Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అలర్ట్: వర్క్ ప్లేస్ లో గంటల తరబడి కూర్చుంటున్నారా ?
బ్యాక్ పెయిన్ !! ఇది ప్రస్తుతం ఉద్యోగుల నుంచి వినిపిస్తున్న సమస్య. గంటల తరబడి ఒకే సీట్ లో కూర్చుని పనిచేయడం, ఒత్తిడి కారణంగా.. ఎక్కువగా బ్యాక్ పెయిన్ బారిన పడుతున్నారు. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరినీ.. దాదాపు ఈ సమస్య వేధిస్తోంది. కొంతమంది 10 నుంచి 12 గంటలు నిర్విరామంగా కూర్చోవడం వల్ల వెన్నుపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే.. ఈ సమస్య రోజు రోజుకీ పెరుగుతోంది.
ఎక్కువగా సిక్ లీవ్స్ తీసుకోవడానికి కారణమేంటో తెలుసా ? బ్యాక్ పెయిన్. నిజమే.. 50 శాతం మంచి ఉద్యోగులు బ్యాక్ పెయిన్, వెన్ను నొప్పి లక్షణాలతో ఏడాదికి ఒకసారైనా లీవ్ పెడుతున్నారని తాజా అధ్యయనాలు వివరిస్తున్నాయి. చాలా సందర్భాల్లో బ్యాక్ పెయిన్ వాళ్లు కూర్చునే విధానం సరిగ్గా లేకపోవడం వల్లే వస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వర్క్ ప్లేస్ లో బ్యాక్ పెయిన్ నివారించడనాకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కూర్చునే విధానం
కూర్చునే విధానంలో జాగ్రత్త వహించకపోవడం వల్లే ఎక్కువ మంది ఉద్యోగుల బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్స్ చెబుతున్నారు. కాబట్టి చెయిర్ లో కూర్చున్నప్పుడు మీ వెన్ను భాగమంతా.. చెయిర్ కి ఆనుకోవాలి. కాళ్లు ఫ్లోర్ కి తాకాలి. ఇలా కూర్చోవడం వల్ల.. వెన్నుపై ఒత్తిడి పడదని.. డాక్టర్స్ చెబుతున్నారు.

సరైన చెయిర్
ఈజీ చెయిర్స్, బీన్ బ్యాగ్స్, సాఫ్ట్ గా ఉండే సోఫాలలో కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని స్టడీస్ చెబుతున్నాయి. అలాగే క్రాస్ లెగ్స్ ఉండే చెయిర్స్ లో ఎక్కువ సమయం కూర్చోవడం కూడా సేఫ్ కాదని సూచిస్తున్నారు. కాబట్టి.. మీరు కూర్చునప్పుడు మీకు అనుకూలంగా చెయిర్ ఉందా లేదా అనేది సరిచూసుకోవాలి. అలాగే కింద కూర్చోవాల్సి వచ్చినప్పుడు వెన్నుకి సపోర్ట్ ఉండేలా జాగ్రత్త పడాలి.

ఆహారం
డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ డి3, విటమిన్ బి12, క్యాల్షియం శరీరానికి పుష్కలంగా అందినప్పుడే ఎముకలు, వెన్నెముక ఆరోగ్యంగా ఉంటాయి.

హైడ్రేటెడ్ గా ఉండటం
మన వెన్నెముక ఎక్కువ నీటిని కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల అది హెల్తీగా ఉంటుంది.

వెన్నుపై ఒత్తిడి
కిందకు వంగి ఏదైనా అందుకోవాల్సి వచ్చినప్పుడు మోకాళ్లను వంచాలి. లేదంటే వెన్నుపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి శరీరాన్ని కిందకు బెండ్ చేయాల్సి వచ్చినప్పుడు, బరువైన వస్తువు ఎత్తేటప్పుడు మోకాళ్లను బెండ్ చేయాలి.

వస్తువులు
పని చేసే ప్రాంతంలో మీకు కావాల్సిన వస్తువులు, ఎక్కువగా ఉపయోగించే వస్తువులను దగ్గరగా ఉంచుకోవాలి. మోచేతి దూరంలో ఉండేలా జాగ్రత్త పడాలి. దీనివల్ల.. శరీరాన్ని ఎక్కువ బెండ్ చేసే పనిలేకుండా.. అందుకోగలుగుతారు. దీనివల్ల వెన్ను నొప్పి సమస్య ఉండదు.

బెడ్
ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు బెడ్ పై ఉంటారు. కాబట్టి.. బెడ్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. చాలా గట్టిగా ఉండే ఫ్లోర్, ఎక్స్ ట్రా ఫర్మ్ ఉండే మాట్రిస్ మీ వెన్నుకి హాని కలిగిస్తాయి. అలాగే దిండు పెట్టుకోవడం మానేయరాదు. వంపుగా ఉండే నెక్ కి దిండు చాలా అవసరం.

టైప్ లేదా వ్రాసేటప్పుడు
టైపింగ్ లేదా వ్రాసేటప్పుడు మణికట్టుకి ఖచ్చితంగా టేబుల్ పై సపోర్ట్ ఉండాలి. దీనివల్ల అనవసర ఒత్తిడిని నివారించవచ్చు.

కంప్యూటర్ స్క్రీన్
కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ స్క్రీన్ ఖచ్చితంగా మీ కంటి చూపు లెవెల్ లో ఉండాలి. అంతేకానీ.. మీ కంటి చూపుకి కిందివైపు లేదా పైకి ఉండరాదు.



Click it and Unblock the Notifications