Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
నిద్రలేమి వల్ల కలిగే డేంజరెస్ సైడ్ ఎఫెక్ట్స్
మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో, అదే విధంగా నిద్ర కూడా చాలా అవసరం. రోజుకు సరిపడా నిద్రపోకపోతే వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది సమయానికి నిద్రపోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. లేట్ నైట్ వరకూ నిద్రపోకుండా, సమయాన్ని స్కిప్ చేస్తుంటారు. అప్పుడే ప్రారంభమౌతాయి అసలైన సమస్యలు.
కాబట్టి ప్రతి రోజూ మంచి ఆహారంతో పాటు, గాఢ నిద్ర కూడా అవసరం. సరిగా నిద్రలేకపోతే నిద్రలేమి సమస్యకు కారణమవుతుంది. ముఖ్యంగా ఫిజికల్ గా, మెంటల్ గా దుష్ప్రభావాలు చూపుతాయి. ఎక్కువ రోజులు ఇలా కొనసాగితే క్రోనిక్ హెల్త్ ప్రాబ్లెక్స్ కు దారితీస్తుంది. జీవనశైలి మీద ప్రభావం చూపుతుంది.
నేషనల్ స్లీప్ ఫౌండేషన్ రీసెర్చ్ ప్రకారం, పెద్దల 7 నుంచి 8 గంట నిద్ర అవసరం. ఇది మానసిక, శారీరికి స్థితి మీద ప్రభావం చూపుతుంది. వయస్సు, సెక్స్, నిద్ర అనేవి జీవితంలో ముఖ్యమైన అంశాలుగా సూచిస్తున్నారు.
బిజీ లైఫ్, వర్క్ లోడ్, ఇతర విషయాల్లో బిజీగా ఉండటం వల్ల సరిగా నిద్రపోలేకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి నిద్రకోసం కొంత సమయాన్ని అడ్జెస్ట్ చేసుకోవాలి. నిద్రలేమి సమస్యల వల్ల వచ్చే నెగటివిటిని నివారించుకోవాలి. నిద్రలేమి వల్ల కొన్ని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.అవేంటంటే..

మెమరీ మరియు బ్రెయిన్ ఎఫెక్ట్
ప్రతి రోజు సరిగా నిద్రపోకపోవడం వల్ల మెమరీ మీద దుష్ప్రభావం చూపుతుంది. ఏకాగ్రత కోల్పోతారు. మతిమరుపుకు దారితీస్తుంది . ఆలోచించడానికి మరియు నేర్చుకోవడానికి ముఖ్య పాత్ర పోషించే మెదడు మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే, రోజు ఒకే సమయానికి నిద్రిపోవాలి, నిద్రలేమి సమస్యలను దూం చేసుకోవచ్చు.

హార్ట్ కు సమస్యలు
నిద్రలేమి వల్ల హార్ట్ మీద కూడా ప్రభావం చూపుతుంది. నిద్రలేమి సమస్యల వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. నిద్రలేమితో పాటు వ్యాయామం చేసే అలవాట్లు లేకపోవడం హార్ట్ సమస్యలకు కారమవుతుంది.

వ్యాదినిరోధక శక్తి తగ్గుతుంది
నిద్రలేమి సమస్య వల్ల వ్యాధినిరోధకత మీద ప్రభావం చూపుతుంది. ఇది ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది. కామన్ కోల్డ్ జలుబు వంటి సమస్యలకు దారితీస్తుంది. వ్యాధినిరోధకత లోపించడం వల్ల శరీరంలో మనకు తెలియకుండానే వైరస్, బ్యాక్టీరియా చేరి మరింత అనారోగ్యానికి కారణమవుతాయి. నిద్రపోయినప్పుడు సైటోకినిన్ అనే ప్రోటీన్ విడుదలవుతుంది. ఇది ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది . ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

డిప్రెషన్ కు కారణమవుతుంది
నిద్రలేమి సమస్యలు క్రమంగా అలాగే ఉంటే డిప్రెషన్ కు దారితీస్తుంది. ఇది నేరుగా బ్రెయిల్ లోని న్యూరోట్రాన్సిమిట్టర్ ఫంక్షన్ మీద ప్రభావం చూపుతుంది. డిప్రెషన్ కు ఇది ప్రధానకారణం. డిప్రెషన్ వ్యక్తిలో శక్తి సామర్థ్యాలు తగ్గిస్తుంది.

బరువు పెరగడానికి
రెగ్యులర్ గా నిద్రపోవడం వల్ల సమయం ప్రకారం ఆకలి పెరుగుతుంది. అదే సరిగా నిద్రలేకపోతే, శరీరంలో గ్రెలిన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ హార్మోన్ క్రమబద్దం చేస్తుంది. ఆకలిని పెంచే లెప్టిన్ హార్మోన్ తగ్గిస్తుంది. దాంతో నిద్రలేమి సమస్య ఆకలి మీద ప్రభావం చూపుతుంది .

డయాబెటిస్ రిస్క్
నిద్రలేమి సమస్యలకు ఎక్కువ రోజులున్నట్లైతే దీర్ఘకాలంలో డయాబెటిస్ కు దారితీస్తుది. క్రోనిక్ డిసీజ్ మరియు డయాబెటిస్ కు కారణమవుతుంది.

స్కిన్ డ్యామేజ్ అవుతుంది
జస్ట్ ఒక రోజు సరిగా నిద్రపోకపోతేనే కళ్ల క్రింద నల్లటి వలయాలుగా కనబడుతాయి. కళ్లు వాపులతో కనిపిస్తుంది. స్కిన్ డ్యామేజ్ అవుతుంది. నిద్రలేమి సమస్య నేరుగా స్కిన్ ఎలాసిటి మీద ప్రభావం చూపుతుంది. స్లీప్ ప్యాట్రన్స్ ఎక్సెసివ్ స్ట్రెస్ కు కారణమవుతుంది. దాంతో శరీరంలో కార్టిసోల్ హార్మో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ ప్రోటీన్ విచ్చిన్నం చేస్తుంది. చర్మం ఎలాసిటి పెంచుతుంది. చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది.

త్వరగా మరణిస్తారు
బ్రీత్, స్లీప్ వంటివి మనిషికి అత్యవసరమైనవి. నిద్రలేకుండా జీవించడంలేము . కొన్ని రోజులు నిద్రపోకపోతే శరీరంలో 700కు పైగా జనటిక్ మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులు, క్రమంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

అలసట వల్ల ఇతర సమస్యలు
నిద్రలేమి సమస్యల వల్ల సీరియస్ సై్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కళ్ళు తిరగడం, డ్రైవింగ్ సరిగా చేయకపోవడం వల్ల ప్రమాధకర పరిస్థితిని ఎదుర్కోవల్సి వస్తుంది. నిద్రలేమి లేదా డ్రైవింగ్ సమయంలో ఫ్యాట్ గ్యు వల్ల రోడ్ల మీద ప్రమాధాలు జరిగే అవకాశం ఉంది.

సెక్స్ లైఫ్
నిద్రలేమి సమస్య సెక్స్ లైఫ్ ను పాడుచేస్తుంది. నిద్రలేమి సమస్య వల్ల నేరుగా వ్యక్తి యొక్క ఎనర్జీలెవల్స్ క్రమంగా తగ్గిపోతాయి.



Click it and Unblock the Notifications