Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఎగ్, పెప్పర్ కాంబినేషన్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా !!
మీకు ఎగ్స్, ఎగ్స్ తో తయారు చేసిన వంటకాలు తినడం ఇష్టమా ? అలాగే ఎగ్స్ పై పెప్పర్ యాడ్ చేసుకుని తినడాన్ని ఇంకా ఆస్వాదిస్తారా ? అయితే మీకొక గుడ్ న్యూస్. టేస్టీ స్నాక్స్ తినడం కంటే.. ఎగ్స్ తినడం వల్ల.. హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుందని.. తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
కోడిగుడ్డుతో.. కొలెస్ర్టాల్ ఖతం
చాలామందికి తెలుసు కోడిగుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని.. అవి మనల్ని హెల్తీగా ఉంచుతాయని. చాలా దేశాల్లో ఎగ్స్ చాలా పాపులర్ హెల్తీ పుడ్. అందుకే.. వాళ్లంతా.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఎగ్స్ తినడానికి ఇష్టపడతారు. కోడిగుడ్లలో ప్రొటీన్స్, పొటాషియం, విటమిన్ ఏ, డి, బి 12 ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది.
అయితే ఎగ్ ఎలా తీసుకోవాలి అనేది చాలామందికి అయోమయం. అంతేకాదు.. ఎగ్ ఉడకబెట్టి తింటేనే హెల్తీ అని భావిస్తారు. కానీ.. గుడ్డుని ఫ్రై చేసి, ఉడకబెట్టి, ఆమ్లెట్ వేసి.. ఏదో ఒక రూపంలో డైట్ లో చేర్చుకుంటే.. చాలా హెల్తీ అని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ప్రతిరోజూ ఎగ్స్ తినేవాళ్లను, అప్పుడప్పుడు ఎగ్స్ తినేవాళ్లను పరిశీలించారు.
గుడ్డు తినండి గుడ్ గా ఉండండి: వరల్డ్ ఎగ్ డే 2015 స్పెషల్
ప్రతి రోజూ ఎగ్స్ తినేవాళ్ల ఇమ్యున్ సిస్టమ్ అప్పుడప్పుడు ఎగ్స్ తినేవాళ్లతో పోల్చితే.. చాలా మెరుగ్గా ఉందట. అంతేకాదు.. ఎగ్ తో పాటు కాస్త పెప్పర్ పౌడర్ కలిపి తీసుకుంటే.. చాలా ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు. మరి రెగ్యులర్ గా ఎగ్ విత్ పెప్పర్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల పొందే మిరాకిల్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఎనర్జీ
ఎగ్, పెప్పర్ తో రోజుని ప్రారంభిస్తే.. శరీరంలో మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. రోజంతా చాలా హెల్తీ, ఎనర్జిటిక్ గా ఉంటారు.

హిమోగ్లోబిన్ లెవెల్స్
ఎగ్, పెప్పర్ కాంబినేషన్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ సెల్స్ ఆక్సిజనరేట్ అయ్యేందుకు ఐరన్ సహాయపడుతుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్, హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి.

కండరాలకు
ఎగ్స్, పెప్పర్ తీసుకోవడం వల్ల.. కండరాల పెరుగుదలకు కావాల్సినన్ని పోషకాలు అందుతాయి. దీనివల్ల శరీరం హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి
ఎగ్ వైట్, పెప్పర్ తినడం వల్ల బాడీఫ్యాట్ చాలా వేగంగా తగ్గుతుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్స్ చేర్చుకోవడం వల్ల పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ కలిగి.. ఆకలిని తగ్గిస్తాయి. దీనివల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.

బ్రెయిన్ హెల్త్
ఎగ్స్, పెప్పర్ ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల మెమరీ పెరుగుతుంది. బ్రెయిన్ హెల్తీగా, యాక్టివ్ గా ఉండటానికి సహాయపడుతుంది. ఎగ్స్ లో ఖోలిన్ ఉంటుంది. ఇది హెల్తీ బ్రెయిన్ సెల్స్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.

కంటి సమస్యలు
ఎగ్స్, పెప్పర్ ప్రతి రోజు ఉదయం తీసుకోవడం వల్ల వయసు రిత్యా వచ్చే కంటి సమస్యలు దూరంగా ఉంటాయి. ఎగ్స్ లో ఉండే క్యారటనాయిడ్స్, విటమిన్స్.. మంచి చూపుని ఇస్తాయి.

ఎముకల ఆరోగ్యానికి
ఎగ్స్ లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. పెప్పర్ క్యాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ తీసుకోవడం వల్ల.. ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications