Latest Updates
-
జూన్ 8: ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా..
హార్ట్ ఎటాక్ రావడానికి నెల ముందు కనిపించే 7 డేంజర్ సంకేతాలు
నయం చేయడం కంటే.. అరికట్టడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. అయితే.. జరగబోయేదాన్ని ఎలా అరికట్టాలనేది చాలామందికి డౌట్. అయితే మనకు కొన్ని రకాల వ్యాధుల లక్షణాల తెలియనప్పుడు దాన్ని అరికట్టడం కష్టమవుతుంది. కాబట్టి.. కొన్ని ప్రాణాంతక వ్యాధుల లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు..!!
లక్షణాలపై అవగాహ ఉంటే.. ఏదైనా వార్నింగ్ సంకేతాలు కనిపించినప్పుడే వెంటనే డాక్టర్ ని సంప్రదించడమే.. వెంటనే అలర్ట్ అయి.. జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. మనతోపాటు, మన పక్కనవాళ్ల ప్రాణాలను కూడా కాపాడవచ్చు. చాలా సందర్భాల్లో చాలా మంది.. కొన్ని లక్షణాలను ఫేస్ చేసినా.. వాటిపై అవగాహన లేకపోవడం వల్ల తమకు ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతారు.
క్యాన్సర్, హార్ట్ డిసీజ్ లు.. ఎలాంటి వార్నింగ్ సంకేతాలు ఇవ్వవు. వీటిని ట్రీట్మెంట్ కి వెళ్లేంతవరకు గుర్తించడం కష్టంగా ఉంటుంది. కాబట్టి.. వీటిపై రెగ్యులర్ టెస్ట్ లు చేయించుకుంటూ ఉండటం మంచిది. దీనివల్ల.. ఈ వ్యాధులను ముందుగానే నిరోధించడం సాధ్యమవుతుంది.
గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ స్పైసెస్ కంపల్సరీ..
ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు.. ఫాస్ట్ ఫుడ్ కల్చర్, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవకపోవడం వల్ల వస్తున్నాయి. కాబట్టి.. హార్ట్ ఎటాక్ రావడానికి సంకేతంగా కనిపించే లక్షణాలు.. ఒక నెల ముందే కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి అలాంటి వార్నింగ్ సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం..

చెస్ట్ లో పట్టేసినట్టు
చెస్ట్ లో పట్టేసినట్టు, బిగుతుగా, ఒత్తిడి పెరిగినట్టు, బర్నింగ్ సెన్సేషన్ వంటి లక్షణాలను గమనించినట్టైతే.. అవి డేంజర్ అని గుర్తించండి. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

తీవ్రమైన అలసట
చాలా ఎక్కువగా అలసిపోవడం, ఎలాంటి కారణం లేకుండానే నిస్సత్తువగా అనిపించడం వంటి లక్షణాలు.. హార్ట్ ఎటాక్ కి సంకేతం కావచ్చు. ఇలాంటి లక్షణాలు.. ఒక నెల ముందు నుంచే కనిపిస్తుంటాయి.

దీర్షకాలంగా జలుబు
ఒకవేళ మీరు దీర్ఘకాలంగా జలుబు, ఇన్ఫెక్షన్ తో బాధనపడుతున్నారంటే.. హార్ట్ ఎటాక్ కి సంకేతమని గుర్తించండి. గుండె కావాల్సినంత ఆక్సిజన్ పొందలేనప్పుడు ఇమ్యున్ సిస్టమ్ పై దుష్ర్పభావం పడుతుంది. దీనివల్ల దీర్ఘకాలంగా జలుబుతో బాధపడే అవకాశాలున్నాయి.

వాపులు
పాదాలు, పొట్ట, చేతులు వంటి శరీర భాగాల్లో వాపులు గుర్తించారంటే.. హార్ట్ సరిగ్గా రక్తాన్ని శుద్ధి చేయడం లేదని గుర్తించండి. దీనివల్ల.. గుండె సంబంధిత సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది.

శ్వాసలో ఇబ్బంది
హార్ట్ వీక్ గా మారినప్పుడు.. ఊపిరితిత్తులు సజావుగా పనిచేయడానికి సరిపడా బ్లడ్ ని గుండె సరఫరా చేయలేకపోతుంది. దీనివల్ల.. బ్రీతింగ్ సమస్య మొదలవుతుంది.

మైకం అనిపించడం
ఎలాంటి కారణం లేకుండా.. తరచుగా మీరు మైకంగా ఫీలవుతుండటం, తరచుగా తలనొప్పి బలహీనమైన గుండెకు సంకేతం. అంటే.. మెదడుకి కావాల్సినంత రక్తాన్ని గుండె..సరఫరా చేయకపోవడం వల్ల.. ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి. ఇవన్నీ హార్ట్ ఎటాక్ కి సంకేతంగా గుర్తించి డాక్టర్ ని సంప్రదించాలి.

వికారం
హెల్తీ ఫుడ్ తీసుకున్నా.. తరచుగా అజీర్ణం, హార్ట్ బర్న్, వికారం వంటి సమస్యలతో బాధపడుతున్నారంటే.. ఒక నెలలో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి లక్షణాలన్నీ మీలో కనిపిస్తున్నాయంటే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించి, సరైన సలహాలు, టెస్ట్ లు చేయించుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications