Latest Updates
-
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.!
నిద్రలేవగానే ఉడికించిన నిమ్మకాయ నీటిని తాగితే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!
4 నుంచి 5 నిమ్మకాయలు తీసుకుని, శుభ్రం చేసుకోవాలి. రెండు భాగాలు కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లుపోసి 3 నుంచి 5 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఆ నీటిని వడకట్టి.. తాగాలి.
నిమ్మరసం తీసి నీటిలో కలిపి ఉదయాన్నే తాగితే పొందే ప్రయోజనాల గురించి వినే ఉంటారు. అలాగే ఇది బరువు తగ్గడానికి ఎఫెక్టివ్ రెమెడీ కూడా. కానీ నిమ్మకాయలను తొక్కతోపాటే ఉడికించి.. ఆ నీటిని తాగితే.. ? ఈ ఆలోచన కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ వాటర్ ద్వారా ఎక్కువ పోషకాలు పొందవచ్చు.

ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, ఏ, బి6, విటమిన్ ఈ, క్యాల్షియం, ఐరన్, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ నిమ్మలో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలోని అనేక వ్యాధులను నయం చేయగలుగుతాయి. కాబట్టి.. నిమ్మకాయలు తొక్కతో సహా ఉడికించిన తర్వాత ఆ నీటిని తాగడం వల్ల పొందే బెన్ఫిట్స్ చాలా ఉన్నాయి.
డ్రింక్ తయారు చేసే విధానం
4 నుంచి 5 నిమ్మకాయలు తీసుకుని, శుభ్రం చేసుకోవాలి. రెండు భాగాలు కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లుపోసి 3 నుంచి 5 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఆ నీటిని వడకట్టి.. తాగాలి. ఇది రుచిగా ఉండదు. 1టీస్పూన్ తేనె కలుపుకుంటే మంచిది. అయితే ఈ డ్రింక్ ఉదయం నిద్రలేవగానే తాగడం వల్ల పొందే బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

ఇమ్యునిటీ
నిమ్మలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యునిటీ పవర్ ని పెంచడంలో సహాయపడుతుంది.

జలుబు
నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబుని చాలా వేగంగా, ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

జీర్ణక్రియ
నిమ్మరసం శరీరంలో పేరుకున్న మలినాలను బయటకు పంపుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

బరువు తగ్గడానికి
నిమ్మలో పెక్టిన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవాళ్లు ఈ డ్రింక్ ని రెగ్యులర్ గా తీసుకోవచ్చు.

ఎనర్జీ
నిమ్మ ఎనర్జీని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. నిమ్మ తొక్కలో అరోమా ఉంటుంది. దీన్ని ఉడికించి ఆ నీటిని తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ మెరుగుపడతాయి.

మెటబాలిజం
నిమ్మలో క్యాలరీలు కరిగించే సత్తా ఉంటుంది. అలాగే నిమ్మలో పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల మెటబాలిజంను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

టాక్సిన్స్ తొలగించడానికి
నిమ్మలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల.. ఎంజైమ్ల పనితీరుకి సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని డెటాక్సిఫై చేస్తుంది.

కాన్ట్సిపేషన్
నిమ్మలో ఎక్కువ యాసిడ్ ఉండటం వల్ల బోవెల్ మూమెంట్స్ ని క్లియర్ చేస్తుంది. కాబట్టి నిమ్మకాయను ఉడికించిన నీటిని తాగడం వల్ల కాన్ట్సిపేషన్ నివారించవచ్చు.



Click it and Unblock the Notifications