Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సాయంత్రం 7 గంటల తర్వాత ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని పొరపాట్లు..!
డైట్ సోడా తాగడం, ఎక్కువగా డిన్నర్ తినేయడం, తక్కువగా నిద్రపోవడం ఈ అలవాట్లన్నీ మీకు ఉన్నాయా ? వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి అలవాట్లు ఉంటాయి. అంతేకాదు చాలామంది అన్ హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవుతుంటారు. అది హెల్తీ కాదని తెలిసినా.. ఓపిక, టైం రెండూ లేక అలాంటి పద్ధతులు ఫాలో అవుతుంటారు.
ఉదయం తొమ్మిది గంటలలోపు ప్రతి ఒక్కరూ చేసే పొరపాట్లు..!
అయితే సాయంత్రం 7 గంటల తర్వాత చేసే పనులు చాలా ప్రభావం చూపుతాయి. సరైన పద్ధతిలో చేస్తే మంచి ఫలితాలు, కాస్త అనారోగ్యకరంగా చేస్తే అనేక దుష్ర్పభావాలు కలుగుతాయి. కాబట్టి.. సాయంత్రం 7 గంటల తర్వాత... ఫాలో అయ్యే అలవాట్లు, నియమాలు మీ ఆరోగ్యానికి నెమ్మదిగా హాని కలిగిస్తాయి. మరి సాయంత్రం 7 గంటల తర్వాత చేయకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం..

డ్రెస్ చేంజ్ చేసుకోకపోవడం
చాలామంది ఇంటికి రాగానే బట్టలు కూడా మార్చుకోకుండా.. ఆహారం తీసుకోవడం, ఇతర పనులు చేయడం చేస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే.. ఉదయం నుంచి వేసుకున్న దుస్తులు చాలా దుమ్ము, క్రిములతో కూడి ఉంటుంది. కాబట్టి ఇంటికి రాగానే ముందుగా డ్రెస్ చేంజ్ చేస్తే చేతులు, ముఖం శుభ్రం చేసుకోవాలి. వీలైతే.. స్నానం చేయడం మంచిది. దీనివల్ల చాలా కంఫర్ట్ గా, రిలాక్స్ గా ఉంటుంది.

నీళ్లు తాగకపోవడం
చాలామంది ఇంటికి వచ్చేసరికి చాలా దప్పికతో ఉంటారు. అలాగే రాత్రి పూట సరిగ్గా నీళ్లు తాగరు. కానీ.. ఇది మంచి అలవాటు కాదు. ఉదయం, సాయంత్రం రెండూ సమయాల్లోనే సరైన మోతాదులో నీళ్లు తాగాలి.

స్నాక్స్
సాయంత్రం కాఫీ, టీ ఏదో ఒకటి తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే సాయంత్రం టీ తాగడం తప్పేమీ కాదు. కానీ టీతోపాటు బిస్కెట్స్, ఫ్రైడ్ స్నాక్స్ తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఈ సారి సాయంత్రం టీ తాగేటప్పుడు గుప్పెడు డ్రైఫ్రూట్స్ లేదా 2 వోల్ వీట్ బిస్కెట్స్ తీసుకోండి.

ఎక్కువగా టీవీ చూడటం
చాలామంది అలసిపోయి ఇంటికి రాగానే.. టీవీ చూసి రిలాక్స్ అవడాన్ని ఇష్టపడతారు. కానీ 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు టీవీ చూడకూడదు. రిలాక్స్ అవడానికి బుక్స్ చదవడానికి, మీకు ఇష్టమైన పనులు చేయడానికి సమయం కేటాయించండం మంచిది.

డిన్నర్
బ్రేక్ ఫాస్ట్ రోజులో చాలా ముఖ్యమైన మీల్ అని చాలామంది చెబుతారు. అంటే.. డిన్నర్ ముఖ్యమైనది కాదని కాదు. డిన్నర్ కూడా ముఖ్యమైనది అయితే.. అందులో ఏవి చేర్చుకోవాలి అనేది ముఖ్యం. డిన్నర్ చాలా లైట్ గా ఉండాలి.

ఏం తీసుకోవాలి
డిన్నర్ హెవీగా ఉంటే.. జీర్ణవ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి జీర్ణవ్యవస్థపై ఒత్తిడి లేకుండా ఉండటానికి, సరైన నిద్రకు లైట్ గా ఉండే ఆహారం తీసుకోవాలి. మొలకెత్తిన గింజలతోపాటు పాలు లేదా సూప్ లేదా ఒక కప్పు ఫ్రూట్ సలాడ్ తీసుకోవడం మంచిది.

డిన్నర్ తర్వాత, నిద్రకు ముందు
నిద్రకు ముందు బ్రెష్ చేయాలి. అలాగే నిద్రకు ముందు స్క్రీన్ చూడకూడదు. ఎక్కువగా స్క్రీన్ చూస్తే.. నిద్రలో క్వాలిటీ మిస్ అవుతారు.

చేయాల్సింది
నిద్రకు ముందు మొబైల్ చూడకుండా.. ఏదైనా బుక్ చదవడం మంచి అలవాటు. ఈ అలవాటు నరాలకు ఉపశమనం కలిగించి, బాగా నిద్రపోయేలా చేస్తుంది.

నిద్ర
ఖచ్చితంగా రాత్రి 11 గంటలలోపు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే రోజుకి ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అప్పుడే మీరు రోజంతా యాక్టివ్ గా ఉంటారు.



Click it and Unblock the Notifications