Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
గురకను కంట్రోల్ చేసి బాగా నిద్రపట్టించే నేచురల్ రెమెడీస్
సాధారణంగా మన పక్కన పడుకున్న వాళ్ళు ఎవరైనా గురక పెడుతుంటే మనకు నిద్ర పట్టదు. మహా చిరాకు పెడుతుంది. అందులోనూ గురకలు కూడా రకరకాలుగా పెడుతుంటారు. గురక చిరాకు తెప్పించడమే కాదు కొన్ని గురకలు భయాన్ని పుట్టిస
సాధారణంగా మన పక్కన పడుకున్న వాళ్ళు ఎవరైనా గురక పెడుతుంటే మనకు నిద్ర పట్టదు. మహా చిరాకు పెడుతుంది. అందులోనూ గురకలు కూడా రకరకాలుగా పెడుతుంటారు. గురక చిరాకు తెప్పించడమే కాదు కొన్ని గురకలు భయాన్ని పుట్టిస్తాయి. ఇప్పటికీ కొన్ని పాశ్చాత్య దేశాల్లో మొగుడి గురక తట్టుకోలేక విడాకులకై కోర్టులకు పరుగెత్తిన వాళ్ళూ ఉన్నారంటే ఆశ్చర్యం కలగక తప్పదు. ప్రపంచ జనాభాలో కనీసం 40 శాతం మంది గురకపెట్టే వారే! పిల్లల్లో సైతం ఇది కనబడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ గురక ఎక్కువవుతుంది. అలాగే బరువు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య పెరుగుతుంది. గురక పెట్టేవాళ్ళు రాత్రి సరిగ్గా నిద్రపోక పగలు కునికి పాట్లు పడుతూ వాహనాలు నడిపేటప్పుడు యాక్సిడెంట్లు చేస్తారని పలు అధ్యయనాల్లో తేలింది.
అంతే కాదు, ఈ గురక పెట్టే వారిలో మరి కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. గురక వల్ల నిద్రాభంగం, వేకువజామున తీవ్రంగా తలనొప్పిగా ఉండటం. పగటి నిద్ర, ఏపని చేసినా పని మీద ఏకాగ్రత లేకపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు, రాత్రివేళల్లో ఎక్కువ మూత్రం, హై బిపి, హార్ట్ ఎటాక్, అంగస్తంభన సమస్యలు లక్షణాలు కనబడుతాయి. ఇలా తీవ్రమైన లక్షణాలున్నప్పుడు డాక్టర్ ను తప్పనిసరిగా కలవాల్సి ఉంటుంది.

గురక అంటే ఏమిటి? శ్వాస లోపలికి తీసుకునేప్పుడు ముక్కు నుంచి స్వరపేటిక వరకు ఎక్కడైనా నాళాలు సన్నబడ్డా, శ్వాసద్వారాలు మూసుకుపోయినా, గాలి లోపలికి బలవంతాన తీసుకుంటున్నప్పుడు వచ్చే శబ్దమే గురక. నాళాలు సన్నగా ఉండడంతో బలవంతాన గాలి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి గురకలో గాలి ఎక్కువ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది చూసేవారికి. గొతులో ఉండే కండరాల బిగువు తగ్గినప్పుడు అంగిట్లో చివరి భాగాన ఉండే కండరం సాఫ్ట్ పాలట్‌తో బాటు చుట్టుపక్కల ఉన్న ఫారింక్స్ కండరాలు, కొండ నాలుక బలంగా లోపలికి పీల్చే గాలి వల్ల కంపిస్తాయి. ఈ కంపనం వల్ల వచ్చే శబ్దమే గురక.
నిద్రలో బలవంతాన తీసుకున్న గాలిని తిరిగి సన్నని శ్వాసనాళాల ద్వారా బయటకు నెట్టడం కష్టమై శ్వాస నోటి ద్వారా కూడా జరుగుతుంటుంది. అప్పుడు పెదాలు కంపించి కొన్ని రకాల శబ్దాలు వస్తుంటాయి. ముక్కు షేప్ వంకరగా ఉన్నా, అడినాయిడ్స్, టాన్సిల్స్ ఉన్నా శ్వాసమార్గం సన్నబడుతుంది. ఊపిరి తేలికగా లోపలికి వెళ్ళదు. గురక వల్ల నిద్ర సరిగా పట్టదు. మెలకువగా ఉన్నప్పటికన్నా నిద్ర పోయేటప్పుడు శ్వాస సరిగా ఉండేట్లు శస్తచ్రికిత్స చేయించుకోవాలి. అడినాయిడ్స్, టాన్సిల్స్ గాని ఉంటే తీయించాలి. థైరాయిడ్ వ్యాధి ఉన్న వాళ్ళు థైరాయిడ్ హార్మోన్లు తీసుకోవాలి. ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గించుకోవాలి. వీటితో పాటు కొన్ని హోం రెమెడీస్ తో కూడా గురకను నివారించుకోవచ్చు. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో చూద్దాం....

ఆలివ్ ఆయిల్ :
గురకను నివారించడంలో ఆలివ్ ఆయిల్ ఒకటి. ఇది ఇన్ఫ్లమేషన్ కు గురైన టిష్యలున్ , రెస్పిరేటరీ ప్యాసేజ్ కు ఉపశమనం కలిగిస్తుంది. శ్వాసనాళ వాపు తగ్గిస్తుంది. నాజల్ ప్యాసేజ్ సలపడాన్ని తగ్గిస్తుంది.

యాలకలు:
శ్వాయస నాళాల్లో ఇబ్బందలు, బ్లాకేజ్ లను నివారించడంలో కార్డమమ్ గ్రేట్ గా సహాయపడుతుంది. శ్వాస నాళలంలో ఎలాంటి ఇబ్బందులేకుండా ఉంటే గురక సమస్యలు ఉండవు.

నాటెల్ లీఫ్:
నాటెల్ లీఫ్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది గురకను తగ్గించడంలో సహాయపడుతుంది. నాజలమ ప్యాసేజ్ అలర్జీల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

తేనె :
తేనె వాపులను తగ్గిస్తుంది. గొంతు నొప్పి నివారిస్తుంది . శ్వాస నాళంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తుంది. అందుకు తేనె లూబ్రికాంట్ గా సహాయపడుతుంది. గురక తగ్గిస్తుంది. గొంత నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

నెయ్యి:
నెయ్యి ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. నిద్రలేమి సమస్య నివారిస్తుంది. ఇది బ్లాక్ అయిన నాజల్ ప్యాసేజ్ ను ఫ్రీ చేస్తుంది. దాంతో గురక కంట్రోల్ అవుతుంది. నిద్రబాగా పడుతుంది.

స్టీమ్:
నాజల్ ప్యాసేజ్ బ్యాక్ అయినప్పుడు లేదా శ్వాసనాళం బ్లాక్ అయినప్పుడు స్టీమ్ ద్వారా ఉపశమనం కలుగుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా ముక్కు దిబ్బడను నివారిస్తుంది. సులభంగా బ్రీతింగ్ తీసుకోవడానికి సహాయపడుతుంది. నిద్ర బాగా పట్టేందుకు సహాయపడుతుంది.

పెప్పర్ మింట్:
పుదీనా నిద్రలేమి సమస్యను, గురకను ఎఫెక్టివ్ గా నివారించడలో గొప్పగా సహాయపడుతుంది. ముక్కదిబ్బడ, గొంతు నొప్పి తగ్గిస్తుంది. అలాగే జలుబు, దగ్గు నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు:
పసుపులో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నాజల్ ప్యాసేజ్ ను క్లియర్ చేస్తుంది . ముక్కులో ఏలాంటి బ్లాక్స్ ఏర్పడకుండా పసుపు నివారిస్తుంది . పసుపును గోరువెచ్చని పాలలో వేసుకొని త్రాగడం వల్ల ప్రభావం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

వెల్లుల్లి:
సైనస్ వల్ల వచ్చే నాజల్ బ్లాకేజ్ ను నివారించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది . వెల్లుల్లిల్లో ఉండే హీలింగ్ లక్షణాలు బ్లాకేజ్ ను క్లియర్ చేసి, శ్వాసనాళాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దాంతో మంచి నిద్ర పడుతుంది.

చమోమెలీ :
చమోమెలీ(చామంతి)లొ ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గురకను నివారించడంలో చాలా గొప్పగా సహాయపడుతుంది . దాంతో ముక్కులోని కండరాలు వదులైన బెటర్ గా నిద్రపడుతుంది. చమోమెటీ టీని త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications











