Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మలబద్దకం నివారించే ఎక్సలెంట్ రెమెడీ : బనాన స్టెమ్ జ్యూస్ ..!
మలబద్దకం నివారించుకోవడానికి ఎన్నో హోం రెమెడీస్, మెడిసిన్స్, ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి ఉంటారు.ఫలితం మాత్రం అంతంత మాత్రమే. మలబద్దకం నివారించుకోవడానికి అరటి దూట(బనాన స్టెమ్)జ్యూస్ ఎక్సలెంట్ రెమెడీ..
అరటిచెట్టులో మనకు ఉపయోగపడని భాగమంటూ ఏదీ ఉండదు. అరటికాయ, పువ్వు, కాండంతోనూ రుచికరమైన వంటకాలు ఎన్నో తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో అరటికాయ కనిపించినంతగా పువ్వు, కాండం (దూట) కనిపించవు. కానీ అవి కూడా ఇప్పుడు సూపర్‌మార్కెట్లలో విరివిగా లభిస్తున్నాయి. వీటి గురించి తెలిసిన వారికన్నా తెలియని వారి సంఖ్యే ఎక్కువ.
అరటి దూట పొడవుగా కాండం వలే అరిటి చెట్టుకు సపోర్ట్ గా ఉంటుంది. అరటి చెట్టు మొత్తం ఒకదానికి తర్వాత ఒకటి లేయర్స్ గా పెరుగుతుంది. అరటి కాండాన్నే అరిటి దూట అనిపిలుస్తారు. అరిటి దూట అవుటర్ లేయర్ తొలగించిన తర్వాత వంటలకు ఉపయోగిస్తుంటారు. అరటి దూటలో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. ఇది ఫ్యాట్ ను తగ్గిస్తుంది. అంతే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది చౌకైనది, సులభంగా మనకు అందుబాటులో ఉంటుంది.
ఓబేసిటి, కిడ్నీ స్టోన్స్ , డయాబెటిస్, యూటిఐ , అసిడిటి మరియు మలబద్దకం వంటి అనేక సమస్యలను నివారించడంలో ఎక్సలెంట్ హోం రెమెడీ బనాన స్టెమ్. వీటితో పాటు బనాన స్టెమ్ లో దాగున్న మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా..

బరువు తగ్గిస్తుంది :
బనాన స్టెమ్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గిస్తుంది. రోజుకు 25 గ్రాముల బనాన స్టెమ్ తినవచ్చున, డైటీషియన్స్ సలహా. వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజుకు 40గ్రాములు తీసుకోవచ్చు. ఫైబర్ కంటెంట్ శరీరంలో నిల్వచేరిన షుగర్స్ , ఫ్యాట్స్ ను తొలగిస్తుంది. బనాన స్టెమ్ జ్యూస్ కు కొద్దిగా అల్లం, బట్టర్ మిల్క్ చేర్చి తీసుకుంటే ఎఫెక్టివ్ గా బరువు తగ్గుతారు.

హార్ట్ మజిల్స్ ను స్ట్రాంగ్ చేస్తుంది:
బనాన స్టెమ్ లో ఉండే పొటాషియం కంటెంట్ హార్ట్ మజిల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. శరీరంలో ఇమ్యూనిటి లెవల్స్ ను పెంచి వ్యాధులను దూరం చేస్తుంది. ఇవే కాకుండా విటమిన్ ఎ, బి6, సిలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
బానాన స్టెమ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది. డయాబెటిస్ వారికి ఇది గుడ్ రెమెడీ.

టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది:
బనాన స్టెమ్ లో ఉండే ఔషధ గుణాలు, శరీరంను శుభ్ర పరచడంలో గొప్పగా సహాయపడుతుంది. శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

పొడి దగ్గును నివారిస్తుంది:
బనాన స్టెమ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల పొడి దగ్గు నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

కిడ్నీ స్టోన్స్ నివారిస్తుంది:
అరటి దూట జ్యూస్ లో కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా నివారించే గుణాలు అధికంగా ఉన్నాయి .

బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది:
బనాన స్టెమ్ మలబద్దకాన్ని నివారిస్తుంది. బౌల్ మూమెంట్ సులభం చేస్తుంది.

హార్ట్ బర్న్ నివారిస్తుంది:
అరటి దూట జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే, ఎసిడిటి, కడుపుబ్బరం సమస్యలుండవు. ఇది ఎసిడిటి మాత్రమే తగ్గించడం కాదు, హార్ట్ బర్న్ నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.

శరీరంలో షుగర్ మరియు ఫ్యాట్ ను కరిగిస్తుంది:
ఇది శరీరంలో షుగర్స్, ఫ్యాట్ ను కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. రక్తనాళాల్లో ఫ్యాట్ ను కరిగించడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు. అటి దూట రసానికి కొద్దిగా అల్లం, మజ్జిగా చేర్చి తీసుకోవడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు.

అనీమియా నివారించడంలో ఎఫెక్టివ్ రెమెడీ:
బనాన స్టెమ్ జ్యూస్ లో విటమిన్ బి6 అత్యధికంగా ఉంటుంది. ఇది రక్తంలో హీమోగ్లోబిన్ కంటెంట్ ను పెంచుతుంది. అనీమియాతో బాధపడే వారికి ఇది ఎక్సలెంట్ హోం రెమెడీ.

బిపిని క్రమబద్దం చేస్తుంది:
బిపిని క్రమబద్ద చేయడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది.

యుటిఐని క్యూర్ చేస్తుంది:
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నివారించడంలో బనాన స్టెమ్ జ్యూస్ ఎక్సలెంట్ హోం రెమెడీ. ఇది ఇరిటేషన్ తగ్గిస్తుంది. బనాన స్టెమ్ జ్యూస్ ను వారంలో రెండు మూడు సార్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు . యుటిఐతో పాటు, ఇంకా యూట్రస్ కు సంబంధించిన సమస్యలను, జాండిస్, క్రిములు కుట్టినప్పుడు, హార్ట్ సమస్యలను నివారించడంలో అద్భుతమైన హోం రెమెడీ.



Click it and Unblock the Notifications