Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రాత్రిపూట పెరుగు తినడం ఆరోగ్యకరమా ? హానికరమా ?
పెరుగు తింటే ఆరోగ్యం.. ! కానీ పెరుగు తినడంపై చాలా అపోహలున్నాయి. కాస్త జ్వరం, దగ్గు, జలుబు, గాయాలు తగిలినప్పుడు పెరుగు తినకూడదు అని చెబుతుంటారు. కానీ పెరుగులో అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పుడు.. అనారోగ్యంతో ఉన్నప్పుడు పెరుగు ఎందుకు తినకూడదు అంటారు ? అంతేకాదు.. రాత్రిపూట పెరుగు తినవచ్చా ? తినకూడదా ? అనేది మరో పెద్ద డైలమా ? కొంతమంది రాత్రిపూట పెరుగు తినవచ్చు అంటే.. మరికొందరు అస్సలు రాత్రి పూట డిన్నర్ లో పెరుగు చేర్చుకోనేకూడదు అంటారు ? అసలు ఏది వాస్తవం ??
పెరుగులో అనేక ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి. కాబట్టి పాలు అంటే ఇష్టపడని వాళ్లు కనీసం పెరుగైనా డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే.. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి మంచిది. ప్రస్తుతమున్న ఆహారపు అలవాట్లు, ట్రెండ్స్ కారణంగా.. మంచి బ్యాక్టీరియాని కోల్పోతున్నాం. కాబట్టి ఇది పుష్కలంగా లభించే.. పెరుగుని డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి డైట్ లో కంపల్సరీ పెరుగు చేర్చుకోవాలి.
అయితే రాత్రి పూట కూడా పెరుగు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు తరచుగా జలుబు చేసే అలర్జీ ఉన్నవాళ్లు మాత్రం పెరుగు రాత్రిపూట తీసుకోకపోవడం మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే.. పెరుగు కఫంకి కారణమవుతుందని ఆయుర్వేదం రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిదని సూచిస్తుంది. అయితే ఇది అందరూ పాటించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎక్కువగా జలుబు, దగ్గుతో బాధపడతారో వాళ్లు మాత్రమే కర్డ్ కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంకా నచ్చితే మజ్జిగ తీసుకున్నా మంచిదని సూచిస్తున్నారు. రాత్రిపూట పెరుగు ఇష్టపడని వాళ్లు.. పెరుగుని డిన్నర్ లో చేర్చుకునే హెల్తీ టిప్స్..

పెరుగన్నం
ఉడికించిన అన్నంలో పెరుగు కలిపి, కొంచెం ఉప్పుడు పెప్పర్ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ తో పాటు.. ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. ఇంకా అవసరమైతే.. కరివేపాకు, ఎండుమిర్చితో.. పోపు పెట్టుకుని రాత్రిపూట తీసుకుంటే.. ఈజీగా జీర్ణమవుతుంది.

పెరుగు, పంచదార
మీకు పెరుగులో పంచదార కలుపుకుని తినడం ఇష్టమైతే.. రాత్రిపూట ఈ ఫ్లేవర్ ట్రై చేయవచ్చు. రాత్రి భోజనం తర్వాత ఒక కప్పు పెరుగు, కాస్త పంచదార తీసుకుంటే.. పొట్టలో చల్లదనంతోపాటు, పోషకాలన్నీ పొందవచ్చు.

మజ్జిగ
రాత్రి భోజనం తర్వాత మజ్జిగ మరో అద్భుతమైన ఔషధం. ఇది చల్లదనాన్ని మాత్రమే కాదు.. మంచి బ్యాక్టీరియా అందించి.. రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది.

లస్సీ
మజ్జిగ లాగే ఉండే లస్సీ కాస్త స్వీట్ ఫ్లేవర్ లో ఉంటుంది. దీన్ని కూడా డిన్నర్ తర్వాత తీసుకోవచ్చు.

కధి
ఇదో ట్రెడిషనల్ రెసిపీ. శనగపిండి, ఉప్పు, మజ్జిగలో చిల్లీ, కరివేపాకు, జీలకర్ర పోపు పెడితే దాన్ని కాధి అంటారు. దీన్ని అన్నం లేదా చపాతీలతో తీసుకోవచ్చు. దీని ద్వారా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఫ్రూట్ సలాడ్
అరటిపండ్లు, యాపిల్స్, దానిమ్మ వంటి రకరకాల పండ్ల ముక్కలకు కాస్త పెరుగు చేర్చుకుని రాత్రిపూట తీసుకుంటే.. టేస్ట్ తో పాటు.. హెల్తీగా కూడా ఉంటుంది.

రైతా
రైతా ఇండియన్ ఫుడ్ కామన్ సైడ్ డిష్. టమోటా, ఆనియన్స్, దోసకాయ, గ్రీన్ చిల్లీ మిక్స్ చేసి, పెరుగు కలిపి తయారు చేసుకోవచ్చు. దీన్ని కూడా రాత్రిపూట చేర్చుకుంటే.. హెల్తీగా ఉంటుంది.



Click it and Unblock the Notifications