Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చెక్క, తేనె మిశ్రమంతో ఊహించని హెల్త్ బెన్ఫిట్స్
రోజుకి ఒక్క టీ స్పూన్ చెక్క, తేనె తీసుకోవడం వల్ల మీరు ఊహించలేని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చట. చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నిరోధించవచ్చు.. అలాగే.. శారరీకంగా అనేక మార్పులు మీలో కనిపిస్తాయి. ఈ కాంబినేషన్ ని చైనీస్ అనేక సంవత్సరాలుగా ఆయుర్వేదంలోనూ, మెడిసిన్స్ లోనూ ఉపయోగిస్తున్నారు.
READ MORE: డయాబెటిస్ కి చెక్ పెట్టే సత్తా చెక్కదే..
చెక్కలో అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి. దీన్ని పూర్వం నుంచి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం. ఇక చాలా సహజసిద్ధంగా లభించే తేనెలోనూ ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ఒక టీ స్పూన్ చెక్క, తేనె రెండు న్యాచురల్ రెమిడీస్. ఈ రెండిటినీ మిశ్రమంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

ఈ రెండిటి మిశ్రమం గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ తేనె, చెక్క పేస్ట్ ని చేర్చుకుంటే.. మంచి ఫలితాలు పొందవచ్చు. దీన్ని డైరెక్ట్ తీసుకోవడం ఇష్టపడని వాళ్లు.. బ్రెడ్ పై జామ్ కి బదులు ఈ పేస్ట్ చేర్చుకుని తినడం వల్ల స్ర్టోక్ రిస్క్ తగ్గుతుంది. అలాగే కొలెస్ర్టాల్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. ఇప్పటికే హార్ట్ ఎటాక్ సమస్యతో బాధపడుతున్నవాళ్లు కూడా రెగ్యులర్ గా ఈ మిశ్రమాన్ని తీసుకోవం వల్ల గుండె కండరాలను బలంగా చేస్తుంది.
ఒక స్పూన్ చెక్క, తేనె తీసుకోవడం మొదలుపెడితే.. కీళ్లనొప్పుల సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. ఒక కప్పు వేడినీళ్లలో ఒక టీ స్పూన్ చెక్క పొడి, రెండు టీ స్పూన్ల తేనె కలుపుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య తగ్గిపోతుంది.

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ చెక్క పొడి, తేనె కలుపుకుని తీసుకోవడం వల్ల పొట్టలో ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతే కాదు.. ఈ మిశ్రమాన్ని మధ్యాహ్నం భోజనానికి 20 నిమిషాల ముందు, రాత్రి భోజనానికి 20 నిమిషాల ముందు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. హెవీగా ఉండే ఆహారం తీసుకున్నా కూడా.. ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది.
దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు, యాంటీ బయోటిక్ గుణాలు సీజనల్ డిసీజెస్ అయిన జలుబు, దగ్గు, గొంతు సమస్యల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చెక్క పొడి, తేనె కలుపుకుని కొద్ది కొద్దిగా తీసుకుంటే.. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications