Latest Updates
-
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా..
నిద్ర వెనక దాగున్న షాకింగ్ సీక్రెట్స్
మనం ప్రతి రోజూ నిద్రపోతాం. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతాం. కొందరు మెలుకువ లేకుండా.. రాత్రంతా నిద్రపోతారు. కానీ మరికొందరు అటు ఇటు మెదులుతూ.. సరిగా నిద్రపోరు. మరికొందరు నిద్ర పట్టడం లేదని ఫీలవడంలోనే తెల్లారిపోతుంది. మరికొందరు నిద్రబాగా రావడానికి బుక్స్ చదువుతారు, ఇంకొంతమంది టీవీ చూస్తూ అలా నిద్రలోకి జారుకుంటారు.
పుట్టిన దగ్గర నుంచి రోజూ నిద్రపోవడం అలవాటు అయింది. కానీ మనకు నిద్ర గురించి తెలుసా ? నిద్రపోయే సమయంలో.. మనకు తెలియకుండానే జరిగే విషయాలు చాలానే ఉన్నాయి. నిద్ర గురించి షాకింగ్ సీక్రెట్స్ ఇప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచేస్తాయి.

గుండెతో కనెక్షన్:
నిద్రకు గుండెకు కనెక్షన్ ఉందని ఎప్పుడైనా విన్నారా ? నిజమే.. సరిగ్గా నిద్రపోకపోతే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అది కూడా ఆడవాళ్లలో కంటే మగవాళ్లలోనే ఎక్కువగా అవకాశాలున్నాయి. అవసరమైనంత విశ్రాంతి దొరకనప్పుడు.. మీరు ఒత్తిడికి లోనవుతారు. ఇది డిప్రెషన్, కోపానికి కారణమవుతుంది. ఇలా వచ్చే ఎమోషన్స్ గుండెకు మంచిది కాదు.

బ్రెయిన్ కనెక్షన్:
నిద్రలేమి కారణంగా మీ లర్నింగ్ ఎబిలిటీ తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు స్లీప్ డిజాస్టర్ కారణంగా.. మెంటల్ హెల్త్ పైనా ప్రభావం చూపుతుంది. శ్వాసతీసుకోవడంలో వచ్చే ఇబ్బందుల కారణంగా.. బ్రెయిన్ కి తక్కువ ఆక్సిజన్ అందుతుంది. దీనివల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి.

బెడ్ షేరింగ్:
23 శాతం కపుల్స్ కలిసి నిద్రపోవడం వల్ల నిద్రలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఇటు కదలికల వల్ల నిద్రలో భంగం ఏర్పడుతోంది. అలాగే టీవీ మోగుతూ ఉండటం, రూమ్ టెంపరేచర్ మరీచల్గగా, లేదంటే వేడిగా ఉండటం వల్ల కూడా.. నిద్రలో భంగం ఏర్పడుతుంది.

నైట్ షిఫ్ట్ వర్క్
నైట్ షిఫ్ట్ లకు బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధముందని.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రాత్రి వేళల్లో పనిచేయడం మంచిది కాదు. నిద్ర సరిగా లేకపోతే క్యాన్సర్ కణాల నుంచి కాపాడే మెలటోనిన్ ఇబ్బందికి గురవుతుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
