Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చక్కెర ఎక్కువగా తింటే ఏమవుతుందో మీకు తెలుసా ?
చక్కెర ఇది చిన్నపిల్లలు ఇష్టపడేది మాత్రమే కాదు.. పెద్దలను ఎట్రాక్ట్ చేస్తుంది. స్వీట్స్ రూపంలో, కాఫీ, టీలలో, డిజర్ట్స్ లోనూ చక్కెర జోడించాల్సిందే. అందుకే తియ్య తియ్యగా ఉండే ఈ రుచికి అందరూ ఆకర్షితులవుతారు. అయితే మీరు పంచదారను ఎక్కువగా ఇష్టపడతున్నారంటే.. చాలా అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారనే సూచిస్తుంది.
READ MORE: షుగర్ (డయాబెటిస్) ను కంట్రోల్ చేసుకోవడానికి ఇంటి చిట్కాలు
చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమతుందో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. ఇది కేవలం మధుమేహానికి మాత్రమే కారణం కాదు. కొన్ని ఊహించని డిసీజ్ లకు చక్కెర కారణమవుతుంది.
మీరు పంచదార ఆహారపదార్థాలు తినకుండా ఉండలేకపోతున్నారా ? అయితే.. దానికి బదులు వేరే హెల్తీగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిది. ఆప్రికాట్స్, కర్జూరం, బాదాం లాంటివి తీసుకోవడం వల్ల కాస్త సుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి.. తీపి పదార్థాలు తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది.
READ MORE: చర్మం సౌందర్యాన్ని మెరుగుపరిచే హోం మేడ్ షుగర్ స్ర్కబ్
కాబట్టి రోజూ ఎక్కువ మోతాదులో పంచదార తీసుకుంటున్నారంటే.. అది అడిక్ట్ అయ్యేలా చేస్తుంది. అది శరీరంపై ప్రభావం చూపుతుంది. మీరు ఎక్కువగా పంచదార తీసుకుంటున్నారని తెలిపే.. కొన్ని సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎనర్జీ తగ్గిపోవడం, అలసట
ఎక్కువ మోతాదులో చక్కెర తీసుకోవడం తాత్కాలిక ఎనర్జీ శరీరానికి చాలానే అందుతుంది. కానీ వెంటనే వ్యతిరేక ప్రభావం చూపించడం వల్ల శక్తి కోల్పోతారు. దీనివల్ల అలసట, నీరసం, బద్ధకం, ఏకాగ్రత కోల్పోవడం సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలన్నీ మీలో కనిపిస్తున్నాయంటే.. మీరు ఎక్కువగా పంచదార తీసుకుంటున్నారని సంకేతం.

పిండిపదార్థాలు
రోజూ ఎక్కువగా పంచదారతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే.. మీకు అదే అలవాటుగా మారిపోతుంది. ఒక్కసారి వాటికి అలవాటు పడితే.. బయటపడటం చాలా కష్టం. ఇప్పటికే మీరు చక్కెర ఉత్పత్తులపై ఆసక్తి చూపుతున్నారంటే.. మీరు చక్కెరను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటున్నారని అర్థం.

రోగనిరోధక శక్తి
ఎక్కువగా పంచదార తీసుకుంటున్నారంటే.. మీ రోగనిరోధక శక్తిపైనా ప్రభావం చూపుతుంది. తరచుగా జబ్బు పడటం, బ్యాక్టీయా, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సంకేతాలు మీలో కనిపిస్తూ ఉంటే.. వెంటనే చక్కెర తినడం తగ్గించండి.

డిప్రెషన్
ఎక్కువగా పంచదార, పంచదార ఉత్పత్తులు తీసుకోవడం వల్ల.. శారీరకంగా నిస్సత్తువగా, లేజీగా, డిప్రెసివ్ గా ఉంటారు. షుగర్ తీసుకోవడం వల్ల తాత్కాలికంగా ఒత్తిడి నుంచి బయటపడినా.. తర్వాత ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కుంగుబాటుకు, ఆందోళనకు కారణమవుతుంది. ఇవన్నీ మీరు చక్కెర ఉత్పత్తులకు అడిక్ట్ అయ్యారని తెలిపే సంకేతాలు.

చర్మ సమస్యలు
ఎక్కువగా పంచదార ఉత్పత్తులు తీసుకోవడం వల్ల.. హెల్త్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు.. చర్మ సమస్యలు కూడా వేధిస్తాయి. జిడ్డు చర్మం, యాక్నే, ఎగ్జిమా వంటి సమస్యలు వస్తాయి. మచ్చలకు కూడా కారణమవుతుంది.

బరువు పెరగటం
శరీరానికి సరిపడేంత చక్కెర తీసుకోవాలి.. ఎక్కువ తీసుకోవడం వల్ల.. షుగర్ క్యాలరీలుగా ఉత్పత్తై.. ఫ్యాట్ పెరగడానికి కారణమవుతాయి. ఇది ఒబేసిటీ, కొలెస్ర్టాల్, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

బీపీ
పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల.. బీపీ పెరిగడానికి కారణమవుతుంది. అలాగే ఉప్పు కూడా కారణమవుతుంది. బీపీ ఒక్కసారిగా పెరగడానికి చక్కెర స్థాయిలు ఎక్కువ ఉండటం కూడా కారణమని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

పంటి సమస్యలు
ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కువగా పంచదార ఉత్పత్తులు తీసుకోవడం వల్ల పళ్లకు హాని చేస్తుంది. క్యావిటీలకు కారణమవుతాయి. మీరు తరచుగా పంటి సమస్యలతో బాధపడుతున్నారంటే.. వెంటనే పంచదార తీసుకోవడం తగ్గించడం మంచిది.



Click it and Unblock the Notifications