Latest Updates
-
రేప్ కేసులు, మర్డర్ కేసులు..బెంగాల్ అసెంబ్లీలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు..చట్టసభకు 190 మంది నేరచరితులు! -
అన్నం,చపాతీ,బగారా రైస్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..రెస్టారెంట్ స్టైల్ పుదీనా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బటర్ మష్రూమ్ మసాలా.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఇన్‌స్టాగ్రామ్‌లో మీ పిల్లలు సేఫేనా? హనీట్రాప్ ముఠాల వలలో పడకుండా కాపాడుకోండిలా! -
సహజీవనం తర్వాత విడిపోతే అత్యాచారమా? సుప్రీంకోర్టు తీర్పుతో షాకింగ్ నిజాలు! -
భార్యను భర్తకు దూరంగా ఉండాలట! ఫ్యామిలీ కోర్టు వింత తీర్పుపై హైకోర్టు షాకింగ్ రియాక్షన్ -
పసుపు, తేనె కలిపి తీసుకుంటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..ఆ సమస్యకు కూడా ఇదే పవర్ ఫుల్ మెడిసిన్! -
హైదరాబాద్‌లో వాతావరణం మారుతోంది! గర్భిణులు, పసిబిడ్డల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
సమ్మర్ కూల్ డెజర్ట్..మజా వచ్చే మామిడి పాయసం..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే పెసర రొట్టె..బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎందులో అయినా సూపర్!
ఈ లెజెండరీ టీలో దాగున్న అమేజింగ్ హెల్త్ సీక్రెట్స్...!!
రోజ్మెరీ మొక్క చాలా మందికి అంతగా తెలియదు. అలంకరణ మొక్కగానే కాకుండా అద్భుతమైన ఔషధగుణాలున్న మొక్కగా రోజ్‌మెరికి పేరుంది. అందుకే దీన్ని లెజెండరీ హెర్బ్ అంటారు. ఆ మొక్క విశేషాలు ఇవి.
ఈ మొక్కకు ప్రాచీన కాలం నుంచి లెజెండరీ హెర్బ్‌గా పేరుంది. రోజ్‌మెరి రెమ్మలు వెంట ఉంచుకుంటే దుష్టశక్తులు దరిచేరవని, కొత్తగా వివాహమైన జంటల మధ్య ప్రేమానురాగాలు, అనుబంధాలు బలపడతాయని విశ్వసిస్తారు. ఈ మొక్క యాంటీసెప్టిక్‌గా, యాంటీ బ్యాక్టీరియల్‌గా, యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది. ఔషధగుణాలు పుష్కలంగా ఉండటానికి కారణం వాలటైల్ ఎసెన్షియల్ ఆయిల్స్ మిశ్రమాలైన సినియోల్, బోర్నియోల్, బోరానిల్ ఎసిటేట్, పైనీన్, కెంఫీన్, రోజ్‌మేరినిక్, ఉర్సోలిక్ యాసిడ్‌లు ఉండటమే.
ఇందులో ఉండే యాంటీసెప్టిక్‌గా, యాంటీ బ్యాక్టీరియల్‌గా, యాంటీ ఫంగల్ ఔషధ లక్షణాలుండటం వల్ల , దీనితో తయారుచేసి టీని తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది. డిటాక్సిఫైగా పనిచేస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వారు , రోజ్మెరీ టీ తాగడం వల్ల త్వరగా రికవర్ అయ్యేందుకు సహాయపడుతుంది. రోజ్మెరీ టీ వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది మరియు ఫ్రెష్ బ్రీత్ కు సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఎవరైతే మానసికంగా వీక్ గా ఉంటారో అలాంటి వారిలో ఏకాగ్రతను మరియు మతిమరుపును నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. రోజ్మెర్రీ టీ మెంటల్ కాన్సంట్రేషన్ మరియు బ్రెయిన్ హెల్త్ ను పెంచుతుంది . రోజ్మెర్రీ టీ రెగ్యులర్ గా తాగడం వల్ల బ్రెయిన్ కు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది.
గాయాలను త్వరగా మాన్పడంలో కూడా ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. గాయాల వల్ల ఏర్పడే ఇన్ఫెక్షన్స్ ను నాశనం చేయడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. రోజ్మెర్రీ టీ వల్ల మరొకిన్ని ప్రయోజనాలు...

మెమరీ మరియు ఏకాగ్రత పెంచుతుంది:
రోజ్మెరీ టీ రెగ్యులర్ గా తాగడం వల్ల బ్రెయిన్ కు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. దాంతోఏకాగ్రత పెరుగుతుంది . ఈ టీ మతిమరుపు కూడా నివారిస్తుంది.

వ్యాదినిరోధకశక్తిని పెంచుతుంది:
ఈ హెర్బల్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. ఇతర సీరియస్ డిసీజ్ లను కూడా తగ్గిస్తుంది. రోజ్మెరీ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి.

జీర్ణశక్తిని పెంచుతుంది.
రోజ్మెర్రీ టీ జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కడుపుబ్బరాన్ని, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. ఈ క్రమంలో జీర్ణసమస్యలు నయం అవుతాయి . భోజనం తర్వాత పాలు తాగడం వల్ల పొట్టను స్మూత్ గా మార్చుకోవచ్చు.

ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది:
రోజ్మెర్రీ టీలోుండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్ తో వచ్చే వ్యాధులను పూర్తిగా నయం చేస్తుంది. ఇది గొంతు నొప్పి మరియు దగ్గు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

గాయాలయినప్పుడు :
రోజ్మెరీ టీని గాయాల మీద అప్లై చేయడం వల్ల గాయాలను త్వరగా మాన్పుతుంది. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్ ను నాశనం చేస్తుంది మరియు గాయాలను మాన్పుతుంది.

శరీరంలో టాక్సిన్స్ తొలగిస్తుంది:
రోజ్మెర్రీ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ను బయటకు నెట్టేస్తుంది. బాడీలో అవయవాలు రిఫ్రెష్ అవుతాయి మరియు డ్యామేజ్డ్ కణాలు రిపేర్ అవుతాయి.

బ్రీత్ ను ఫ్రెష్ గా మార్చుతుంది:
రోజ్మెర్రీ టీలోఉండే యాంటీసెప్టిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు నోరుశుభ్రం చేస్తుంది, ఫ్రెష్ బ్రీత్ ను అందిస్తుంది. దీన్ని కూల్ గా చేసి, గార్గిలింగ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications