Latest Updates
-
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.!
చేతిగోళ్లపై అర్థచంద్రాకారం లేకపోతే ప్రమాదంలో పడ్డట్టే..!
గోళ్లపై అర్ధచంద్రాకారం అనేది చాలా ముఖ్యమైనదని, ఇది లేకపోతే.. ప్రమాదంలో పడినట్టే అని నిపుణులు సూచిస్తున్నారు. మరి చేతిగోళ్లపై అర్ధచంద్రాకారం లేకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం..
చేతిగోళ్లపై చాలామందికి అర్ధచంద్రాకారం కనిపిస్తుంది. కొంతమందికి ఇది పెద్దగా కనిపించదు. మరికొందరికి ఉండీ ఉండనట్టు ఉంటుంది. అయితే చేతిగోళ్లపై తెల్లగా ఉండే అర్ధచంద్రాకారం.. శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం.

ఇది చాలా సున్నితమైన భాగం. ఈ ఆకారం సైజ్ కూడా.. మీకు వచ్చే, మీకున్న వ్యాధులను సూచిస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఒకవేళ అర్ధచంద్రాకారం లేకపోయినా లేదా ఆకారం తగ్గిపోయినా.. కొన్ని రకాల వ్యాధులకు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా గోళ్లకు మొదట్లో అంటే.. చర్మం దగ్గర అర్థచంద్రాకారం కనిపిస్తుంది. సన్నటి ఆకారం ఉంటుంది. ఇది సాధారణంగా బొటనవేలుపై బాగా గుర్తించవచ్చు. తెలుపు రంగులో ఉంటుంది. అయితే గోళ్లపై అర్ధచంద్రాకారం అనేది చాలా ముఖ్యమైనదని, ఇది లేకపోతే.. ప్రమాదంలో పడినట్టే అని నిపుణులు సూచిస్తున్నారు. మరి చేతిగోళ్లపై అర్ధచంద్రాకారం లేకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం..

గోళ్లు
శరీరంలో గోళ్లు చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే.. గోళ్ల ద్వారానే క్యాన్సర్ సహా అనేక వ్యాధుల లక్షణాలను గుర్తించవచ్చు.

అర్ధచంద్రాకారం
అర్ధచంద్రాకారాన్ని లాటిన్ లో ల్యునులా అని పిలుస్తారు. ఇది గోళ్లలో చాలా సున్నితమైన భాగం. ఈ భాగం తెల్లగా కనిపిస్తుంది.

డ్యామేజ్
గోళ్లపై ఉండే ఈ అర్ధచంద్రాకారం భాగం చాలా సున్నితమైనది. కాబట్టి ఇది ఎట్టిపరిస్థితుల్లో డ్యామేజ్ కాకూడదు. డ్యామేజ్ అయిందంటే.. మొత్తం గోరంతా శాశ్వతంగా వైకల్యంతో కనిపిస్తుంది.

డయాబెటిస్
ఈ అర్ధచంద్రాకారం గోళ్లపై లేకపోతే అనీమియా, పోషకాహార లోపంకు సంకేతాలు. అలాగే పేలవంగా, బ్లూయిష్ గా ఉండే డయాబెటిస్ రావడానికి అవకాశాలుంటాయి. ఒకవేళ రెడ్డిష్ గా ఈ అర్ధచంద్రాకారం ఉంటే.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు సంకేతం.

బొటనవేలు
బొటనవేలుపై అర్ధచంద్రాకారం లేదు అంటే.. మానసిక వ్యాధులు వచ్చే రిస్క్ ఉందని హెచ్చరిస్తుంది.

చూపుడు వేలు
చూపుడు వేలి గోళ్లపై ఈ అర్ధచంద్రాకారం లేకపోయినా, సన్నగా ఉన్నా.. పేగులలో, కాలేయంలో, జీర్ణరసాలను తయారు చేసే గ్రంథులలో సమస్యలకు సంకేతం.

మహిళలు
ఒకవేళ మహిళలకు చూపుడు వేలుపై ఈ అర్ధచంద్రాకారం లేకపోతే.. సంతానోత్పత్తి వ్యవస్థలో సమస్యలకు సంకేతమని నిపుణులు సూచిస్తున్నారు.

మధ్యవేలు
మధ్య వేలు గోరుపై అర్ధచంద్రాకారం లేకపోతే.. బ్లడ్ ప్రెజర్ లో సమస్య ఉన్నట్టు సంకేతం. కాబట్టి వెంటనే అలర్ట్ అవ్వాలి. డాక్టర్ ని సంప్రదించాలి.

ఉంగరపు వేలు
ఉంగరపు వేలుపై అర్ధచంద్రాకారం లేకపోయినా, సన్నగా ఏర్పడినట్టు కనిపించినా.. ధైరాయిడ్ గ్రంథిలో సమస్య ఉన్నట్టు హెచ్చరిస్తుంది.

చివరి వేలు
చివరి వేలుపై అర్ధచంద్రాకారం లేకపోతే.. మీ పేగులలో రక్తం గడ్డకట్టిందని, లేదా మరేదో సమస్య ఉన్నట్టు సంకేతం.



Click it and Unblock the Notifications