Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
స్ట్రెస్ తగ్గించే టాప్ 10 హెల్తీ అండ్ న్యూట్రీషియన్ ఫుడ్...
ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో జీవనశైలి మరింత వేగవంతమైనది, ఆ వేగమే మనుష్యుల ఆరోగ్యం మీద ఎన్నో దుష్ప్రవాలను చూపుతున్నాయి. ఒత్తిడి వల్ల శరీరంలో కార్టియోసల్ హార్మోన్లు లెవల్స్ పెరుగుతుంది. ఈ కార్టిసోల్ అనే హార్మోన్ వల్ల ఆకలి పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల కార్బోహైడ్రేట్స్ మరియు స్వీట్స్ మీద ఎక్కువ కోరికలు పెరుగుతాయి. ఈ ఫుడ్స్ స్ట్రెస్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. తిరిగి వీటి వల్ల అధిక బరువు మరియు ఇతర సమస్యలు....
READ MORE: జ్ఞాపకశక్తిని పెంచుకోవాలా..? అయితే ఇలా చేయండి...!
కాబట్టి, తినే ఆహారంలో సరైనదైతే ఒత్తిడి మరియు డిప్రెషన్ తగ్గించుకోవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక సైలెంట్ ట్రిక్ మంచి ఆహారాన్ని ఒత్తిడి తగ్గించే నేచురల్ ఆహారాన్ని తీసుకోవడమే. మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా ఇతర ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం మానేయాలి. ఇవి శరీరంలో అదనపు క్యాలరీల పెంచుతాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒత్తిడి తగ్గించుకోవడానికి కొన్ని నేచురల్ ఫుడ్స్ ను ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరిగింది. ఇవి స్ట్రెస్ ను తగ్గించడం మాత్రమే కాదు, ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. మరి ఆ ఆహారాల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం...

ఆరెంజ్:
ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో వ్యాధినిరోధకతను పెంచుతాయి. స్ట్రెస్ లెవల్స్ కు కారణం అయ్యే కార్టిసోల్ ను లెవల్స్ ను తగ్గిస్తాయి. అలాగే ఆరెంజ్ లో ఉండే ఆరోమా వాసన స్మూతింగ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటాయి. ఒత్తిడి తగ్గించడానికి ఇది ఒక హెల్తీ ఫుడ్

నట్స్:
నట్స్ లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఈ ఖనిజం మన శరీరంలో లోపిస్తే అలసట మరియు ఆందోళనకు గురికావల్సి వస్తుంది. అందువల్ల , ఒక గుప్పెడు నట్స్ తినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

చేపలు:
చేపల్లో ఉండే ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో సెరోటినిన్ లెవల్స్ ను పెంచుతుంది. ఈ హార్మోన్ స్ట్రెస్ లెవల్స్ ను తగ్గిస్తుంది మరియు హార్ట్ డిసీజ్ తో పోరాడుతుంది. మరియు శరీరంలో ఆందోళన తగ్గిస్తుంది. ఒత్తిడి తగ్గించడానికి ఇది మరో హెల్తీ ఫుడ్.

డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ తినడం వల్ల కూడా పాల కంటే చాక్లెట్ ఉత్తమమని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడి చేశారు. డార్క్ చాక్లెట్ తినడం వల్ల కార్టిసోల్ లెవల్స్ తగ్గుతాయి.చాక్లెట్ తిన్న తర్వాత సంతోషానికి కారణం అయ్యే ఎండోర్ఫిన్ అనే హాపీ హార్మోన్ ను విడుదల చేస్తుంది.

పిస్తాలు
పిస్తాల్లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది.అనారోగ్యానికి కారణం అయ్యే ఒత్తిడిని తగ్గించడంలో పిస్తాలు గ్రేట్ గా పనిచేస్తాయి.

బాదం:
బాదంలో ఉండే అద్బుతమైన జింక్ ఖనిజం మరియు విటమిన్ బి12 వల్ల ఈ స్ట్రెస్ రిలీఫ్ జాబితాలో చేర్చబడింది. ఈ పోషకాలు మీ మనస్సు సమతుల్యస్థితి నిర్వహించడానికి మరియు ఆందోళను దరంగా ఉంచడానికి సహాయడపతుంది.

ఓట్ మీల్:
హెల్తీ ఫుడ్స్ లో ఇది ఒక బెస్ట్ చాయిస్ . ఇది వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. పొట్టనింపుతుంది, బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది మరియు జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే సెరోటనిన్ అనే హార్మోన్ విడుదల అవ్వడం వల్ల ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.

అరటిపండ్లు:
అరటిపండ్లలో ఫైబర్ తక్కువ, అరటిపండ్లు గ్యాస్ ను తగ్గిస్తుంది.దాంతో ప్రశాంతగా మరియు ఒత్తిడి లేకుండా గడపడానికి ఇవి బాగా సహాయపడుతాయి.

బ్లూ బెర్రీస్:
ఇది ఒక రుచికరమైన పండు, అంతే కాదు ఇవి పుష్కలమైనటువంటి యాంటీఆక్సిడెంట్స్, కలిగి ఉండటం వల్ల ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడుతాయి.

గ్రీన్ టీ:
ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అది మానవ మనస్సును ఒక ప్రశాంతంగా ఉంచేందుకు ప్రభావం కలిగి ఉంటుంది. నిజానికి ఇది చాలా ఎఫెక్టివ్ గా ప్రభావం చూపెడుతుంది.



Click it and Unblock the Notifications
