Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మునగాకులో వందల వ్యాధులు నయం చేసే సత్తా !
మునక్కాడలు అందరూ ఉపయోగిస్తూ ఉంటారు కదూ. అయితే.. ఈ మునక్కాడలే కాదు.. మునగ ఆకులోనూ పవర్ ఫుల్ హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయి. దీన్ని మోరింగా, హార్స్ రాడిష్ ట్రీ అని పిలుస్తారు. సన్నగా, గుండ్రంగా ఉండే ఈ ఆకుల నుంచి పోషకాలు, బీటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ సి, క్యాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి. 4 వేల సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ ఆకులను మెడిసిన్స్ లో ఉపయోగిస్తున్నారంటే.. ఇందులోని గొప్పదనం ఏంటో తెలుస్తోంది.

ఆయుర్వేదంలో మునగాకును 300 లకు పైగా వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తారట. అందుకే దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్ గా పిలుస్తారు. మునగ విత్తనాలు నీటిని శుభ్రం చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయట. ఇతర పద్ధతుల కంటే.. మునగ విత్తనాలను ఉపయోగిస్తే.. ఎక్కువ ఫలితాలుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మునగ ఆకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ ఉంటాయి.
మునగకాడలో 12 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు
ఎండిన మునగ ఆకు నుంచి క్యారట్ల ద్వారా పొందే విటమిన్ ఏ ని 10 రెట్టు ఎక్కువగా, పాల నుంచి పొందే క్యాల్షియం కంటే 17 రెట్లు ఎక్కువగా, పెరుగు నుంచి పొందే ప్రొటీన్స్ 9 రెట్లు ఎక్కువగా, అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు ఎక్కువగా, ఆరంజ్ ల నుంచి పొందే విటమిన్ సిని 12 రెట్లు ఎక్కువగా పొందవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

అంతేకాదు మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుందట. మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చని సైంటిస్ట్ లు సూచిస్తున్నారు. అలాగే థైరాయిడ్ ని కూడా రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునక ఆకు.
మునగ ఆకులోని అత్యుత్తమ ఆరోగ్యప్రయోజనాలు
మునగాకులలో పవర్ ఫుల్ నియాంజిమినైన్ అనే యాంటీ క్యాన్సర్, యాంటీ ట్యూమర్ గుణాలు ఉంటాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అలాగే ఐదు రకాల క్యాన్సర్ లను నిరోధించే సత్తా ఈ మునగాకులో ఉందని తాజా అధ్యయనం తేల్చింది. లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి ఐదు రకాల క్యాన్సర్లు రాకుండా ఈ మునగాకు పొడి అరికట్టగలదట.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications