Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కిడ్నీ, కొలెస్ర్టాల్ సమస్యలతో పోరాడే సత్తా కీరాదే..
నీటిశాతాన్ని ఎక్కువగా కలిగి ఉండే దోసకాయ తింటే తినాలపిస్తుంది. చల్లగా.. స్వీట్ నెస్ ఎక్కువగా లేకుండా.. రుచికరంగా ఉండే అద్భుతమైనది దోసకాయ. ఇందులో ఎన్నో పోషక విలువలు దాగున్నాయి. దీన్ని తినడం వల్ల శరరీంలోని విషపదార్థాలు తొలగిపోయి, కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది. అలాగే చర్మ సౌందర్యానికి కూడా దోసకాయ చక్కగా ఉపయోగపడుతుంది.
READ MORE: ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉందా ? ఐతే ఈ జాగ్రత్తలు కంపల్సరీ..
నీటిశాతం ఎక్కువగా ఉండే పదార్థాల్లో కీరాదోస ఒకటి. దాదాపు 96 శాతం వరకు నీరు ఉండే దీన్ని తినడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందచ్చు. తద్వారా శరీరానికి చలువ చేస్తుంది. కీరాదోసను రోజూ సలాడ్స్‌లో భాగం చేసుకోవడం లేదంటే కొవ్వు శాతం తక్కువగా ఉండే పెరుగుతో కలిపి తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఇందులో ఉండే స్టెరోల్స్ అనే సమ్మేళనం శరీరంలో చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

కీరా దోసకూడా కిడ్నీలను, నాడీవ్యవస్థను మెరుగు పరుస్తుంది. దోసకాయ మూత్ర పిండాల పనితీరుకు దోహద పడుతుంది. యూరిక్ యాసిడ్ నియంత్రించే గుణం కీరా దోసలో ఉండటం వల్ల మూత్రపిండంలో రాళ్లు ఏర్పడవు. అలాగే ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం, సోడియంలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అలాగే కీరా బీపీ, హై బీపీ పేషెంట్లకు మేలు చేస్తుంది. కాబట్టి బీపీ, హైబీపీతో బాధపడేవాళ్లకు రెగ్యులర్ డైట్ లో దోసకాయ చేర్చుకోవడం మంచిది.

మధుమేహంతో బాధపడేవాళ్లకు కూడా దోసకాయ చక్కటి పరిష్కారం. దోసకాయ అరగటానికి సమయం పడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆహారం తీసుకోకపోయినా.. రక్తపోటును సమతుల్యంలో ఉంచటానికి కీరా సహాయపడుతుంది. కీరా దోసలో ఫైసెటిన్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫ్లేవనాల్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా తోడ్పడుతుంది.

దోసకాయ తీసుకోవడం వల్ల మరో అద్భుతమైన ప్రయోజనం ఉంది. చిగుళ్ల సమస్యతో బాధపడేవారికి దోసకాయ చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. కీరాలోని సిలికా కణాలు చర్మం కాంతివంతంగా మృదువుగా మారడానికి సహాయపడతాయి. కళ్ల కింద నల్లటి వలయాలను కూడా నివారిస్తుంది. సిలికాన్, సల్ఫర్ లు సమృద్ధిగా ఉండే కీరా జుట్టు పెరుగుదలకి కూడా తోడ్పడుతుంది.

READ MORE: ప్రాణాంతక క్యాన్సర్ ని దూరం చేసే ఫుడ్ హ్యాబిట్స్
క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించే సత్తా కూడా కీరా దోసలో ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఇందులో ఉండే లిగ్నాన్స్.. ఫైటోన్యూట్రియంట్ సమ్మేళనాలే. కాబట్టి దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు పెరగకుండా కాపాడుతుంది. దోసకాయలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. అలాగే నోటి దుర్వాసనను పోగొట్టి తాజా శ్వాసను అందించడంలోనూ కీరాదోస ఉపయోగపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడి ఉన్న కీరా దోసకాయను నిర్లక్ష్యం చేయరు కదూ..!!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications