Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిద్రకు ముందు ఈ డ్రింక్ తాగితే.. ఎసిడిటీ, జీర్ణ సమస్యలు దూరం..!!
ఉదయాన్నే పరకడుపున అది తాగండి.. ఇది తాగండి అనే సూచనలు వింటూ ఉంటారు. నిమ్మరసం, నిమ్మ తేనె, నీళ్లు, నిమ్మరసం నీళ్లు.. ఇలా రకరకాల డ్రింక్స్ ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయని చెబుతూ ఉంటారు. అయితే.. ఉదయం పరకడుపున తాగే వాటితో పాటు.. రాత్రి నిద్రకు ముందు తాగే డ్రింక్ కూడా చాలా ముఖ్యమైనది.
ఎర్లీ మార్నింగ్ తేనె -నీళ్ళు తాగడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు
రాత్రి నిద్రకు ముందు తీసుకునే ఆహారమైనా, పానీయాలైనా.. ఆచి తూచి తీసుకోవాలి. ఎందుకంటే.. రాత్రి పూట నిద్రకు భంగం కలుగకుండా ఉండే ఆహారాలు తీసుకున్నప్పుడు కంటి నిండా నిద్రపడుతుంది. జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయి. చాలామంది స్టమక్ అప్ సెట్ తో రాత్రిళ్లు నిద్రపోకుండా బాధపడుతుంటారు. అలాంటప్పుడు డైజెషన్ మాత్రమే కాదు..కడుపులో సమస్య, హార్ట్ బర్న్ వంటి లక్షణాలు ఇబ్బందిపెడతాయి.
ఎసిడిటి సమస్యా?ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
సింపుల్ గా ఇంట్లో ఉండే పదార్థాలతో తయారుచేసుకునే డ్రింక్.. మీ నిద్రకు ఎలాంటి భంగం కలుగకుండా.. చూస్తుంది. అలాగే ఈ డ్రింక్ తాగడం వల్ల జీర్ణక్రియతో పాటు, రకరకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి రాత్రి నిద్రకు ముందు తీసుకోవాల్సిన స్పెషల్ హెల్తీ డ్రింక్ ఏంటో చూసేద్దామా..

కావాల్సిన పదార్థాలు
2 కప్పుల కొబ్బరిపాలు, 1 టీస్పూన్ పసుపు, ఒక ఇంచు అల్లం, పావు టీ స్పూన్ నల్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ తేనె.

కొబ్బరిపాలు
కొబ్బరిపాలలో హెల్తీ ఫ్యాట్ ఉంటాయి. అవి జీర్ణ సమస్యలను నివారిస్తాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ లా పనిచేస్తాయి.

పసుపు
పసుపులో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు.. అల్సర్లు, జీర్ణక్రియ సమస్యలను నివారిస్తాయి.

నల్లమిరియాలు
నల్ల మిరియాలు జీర్ణసమస్యలు రాకుండా అరికడుతుంది.

తేనె
తేనెలో విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, ఎమినో యాసిడ్స్ ఉంటాయి. దీని ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. అలాగే ఇది డైజెస్టివ్ ట్రాక్ ని స్మూత్ గా చేసి.. ఎలాంటి సమస్య లేకుండా చూస్తుంది.

డ్రింక్ తయారు చేసే విధానం
నల్ల మిరియాలు, అల్లం, పసుపు, కొబ్బరిపాలను ఒక కప్పులో కలపాలి. అన్నింటినీ మిక్స్ చేశాక.. సాస్ ప్యాన్ లో పోసి.. తక్కువ మంటపై పెట్టాలి. 5 నిమిషాలు వేడి చేసిన తర్వాత తేనె కలుపుకుని తాగాలి. అంతే..

ప్రయోజనాలు
సింపుల్ గా తయారు చేసే ఈ హెల్తీ డ్రింక్.. కడుపులో సమస్యలు నివారించి, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.



Click it and Unblock the Notifications