Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఏకాగ్రత కోల్పోతున్నారా ? ఐతే కారణాలు తెలుసుకోండి..!
ఏదైనా పనిచేసేటప్పుడు ఏకాగ్రత కోల్పోతున్నారా ? ప్రతిసారీ.. మీరు చేసే పనిలో కాన్సంట్రేషన్ మిస్ అవుతున్నట్టు గమనిస్తున్నారా ? ఏకాగ్రత కుదరకపోవడం వల్ల.. మీకున్న టాస్క్ లు పూర్తి చేయలేకపోతున్నారా ? అయితే.. దానికి కారణాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మీ ఏకాగ్రతను నాశనం చేస్తున్నదేంటో ఒక్కసారి చూడాలి.
ఏకాగ్రత కోల్పోతే.. మీరు చేసే పనిలో క్వాలిటీ తగ్గిపోతుంది. చేసే పనిలో ఫోకస్, శ్రద్ద ఉంటేనే.. అది సక్సెస్ అవుతుంది. ఉదాహరణకు మీకు ఏకాగ్రత తగ్గినప్పుడు ఎగ్జామ్స్ కి లేదా టెస్ట్ లకు చదవడం కూడా కష్టమవుతుంది. దీనివల్ల ఫలితాలు తారుమారు అవుతాయి. ఇది ఎడ్యుకేషన్ పైనా దుష్ర్పభావం చూపుతుంది.

ఏకాగ్రత తగ్గిపోతే.. మీ పనిచేసే ఆఫీస్ లోకూడా రిలేషన్స్ తగ్గిపోతాయి. మీకిచ్చిన టాస్క్ లు పూర్తిచేయకపోతే మీపై దురభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి చెప్పే మాటలను శ్రద్ధగా వినలేకపోతే.. వాళ్ల ప్రేమను మిస్సవ్వాల్సి వస్తుంది. కాబట్టి.. ఏకాగ్రత అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది.
ఏకాగ్రత కోల్పోవడానికి చాలా కారణాలుంటాయి. మీ ఉద్యోగం, అలసట, అనారోగ్య సమస్యలు కూడా ఏకాగ్రత కోల్పోవడానికి కారణమవుతాయి. కాబట్టి.. ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో ఏకాగ్రత కోల్పోవడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. వాటిని ఒక్కసారి చూడటం వల్ల.. ఏకాగ్రత మిస్ అవకుండా.. జాగ్రత్త పడవచ్చు.

ఎక్కువగా సోషల్ మీడియా ఉపయోగించడం
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. కొత్త కొత్త అప్ డేట్స్, ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అందించడం ఇలా.. రకరకాలుగా.. ప్రయత్నిస్తూ.. వాళ్లు ఏకాగ్రతను మొత్తం సోషల్ మీడియాలో పెడుతూ.. వర్క్, స్టడీస్ మీద పెట్టడం లేదు. పదే పదే ఫోన్లను చూస్తూ ఉండటం వల్ల.. సోషల్ మీడియా అప్ డేట్స్, సెల్ఫీలు పోస్ట్ చేయడం వల్ల.. మీ కాన్సంట్రేషన్ లెవెల్స్ చాలా త్వరగా తగ్గిపోతున్నాయి.
ఆకలి
ఆకలి కూడా.. ఏకాగ్రత లెవెల్స్ తగ్గించడానికి కారణమవుతుంది. తరచుగా ఆకలివేయడం, ఏమీ తినకపోవడం వల్ల మీ ఏకాగ్రత డైవర్ట్ అవుతుంది. మళ్లీ ఆకలిగా అనిపిస్తుంది. దీనివల్ల ప్రస్తుతం చేస్తున్న పనిపై ఏకాగ్రత పెట్టలేకపోతారు. కాబట్టి మిమ్మల్ని మీరు ఏకాగ్రత కోల్పోకుండా ఉండాలంటే.. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. దీనివల్ల ఏకాగ్రత కావాల్సినంత ఉంటుంది.

డిప్రెషన్
డిప్రెషన్ లేదా అత్యంత ఎక్కువ ఒత్తిడి, ఆందోళన కాన్సంట్రేషన్ కోల్పోవడానికి కారణమవుతుంది. మైండ్ ఎప్పుడు ఆలోచనలతో నిండిపోతే.. లేదా ఒత్తిడికి గురవుతూ ఉంటే.. ఏ పనిశ్రద్ధగా చేయలేకపోతారు. ఎప్పుడూ ఏదో కోల్పోయిన ఫీలింగ్ వెంటాడుతుందే తప్ప చేసే పనిలో ధ్యాస పెట్టలేకపోతారు.
డిప్రెషన్ వల్ల బాధగా ఉండటం, ఆసక్తికోల్పోవడం వంటి వన్నీ.. ఏకాగ్రత కోల్పోవడానికి కారణమవుతుంది. కాబట్టి.. ఏకాగ్రత కోల్పోతున్నారని గ్రహించిన వెంటనే.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పైన చెప్పిన వాటికి దూరంగా ఉంటే.. ఏకాగ్రత సరిగా కుదురుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications