Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిమ్మరసంలో దాల్చినచెక్క కలిపి తీసుకుంటే పొందే అద్భుత ప్రయోజనాలు
నిమ్మ, దాల్చిన చెక్కను విడివిడిగా తీసుకున్నప్పుడు అందులోని ప్రయోజనాలు పొందవచ్చు. అయితే.. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే.. మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని స్టడీస్ తేల్చాయి.
నిమ్మ, దాల్చిన చెక్కను విడివిడిగా తీసుకున్నప్పుడు అందులోని ప్రయోజనాలు పొందవచ్చు. అయితే.. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే.. మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని స్టడీస్ తేల్చాయి. కాబట్టి.. ఈ రెండింటి మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకోవడం మొదలుపెట్టండి.

నిమ్మ శరీరాన్ని డెటాక్సిఫై చేస్తుంది. ఇమ్యునిటీని మెరుగుపరుస్తుంది. అజీర్ణాన్ని తగ్గిస్తుంది. ముఖంపై మచ్చలను తొలగిస్తుంది. అలాగే.. మెటబాలిజంను మెరుగుపరిచి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
దాల్చిన చెక్కను మనం చాలా వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. ఈ ఇండియన్ స్పైస్ రకరకాల హెల్త్ బెన్ఫిట్స్ అందిస్తుంది. ఇందులో యాంటీ మైడ్రోబయోల్ గుణాలుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది. యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది. అలాగే.. జీర్ణసమస్యలను నివారిస్తుంది.
ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు పొందవచ్చని.. నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ నిమ్మరసం లేదా లెమన్ జ్యూస్ తయారు చేసుకుని అందులో చిటికెడు దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి తీసుకోవాలి. ఇది టేస్టీగానూ, హెల్తీగానూ ఉంటుంది.

కీళ్ల నొప్పులు
వాపుతో, నొప్పితో ఇబ్బందిపెట్టే కీళ్ల నొప్పులను నివారించడానికి ఈ మిశ్రమం ఎఫెక్టివ్ ఫలితాన్నిస్తుంది. 2టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, 1 టీస్పూన్ తేనె, ఒక నిమ్మకాయలోని రసంను ఒక కప్పు నీటిలో కలిపి ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు తీసుకుంటే.. కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

అధిక బరువు
ఈ న్యాచురల్ రెమిడీ అధిక బరువును ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. కొద్దిగా నిమ్మరసంను, కొద్దిగా దాల్చిన చెక్క పొడిని ఒక కప్పు గ్రీన్ టీలో కలిపి.. ప్రతి రోజూ తీసుకుంటూ ఉంటే.. తేలికగా బరువు తగ్గుతారు.

దగ్గు, జలుబు
నిమ్మరసంలో విటమిన్ సి ఉండటం వల్ల ఇమ్యునిటీని మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్క పొడి.. వైరస్, బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ ఎఫెక్టివ్ గా దగ్గు, జలుబు నివారిస్తుంది.

డెటాక్సిఫికేషన్
శరీరంలో పేరుకున్న టాక్సిన్స్ ని ఒక్కసారిగా బయటకు తరిమేస్తుంది ఈ మిశ్రమం. రెండింటి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల.. కాలేయంను డెటాక్సిఫై చేస్తుంది. దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్స్ ని అందిస్తుంది.

ముడతలు
ఇది ఎఫెక్టివ్ యాంట ఏజింగ్ సొల్యూషన్ గా పనిచేస్తుంది. నిమ్మరసం, చెక్క పొడి రెండూ.. యంగ్ లుక్ ని అందిస్తాయి. కొన్ని చుక్కల నిమ్మరసంను, దాల్చిన చెక్క పొడిలో కలిపి ముఖానికి అప్లై చేయాలి. అంతే.. డ్యామేజ్ అయిన చర్మాన్ని, చర్మంపై ముడతలను నివారిస్తుంది.

జుట్టుకి
నిమ్మలో విటమిన్ సి ఉండటం వల్ల స్కాల్ప్ ని శుభ్రం చేస్తుంది. జుట్టుకి షైనింగ్ ని ఇస్తుంది. దాల్చిన చెక్క పొడి.. స్కాల్ప్ కి పోషణ అందిస్తుంది. షాంపూ చేసుకోవడానికి ముందు.. నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి మిశ్రమాన్ని స్కాల్ప్ కి పట్టించాలి.

మొటిమలు నివారించడానికి
ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి..మొటిమలపై అప్లై చేస్తే.. చాలా ఎఫెక్టివ్ గా, త్వరగా తగ్గిస్తుంది. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications