Latest Updates
-
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఒకే ఒక పవర్ ఫుల్ స్పైస్ తో ఒబేసిటీ, డయాబెటిస్, అనీమియా నయం..!
ఈ భూమ్మీద లభించే అత్యంత ఆరోగ్యకరమైన దినుసుల్లో జీలకర్ర ఒకటి. ఈ ఇండియన్ హెర్బల్ స్పైస్ లో అత్యంత అసాధారణమైన ఔషధ గుణాలు దాగున్నాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు.
ఒకే ఒక్క పదార్థంతో అన్ని రకాల వ్యాధులు నయం అని చెప్పగానే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. ఆ ఒక్క పదార్థం ఏంటో తెలిస్తే మరింత షాక్ అవుతారు. మనం రెగ్యులర్ ఉపయోగించే ఈ పదార్థంలో ఇన్ని ఔషధ గుణాలున్నాయా అని ఆశ్చర్యపోతారు. అదేనండి.. జీలకర్ర..!

కొంచెం స్పైసీగా, అమోఘమైన రుచి కలిగిన జీరా లేదా జీలకర్ర ప్రతి ఇంట్లో ఉంటుంది. దీన్ని ప్రతి వంటకానికి పోపుతోపాటు వాడతారు. అలాగే.. ఘుమఘుమల సువాసన కోసం వాడతారు. జీలకర్ర రుచిలోనే కాదు ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ రారాజు.
ఈ భూమ్మీద లభించే అత్యంత ఆరోగ్యకరమైన దినుసుల్లో జీలకర్ర ఒకటి. ఈ ఇండియన్ హెర్బల్ స్పైస్ లో అత్యంత అసాధారణమైన ఔషధ గుణాలు దాగున్నాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. జీలకర్ర ఆరోగ్యానికి మంచిదని, కొన్ని ప్రయోజనాలు మాత్రమే చాలామందికి తెలుసు. కానీ..బరువు తగ్గించడంతోపాటు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేసే సత్తా జీలకర్రలో ఉంది.

అనీమియా లేదా రక్తహీనత
జీలకర్రలో ఐరన్ చాలా ఎక్కువగా లభిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనీమియాను నివారిస్తుంది. అలాగే ఐరన్ లోపంను తగ్గిస్తుంది. ప్రెగ్నన్సీ టైంలో జీలకర్రను కంపల్సరీ తీసుకోవాలి. ప్రెగ్నన్సీ టైంలో కావాల్సిన ఐరన్ ని ఇది అందిస్తుంది.

ఎసిడిటీ
ఎసిడిటీ సమస్యను తక్షణమే నివారించుకోవాలి అనుకుంటే.. చిటికెడు జీలకర్ర తీసుకుని నోట్లో పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత మింగేయాలి.

రెమెడీ
లేదా జీలకర్ర, కొత్తిమీర, పంచదార సమానంగా తీసుకుని పౌడర్ తయారు చేసుకోవాలి. 2 టీస్పూన్ల ఈ పౌడర్ ని ఒక గ్లాసు నీటిలో కలుపుకుని ప్రతి రోజూ ఉదయాన్నే తాగితే.. ఎసిడిటీ సమస్యలు దూరమవుతాయి.

డయాబెటిస్
డయాబెటిస్ తో బాధపడేవాళ్లకు జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో జీలకర్ర కలుపుకుని.. ప్రతిరోజూ రెండు సార్లు తాగాలి. ఇది చాలా ఎఫెక్టివ్ గా డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది.

కాలేయాన్ని డెటాక్స్ చేయడానికి
ప్రతిరోజూ జీలకర్రను తీసుకోవడం వల్ల కాలేయంతో పాటు శరీరంలోని అవయవాలన్నీ డెటాక్సిఫై అవుతాయి. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కాన్ట్సిపేషన్
కాన్ట్సిపేషన్ నివారించడంలో జీలకర్ర చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జీలకర్ర, మిరియాలు, సొంఠి, కరివేపాకు పొడి.. వీటన్నింటినీ సమాన భాగాలుగా తీసుకోవాలి. వెన్న, కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. దీన్ని రైస్ తో పాటు తినవచ్చు. ఇలా ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తింటే కాన్ట్సిపేషన్ తగ్గుతుంది.

దగ్గు, జలుబు
జీలకర్రలో యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. చెస్ట్ లో పేరుకున్న కఫంను చాలా తేలికగా తొలగిస్తుంది. దీంతో దగ్గు, జలుబు తగ్గిపోతాయి. కొద్దిగా జీలకర్ర తీసుకుని ఒక గ్లాసు నీటిలో ఉడికించి.. ఆ నీటిని తాగితే చాలు.. దగ్గు, జబులు మాయమవుతాయి.

పొట్టనొప్పి
పొట్టనొప్పి, శరీరంలో ఇతర నొప్పులను నివారించడంలోనూ జీలకర్ర పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. 3 గ్రాముల జీలకర్ర పొడిని ఒక గ్లాసు వేడినీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు తాగితే.. నొప్పులన్నీ ఫటా ఫట్.

అజీర్ణం
అజీర్ణ సమస్యలను జీలకర్ర చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. రాళ్ల ఉప్పులో జీలకర్ర, మిరియాలు, సొంఠిని సమానంగా కలపాలి. అన్నింటినీ మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పౌడర్ ని ఒక గ్లాసు నీటిలో కలిపి భోజనం చేసిన తర్వాత తాగాలి. ఇది చాలా ఎఫెక్టివ్ గా జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది.

డయేరియా
ఒక గ్లాసు పెరుగులో, 5 గ్రాముల వేయించిన జీలకర్ర గింజలను మిక్స్ చేసి.. తీసుకోవాలి. అంతే.. డయేరియా మీరు ఊహించని రీతిలో తగ్గిపోతుంది.

వాంతులు
వాంతులను ఎఫెక్టివ్ గా తగ్గించడానికి జీలకర్ర సహాయపడుతుంది. కాస్త వేయించిన జీలకర్ర పొడిని, తేనెలో కలిపి.. భోజనం తర్వాత తీసుకుంటే.. ఈ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు.

నిద్రలేమి
నిద్రకు సంబంధించిన సమస్యలను కూడా.. జీలకర్ర చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ప్రతి రోజూ రాత్రి భోజనం తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, అరటిపండు గుజ్జు కలిపి రాత్రి భోజనం తర్వాత తీసుకుంటే.. నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి.

పేగులలో క్రిములు
పేగులలో ఉండే క్రిములను ఎఫెక్టివ్ గా తొలగించడానికి జీలకర్ర సహాయపడుతుంది. 15 గ్రాముల జీలకర్రను 400 ఎమ్ఎల్ నీటిలో కలిపి మరిగించాలి. ఆ నీళ్లు 100 ఎమ్ఎల్ అయ్యేంతవరకు మరిగనివ్వాలి. తర్వాత 20 నుంచి 40 ఎమ్ఎల్ ఈ డ్రింక్ ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తాగాలి. అంతే.

ఇమ్యునిటీ
ఇమ్యూనిటీ పెంచడంలో జీలకర్ర బాగా సహకరిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో చేరిన మలినాలను తొలగించి, ప్రీ రాడికల్స్ నివారించి వ్యాధులను తట్టుకునేలా శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

రుతుక్రమ సమస్యలు
నెలసరి సమస్యలతో బాధపడేవాళ్లకు జీలకర్ర చక్కగా పనిచేస్తుంది. క్రమరహిత రుతుక్రమాలతో బాధపడేవాళ్లు రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం వల్ల నెలసరి క్రమంగా రావడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications











