Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
ప్రతి రోజూ పసుపు టీ తాగడం వల్ల పొందే అమోఘమైన ప్రయోజనాలు
పసుపును రకరకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఎన్నో ఔషధ గుణాలు దాగున్న పసుపుని వందల ఏళ్ల నుంచి ఇప్పటివరకు ఉపయోగిస్తున్నాం. దీన్ని చిటికెడు వేస్తే చాలు.. ఆహారాలకు పసుపు రంగు తీసుకొస్తుంది. టేస్ట్ ని తీసుకొస్తుంది.
నిత్యం వంటకాల్లో పసుపు వాడకం వల్ల పొందే లాభాలేంటి ?
వంటకాలలో ఉపయోగించడమే కాదు.. ఇందులో అనేక హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయి. పసుపులో ఉండే ప్రధాన పదార్థం కర్క్యూమిన్. ఇది.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పసుపులో ఉంటాయి.
ఈ ఔషధ గుణాలన్నీ.. రకరకాల అనారోగ్య సమస్యలు నివారించడానికి ముఖ్యమైనవి. అలాగే పసుపులో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్స్ బి, సి, ఈ, కే, ఐరన్, క్యాల్షియం, ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి.
రెగ్యులర్ గా పసుపు వాటర్ తాగితే.. పొందే పవర్ ఫుల్ బెన్పిట్స్
పసుపుని తీసుకునే పద్ధతుల్లో టీ ఒకటి అత్యంత మంచిది. చాలా సింపుల్ గా పసుపు టీని తయారు చేసుకోవచ్చు. ఒక టీస్పూన్ పసుపుని 3 నుంచి 4 కప్పుల మరుగుతున్న నీటిలో కలపాలి. కాసేపు ఉడికించాలి. తర్వాత వడకట్టి.. తేనె లేదా నిమ్మరసం కలుపుకోవాలి. అంతే పసుపు టీ రెడీ టు డ్రింక్.
ప్రతిరోజూ పసుపు తీ తాగడం వల్ల.. అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. మరి ప్రతి రోజూ క్రమం తప్పకుండా.. పసుపు టీ తాగితే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

న్యాచురల్ పెయిన్ కిల్లర్
పసుపులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. నొప్పితో బాధపడేవాళ్లు.. పసుపు టీ రెగ్యులర్ గా తాగుతూ ఉంటే.. న్యాచురల్ పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది.

బరువు తగ్గడానికి
బరువు తగ్గాలని భావించేవాళ్లకు పసుపు టీ చాలా సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్క్యూమిన్ బరువు తగ్గడానికి సహాయపడి, ఒబేసిటిని అరికడుతుంది.

డయాబెటిస్
పసుపు టీలో షుగర్ వ్యాధిని నివారించే సత్తా ఉంది. ముఖ్యంగా టైప్ టు డయాబెటిస్ రాకుండా.. నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పసుపు టీ.

గ్యాస్ట్రోటెస్టినల్ ట్రీట్మెంట్
పసుపులో ఉండే కర్క్యూమిన్ యాంటీ ఇన్ల్ఫమేటరీగా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఇంటెస్టినల్ పెయిన్ ని, డ్యామేజ్ ని తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్ లెవెల్స్
పసుపులో ఉండే కర్క్యూమిన్ పదార్థం.. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడాన్ని అరికడుతుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి, హై బ్లడ్ ప్రెజర్, హార్ట్ ఎటాక్ రిస్క్ లను తగ్గిస్తుంది.

అల్జీమర్స్
కర్క్యూమిన్ బ్రెయిన్ లో బ్లాకేజ్ ని అరికట్టు.. ఫ్యూచర్ లో అల్జీమర్స్ వ్యాధి రాకుండా నివారిస్తుంది.

లివర్ డెటాక్సిఫికేషన్
పసుపులో ఉండే కర్క్యూమిన్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. టీ రూపంలో దీన్ని తాగడం వల్ల.. కాలేయ వ్యాధులను, కాలేయం డ్యామేజ్ అవకుండా నివారిస్తుంది.

ఇమ్యునిటీ
పసుపులో ఉండే కర్క్యూమిన్ లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇది ఇమ్యునిటీ పెరగడానికి సహాయపడుతుంది. ఇది రకరకాల ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది.

క్యాన్సర్
పసుపు టీ క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుంది. కర్క్యూమిన్ అనే పదార్థం.. కీమో ప్రివెంటివ్ ఏజెంట్ గా పనిచేసి.. సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గిస్తుంది.

ఆర్థరైటిస్
కీళ్లనొప్పులకు పసుపు టీ న్యాచురల్ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది. యాంటీ ఇన్ల్ఫమేటరీ ఏజెంట్ లా పనిచేసి.. ఇన్ల్ఫమేషన్, పెయిన్ ని నివారిస్తుంది.

గాయాలు మానడానికి
టర్మరిక్ టీ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. గాయలు త్వరగా మానడానికి పసుపును అప్లై చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే టర్మెరిక్ టీ యాంటీబయోటిక్ లా పనిచేసి కొన్ని రకాల బాడీ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

డిప్రెషన్
చైనా వాళ్లు పూర్వ కాలం నుంచి పసుపును ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఆందోళన, డిప్రెషన్ తగ్గించువచ్చట. ఇది మైండ్ ను రిలాక్స్ చేస్తుంది. టర్మరిక్ టీని ప్రతి రోజూ త్రాగడం వల్ల హ్యాపీగా నిద్రపోవచ్చు.

చర్మానికి
టర్మరిక్ టీ తాగడం, చర్మానికి అప్లై చేయడం వల్ల అనేక రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను, మొటిమలు, మచ్చలు, ఎగ్జిమాను నయం చేయవచ్చు.

కంటిచూపు
పరిశోధనల ప్రకారం పసుపులో ఉండే కర్క్యూమిన్, బ్లైండ్ నెస్ ను నివారిస్తుంది. కంటిచూపులో లోపాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీర్ఘకాలిక కంటి సమస్యలను నివారిస్తుంది.

పంటి సమస్యలు
టర్మరిక్ టీ పంటి సమస్యలను, చిగుళ్ల వాపులను తగ్గిస్తుంది. టర్మరిక్ టీలో కొద్దిగా లవంగాలు లేదా లవంగం నూనె చేర్చి మరిగించి, ఆ నీటితో నోటిని శుభ్రం చేసుకోవడం లేదా పుక్కిలించడం వల్ల చిగుళ్ల వాపు, ఇతర దంత సమస్యలు నయమవుతాయి.



Click it and Unblock the Notifications











