Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఇండియన్ ఉమెన్ ఫాలో అయ్యే హెల్త్ సీక్రెట్స్ ఏంటో తెలుసా ?
ఇండియన్ ఉమెన్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా వరకు భారతీయ మహిళల శరీరాకృతి అందంగా ఉండటానికి కారణం వాళ్లు ఫాలో హెల్తీ రూల్స్. ఇంటి పనులు చేసుకోవడం, యోగా చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, నీళ్లు సరిగ్గా తాగడం.. ఇవన్నీ వాళ్ల లైఫ్ లో ఒక పార్ట్ గా భావించి అనుసరిస్తారు.
READ MORE:వృద్ధాప్యానికి వ్యతిరేకంగా మహిళలకు ఆహారాలు
ఇండియన్ ఉమెన్స్ మల్టీ టాక్సింగ్ లో ఎక్స్ పర్ట్స్. కాబట్టే వాళ్లే ఆరోగ్యంగా.. ఫిట్ గా ఉంటారు. చాలా మంది మహిళలు ఇళ్లు శుభ్రపరుకోవడం లాంటి పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రోజంతా వాళ్లు చేసే ఇలాంటి పనుల వల్ల క్యాలరీలు ఈజీగా కరిగిపోతాయి.
ఇంకో విషయం ఏంటంటే.. కొందరు వర్కింగ్ ఉమెన్స్.. గంటల తరబడి.. ఆఫీస్ వర్కులు చేసినప్పటికీ.. ఇంటికి వెళ్లాక మళ్లీ వంటింటి పనులు చక్కబెట్టుకుంటారు. ఇది వాళ్లకు వ్యాయామంలా ఉపయోగపడుతోంది. దీనివల్ల యాక్టివ్ గా ఉండటానికి సహాయపడుతున్నాయి. ఇలాంటి రహస్యాలే వాళ్ల ఆరోగ్య సూత్రాలు. మరి ఇంకా ఏ యే పనుల వల్ల ఇండియన్ ఉమెన్ హెల్తీగా ఉంటుందో ఓ లుక్కేద్దామా...

నడక
నడక ఇండియన్ ఉమెన్ హెల్త్ సీక్రెట్. పార్క్ ల్లో ఉదయాన్నే మహిళలు వాకింగ్ లో బిజీ అయిపోతుంటారు. ఈ వ్యాయామాన్ని చాలా మంది మహిళలు ఫాలో అవుతూ ఉంటారు. ఎక్కువమంది.. సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉంటారు.

రైస్ కంటే రోటీకే ఎక్కువ ఇంపార్టెన్స్
భారతీయ మహిళలు ఎక్కువగా రోటీలనే ఇష్టపడతారు. ఇవి క్యాలరీలను కరిగిస్తాయని నమ్ముతారు.. అందుకే ఎక్కువ సమయాల్లో వీటినే తినడానికి ఇష్టపడతారు. ఒకవేళ రైస్ తినాలి అనుకున్నా... బ్రౌన్ రైస్ తీసుకుంటారు. ఇది వాళ్ల హెల్త్ సీక్రెట్.

యోగా
ఇండియన్ ఉమెన్స్ కి చాలా ఇష్టమైనది వ్యాయామం యోగా. యోగా శరీరానికి, మాసనకి ఆనందానికి చాలా ఉపయోగపడుతుంది. ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు.. శరీరాకృతి అందంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఛాయ్
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న వేడి వేడి టీ లేదా మసాలా టీని ఇండియన్స్ ఉమెన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఇది ఒక ఆరోగ్య రహస్యంగా చెప్పవచ్చు.

ఇంటి పనులు
ఇంటి పనులు భారతీయ మహిళల లైఫ్ లో ఓ భాగం. ఇల్లు ఊడవడం, క్లీన్ చేయడం వంటి పనుల వల్ల.. క్యాలరీలు తగ్గుతాయి. హిప్స్ లో కొవ్వు చేరకుండా ఉండటానికి సహాయపడతాయి ఈ పనులు.

పిల్లల సంరక్షణ
పిల్లల సంరక్షణలో ఇండియన్ ఉమెన్స్ చాలా బిజీగా గడుపుతారు. 24 గంటలూ.. వాళ్లకు ఏదో ఒకటి చేయడంలో మునిగిపోతారు. ఇది మరో అద్భుతమైన హెల్త్ సీక్రెట్.



Click it and Unblock the Notifications