మేతి టీ లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

దాదాపు ఇవి లేకుండా వంటకాలు తయారుకావు.. ఏదైనా వంటకానికి మంచి రుచి రావాలంటే ఏ రూపలోనైనా, కొద్దిగా మెంతులు కలపవలసిందే! మెంతి కూర పప్పు, మెంతి పరోటా, మెంతి కూర పచ్చడి, మెంతి ఆవాకాయ.....ఒకటేమిటి! ఇలా ఎన్నో రకాల వంటకాలు. ఇంచుమించు అన్ని రకాల వంటకాల్లో మెంతులను వాడుతూ ఉంటాం. ఎందుకంటే మెంతులకు ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఔషధ లక్షణాలు కలిగిన మెంతులను వాడటం వలన మనకు ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుని మరీ వాడుకుందాం!

మెంతులను ఇంగ్లీషులో ఫెనుగ్రీక్ సీడ్స్ అంటారు. వీటికి మంచి సువాసన వున్న కారణంగా వంటకాలలో వాడతారు. మెంతులలో కావలసినంత ఫైబర్ ఉంటుంది. మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. అతి తక్కువ కేలరీలు. ఇంకా ఇందులో ముసిలాజినస్షైబర్, గ్లైకోసైడ్ స్టెరాయిడల్,మరిన్ కాంపౌడ్స్, అమినో యాసిడ్స్ మరియు హైలెవల్స్ ఫాలిఫినాలిక్ గ్లైకోనాయిడ్స్ ఉంటాయి.

మంచి సువాసనగాను, ఆరోగ్యంగా బరువు తగ్గేటందుకు మెంతులను వాడుకోవచ్చు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే...మరి ఇన్ని ఔషధ గుణాలన్న ఈ మెంతులతో టీ తయారుచేసి తాగడం వల్ల ఆరోగ్యానికి అద్భుతంగా సహాయపడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మరి ప్రతి రోజూ ఉదయం మనం తీసుకొనే ఛాయ్ కు బదులు ఆర్గానిక్ మెంతి టీ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయో.నాలు పొందవచ్చో తెలుసుకుందాం...

మెంతి టీ ఎలా తయారుచేయాలి:

చెంచాడు మెంతులను మిక్సీ పట్టి, దానిని వేడినీటిలో మూడు గంటల పాటు నాననివ్వాలి. ఆ నీటిని టీ పొడితో కలిపి మరిగించి దానికి కొన్ని చుక్కల నిమ్మరసం, రవ్వంత తేనె కలుపుకొని వేడి వేడిగా ఆస్వాదించాలి.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

అధికబరువు ఉన్నవారు నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరకడుపున తీసుకున్నందువలన, బరువును కోల్పోతారు. లేదా మెంతులను మరిగే నీటిలో వేసి బాగా ఉడికించి కొద్దిగా నిమ్మరసం, తేనె మిక్స్ చేసి రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చు. మెంతులలో కార్బోహైడ్రేట్లు తక్కువ. ఫలితంగా మీకు అధిక బరువు చేరదు. బరువు తగ్గాలంటే మీరు కేలరీలు తగ్గించాలి. మెంతులు చాలా తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. మెంతులు ఎలా తినాలి? ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానపెట్టాలి. వేడినీటితో ఉదయంవేళ ఖాళీ కడుపుతో తినాలి. ఇవి మీలోని వ్యర్ధ పదార్ధాలను విసర్జించటమే కాదు బరువును గణనీయంగా తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. లేదా వేడి నీటితో వాటిని నమిలివేయవచ్చు.

పీరియడ్స్ సమస్యలను నివారిస్తుంది:

పీరియడ్స్ సమస్యలను నివారిస్తుంది:

గర్భాశయ వ్యాధుల్లోనూ, ఇతర స్ర్తిల వ్యాధుల్లోనూ, పునరుత్పత్తికి చెందిన అంగ ప్రత్యంగాల సమస్యల్లోనూ మెంతులు ఔషధంగా పని చేసినట్లు అధ్యయనాల్లో తేలింది. మెంతుల్లో డే సపోనిన్స్‌లో ఫైటోఈస్ట్రోజన్స్ తయారీకి అవసరమైన ప్రికర్సార్లు - డోయోస్‌జెనిన్స్ అనేవి మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ప్రసవం తరువాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవడమే కాకుండా గర్భాశయంలో సంచితమైన రక్తం వెలుపలకి వచ్చేసి గర్భాశయ శుద్ధి జరుగుతుంది. రసధాతువు మీద మెంతుల్లోని పోషకాంశాలు పని చేయటం వల్ల తల్లిపాల తయారీకి ఇది సహాయపడుతుంది. నొప్పితో కూడిన బహిష్టులో ఇది వేడిని ఉత్పన్నం చేయటం ద్వారా రక్తప్రసరణను పెంచి దోష సంచితాన్ని తగ్గిస్తుంది.

తల్లి పాలు సంవ్రుద్దిగా పడుతాయి:

తల్లి పాలు సంవ్రుద్దిగా పడుతాయి:

మెంతులలో ఉన్న ‘డైయోస్ జెనిన్' పదార్ధం, శిశువులకు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది.. అందువలన బాలింతరాళ్ళు మెంతులను ఆహారంలో తీసుకోవటం మంచిది. మెంతులు గర్భిణులు ఆహారంలో పరిమితంగా, క్రమంతప్పకుండా తీసుకున్నందువలన ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచాలను ఉత్తేజపరిచి, నొప్పులను కూడా తగ్గిస్తుంది.

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

మెంతి పేస్ట్ లో ముంచిన ఒక శుభ్రమైన వస్త్రంను చర్మం ఇన్ఫెక్షన్స్ అయిన ప్రదేశంలో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది స్కిన్ బర్న్, బొబ్బలు, తామర వంటి వాటి నుండి చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది.

రెస్పిరేటరీ సమస్యలను నివారిస్తుంది:

రెస్పిరేటరీ సమస్యలను నివారిస్తుంది:

ప్రతి రోరూ 1/4కప్పు మెంతి టీ తాగడం వల్ల మైల్డ్ ఫ్లూ మరియు శ్వాస సంబంధిత సమస్యలను నుండి ఉపశమనం పొందవచ్చు . అలాగే ముక్కు దిబ్బడ, బ్రొంకైటిస్ ను నివారిస్తుంది. ఇందులో ఉండే డ్యూరియాటిక్ లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇన్ఫ్లూయాంజ, ఫ్ల్లూమోనియా, సైనస్ మరియు ఫీవర్ లక్షణాలను దూరం చేస్తుంది.

బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

మహిళలు ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కు గురౌతుంటారు. ఇంకా టాంపాన్స్,లేదా ప్యాడ్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా బ్లాడర్ ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది . ఈ సమస్యకు మేతి టీ గ్రేట్ గా సహాయపడుతుంది . డ్యూరియాటిక్ మెతీ యూరినరీ ట్రాక్ ను శుభ్రం చేసి, టాక్సిన్స్ తొలగించి ఇన్ఫ్లెక్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

శరీర దుర్వాసనను తగ్గిస్తుంది:

శరీర దుర్వాసనను తగ్గిస్తుంది:

తరచూ చెమట, దుర్వాసనకు గురి అవుతుంటే మేతి టీ గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది బ్లడ్ స్ట్రెన్ , గ్యాస్ట్రోఇన్ టెన్సినల్ ట్రాక్ మరియు ఇతర నాళాలను శుభ్రం చేసి బ్యాడ్ బ్రీత్ ను దూరం చేస్తుంది. శరీర దుర్వాసనను దూరం చేస్తుంది.

 కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

అధ్యయనాల ప్రకారం, మెంతులలో ముఖ్యంగా, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించటానికి సహాయపడే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) ఉన్నదని తెలుస్తున్నది. మెంతులు, కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజెరైడ్స్ శోషణ నిరోధించే స్టెరాయిడ్ సపోనిన్లు యొక్క గొప్ప మూలం. వీటిలో అధిక మొత్తంలో పొటాషియం ఉన్నది. ఈ పొటాషియం రక్తపోటు, గుండె రేటును నియంత్రించే సోడియంను సరిగా పనిచేసేట్లుగ చూస్తుంది.

 రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

మధుమేహంతో బాధపడేవారు తప్పనిసరిగా మెంతులను తమ ఆహారంలో చేర్చుకోవాలి. మెంతుల్లో ఉండే సహజంగా కరిగే ఫైబర్, ‘గలాక్తోమన్నన్' ఉండటం వలన రక్తంలో చక్కెర శోషించే రేటును తగ్గిస్తుంది. వీటిలో ఆమినో ఆమ్లం ఉండటం వలన మధుమేహాన్ని నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అందువలన మెంతులు మధుమేహ వ్యాధిగ్రస్తుల పాలిట వరం. వీటిని ఏ రూపంలోనైనా ఆహారంలో తీసుకోవటం మంచిది.

పొట్ట సమస్యలను నివారిస్తుంది:

పొట్ట సమస్యలను నివారిస్తుంది:

మెంతులలో ఫైబర్, అనామ్లజనకాలు అధికమొత్తంలో ఉన్నాయి. వీటిని తీసుకోవటంవలన విషపదార్థాలను బయటకు నెట్టివేసి, జీర్ణక్రియను సజావుగా సాగేట్లు చేస్తుంది. మెంతులతో తయారుచేసిన టీ, అజీర్ణం, కడుపునొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. మెంతుల కషాయం ఉదయంపూట తీసుకోవటం వలన మలబద్ధకం నివారింపబడుతుంది. కొద్దిగా మెంతులను పెరుగులో కలిపి తీసుకుంటే అతిసారం తగ్గుతుంది.

Story first published: Monday, May 9, 2016, 19:00 [IST]
Desktop Bottom Promotion