Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
డైట్ లో చేర్చుకోవాల్సిన సూపర్ హెల్తీ ఫుడ్స్..!!
హెల్తీగా ఉండటం అంటే.. తినడం, పడుకోవడం కాదు. డైట్ లో చేర్చుకునే ఆహారాలే మన హెల్త్ ని డిసైడ్ చేస్తాయి. సమయానికి తినడంతోపాటు, ఆరోగ్యకరమైన ఆహారాలపై డైట్ లో చేర్చుకోవడం కూడా చాలా అవసరం. శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కో పోషకాహారం అవసరమవుతుంది. కాబట్టి.. శరీరమంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. మన పర్ఫెక్ట్ గా ఉంటాం.
హెల్తీ ఫుడ్ అనగానే.. చాలా ఖర్చుతో కూడినదని చాలామంది భావిస్తారు. ప్రొటీన్ డ్రింక్స్, డైట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇలా.. అంతా ఎక్కువ ఖర్చు చేసి తీసుకోవాల్సినని అనుకుంటారు. కానీ.. తక్కువ ధరలో లభించే సూపర్ ఫుడ్స్ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని తీసుకుంటే.. మీరు హెల్తీగా ఉన్నట్టే.

గుడ్లు:
కోడి గుడ్లు తింటే ఫ్యాట్ పెరుగుతుందని చాలామందిలో అపోహ ఉంది. కానీ గుడ్డులో మినరల్స్, రైబోఫ్లెవిన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గుడ్డును కానీ, ఆమ్లెట్‌ను గానీ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
క్యారెట్స్:
క్యారెట్స్ ఎవర్ గ్రీన్ హెల్తీ వెజిటబుల్ అని మనందరికీ తెలుసు. కానీ.. వీటిని తినడానికి మాత్రం కొంతమందే ఇష్టపడతాు. కళ్లకు మేలు చేయడంలో క్యారెట్‌కు మించినది లేదు. ఇందులో ఉండే విటమిన్-ఎ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు బీటా-కెరటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా క్యారెట్స్ లో లభిస్తాయి. అలాగే ఖనిజలవణాలు, ఫైబర్ క్యారెట్స్ నుంచి పొందవచ్చు.

వెల్లుల్లి:
వెల్లుల్లి రుచి దాదాపు ప్రతి కూరలు, చారుల్లోనూ దట్టిస్తారు. కానీ.. ఆహారం తినేటప్పుడు వీటిని పక్కనపెట్టేవాళ్ల సంఖ్య ఎక్కువే. కానీ ఇది తినడం వల్ల రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యమూ బావుంుటంది. ఇందులో ఉండే విటమిన్ బి, సితోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ గుండెజబ్బులను నివారించడానికి సహాయపడతాయి. అలాగే రక్తపోటు, కార్డియోవాస్కులర్ డీసీజ్‌లను నివారించే శక్తి ఉంది.

క్యాబేజ్:
క్యాబేజ్ అంటే చాలామంది నో చెప్పేస్తారు. కానీ ఇందులో ఉండే లో సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ శరీరానికి ఎంతో అవసరం. క్యాబేజ్ నుంచి ఎక్కువ మొత్తంలో ఫైబర్ పొందవచ్చు. హార్ట్‌రేట్‌ను, రక్తపోటును కంట్రోల్ చేయడంలో క్యాబేజ్ వల్ల లభించే పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ కీలకపాత్ర పోషిస్తాయి.
పాలు:
పాల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలలో ఉండే ఐరన్, కాల్షియం, సోడియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న వేరే ఆహార పదార్థం మరొకటి లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
