట ఫుల్ గా అనిపించేలా చేస్తుంది.

ఎసిడిటిని కంట్రోల్ చేస్తుంది :
క్రమంగా ఎసిడిటి సమస్యతో బాధపడే వారికి స్టెమ్ జ్యూస్ చాలా ఆరోగ్యకరమైనది. ఈ జ్యూస్ గుండెలో మంటను మరియు ఎసిడిటిని తగ్గిస్తుంది.

డయాబెటిస్ తో పోరాడుతుంది:
డయాబెటిస్ ను నివారించుకోవాలంటే, అరటి దూట జ్యూస్ ను త్రాగాలి. ఇది త్రాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . అరటి దూటలోని బిట్టర్ (చేదు)శరీరంలో ఇన్సులిన్ లెవల్ ను క్రమబద్దం చేస్తుంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది:
రెండు గ్లాసుల ప్లాంటిన్ స్టెమ్ జ్యూస్ ను త్రాగడం వల్ల యురెత్రాలోని మంటను నివారిస్తుంది.

స్టొమక్ అల్సర్:
ప్లాంటిన్ జ్యూస్ లోని మరో ప్రయోజనం, స్టొమక్ అల్సర్ ను నివారించడానికి ఇందులోని ఔషధగుణాలు బాగా సహాయపడుతాయి.

పొటాసియం అధికం:
ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి, ఈ స్టెమ్ జ్యూస్ ను త్రాగడం వల్ల వ్యాధినిరోధతకును పెంచుతుంది

బ్లడ్ ప్రెజర్ రెగ్యులేట్ చేస్తుంది:
బ్లడ్ ప్రెజర్ రెగ్యులేట్ చేయడానికి స్టెమ్ జ్యూస్ కూడా చాల మేలు చేస్తుంది . ముఖ్యంగా హైబీపి ఉన్నవారికి ఇది కంట్రోల్ చేస్తుంది.

శరీరాన్ని డిటాక్సి ఫై చేస్తుంది:
ఒక గ్లాస్ స్టెమ్ జ్యూస్ త్రాగడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది . ఈ పద్దతిని వారానికొకసారి ప్రయత్నించండి . తర్వాత మీ జీవనశైలిలోని మార్పులను గమనించండి.

రక్తం గడ్డ కట్టుట:
ఇందులో యాస్టిజెంట్ క్వాలిటీస్ అధికంగా ఉన్నాయి . అందువల్ల దీన్ని మీ డైట్ లో చేర్చుకోవడం ఒక ఉత్తమ ఆహారం.

మలబద్దకం నివారిస్తుంది:
ప్లాంటిన్ జ్యూస్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మలబద్దక నివారణకు చాలా ఉత్తమ హోం నివారిణి.



Click it and Unblock the Notifications