Latest Updates
-
సాయి బాబా ఇచ్చిన 11 మాటలు జీవన సూత్రాలు -
మీద పడ్డ ప్రియురాలు..ఆ బరువుకి చచ్చిపోయిన ప్రియుడు..షాకింగ్ వీడియో -
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి -
భర్తలు మిస్ అవుతున్న ఈ చిన్న విషయం.. విడాకులకి దారితీస్తుందని తెలుసా.? -
వ్యసనాలను వదులుకోలేకపోతున్నారా.. యోగాతో ఇలా చెక్ పెట్టేయొచ్చు.! -
హార్ట్ ఎటాక్ వచ్చే 10 రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే! -
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు..
కాఫీ కంటే.. గ్రీన్ టీనే ఎందుకు మంచిదో తెలుసా ?
కాఫీ అంటే చాలా మందికి చాలా ఇష్టంగా ఉంటుంది. ఉదయం నిద్రలేవగానే కాఫీ తాగకపోతే ఏ పనిచేయలేమని చెప్పేవాళ్లు చాలామందే ఉంటారు. రోజుని ప్రారంభించేది కాఫీతోనే అనేవాళ్లూ ఉంటారు. అలాగే కొంతమంది కాఫీకి చాలా అడిక్ట్ కూడా అయి ఉంటారు. పూట పూట కాఫీ లేకుండా ఉండలేరు. అయితే ఇలా కాఫీకి మరీ ఎక్కువగా అడిక్ట్ అయితే.. ఆరోగ్యం అనేక రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది.
కాఫీ నిద్రకు కూడా భంగం కలిగిస్తుంది. అలాగే ఎనర్జీ లెవెల్స్ పై కూడా దుష్ర్పభావం చూపుతుంది. ఎనర్జీ లెవెల్స్ తగ్గినప్పుడు మళ్లీ ఇంకో కప్పు కాఫీ తాగాలనే ఫీలింగ్ కలుగుతుంది. అది కూడా స్ట్రాంగ్ గా తీసుకోవాలని భావిస్తాయి. ఇలా ఎక్కువగా కాఫీ తాగడం వల్ల ఎనర్జీ కరిగిపోయేలా చేసి అలసటకు లోనవుతారు.
అయితే కాఫీ కంటే గ్రీన్ టీ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే.. గ్రీన్ టీ కాస్త వగరుగా ఉండటం వల్ల దీన్ని తాగడానికి చాలామంది ఇష్టపడరు. అయితే.. కాఫీ కంటే గ్రీన్ టీ బెటర్ అని ఎందుకు సూచిస్తారో కారణాలు తెలుసుకుంటే.. ఇవాళ్టి నుంచే మీరు గ్రీన్ టీనే తాగడం మొదలుపెట్టేస్తారు. మరి అవేంటో చూద్దామా...

బ్రెయిన్ యాక్టివిటీకి
గ్రీన్ టీలో ఎల్ థియానైన్ ఉంటుంది. ఇది బ్రెయిన్ యాక్టివిటీకి సహాయపడుతుంది. దీనివల్ల గ్రీన్ తాగిన వెంటనే మీరు చేయాల్సిన పనిపై బాగా ఫోకస్ చేయగలుగుతారు. బ్రెయిన్ చాలా షార్ప్ గా మారుతుంది.

మూడ్
గ్రీన్ టీ మూడ్ ని బూస్ట్ చేస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి కాఫీ ఎనర్జీ లెవెల్స్ ని నాశనం చేస్తే.. గ్రీన్ టీ.. మూడ్ ని పెంచుతాయి.

క్యాన్సర్
గ్రీన్ టీలో క్యాన్సర్ నివారించే గుణాలు ఉంటాయి. ఎలాంటి క్యాన్సర్లనైనా నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

అల్జీమర్స్
గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అల్జీమర్స్ ని నివారించవచ్చు. ఇందులో ఉండే కాటెచైన్స్.. న్యూరాన్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి గ్రీన్ టీ తాగడం వల్ల అల్జీమర్స్ కి దూరంగా ఉండవచ్చు.

బ్యాక్టీరియా
గ్రీన్ టీ లో ఉంటే కొన్ని రకాల పోషకాలు.. హానికారక బ్యాక్టీరియాను ఎలిమినేట్ చేస్తాయి. శరీరంలోని ఇతర మైగ్రోఆర్గానిజమ్స్ ని కూడా నివారిస్తుంది.

ఇన్సులిన్ మెరుగుపరచడానికి
గ్రీన్ టీ శరీరంలో ఇన్సులిన్ ని మెరుగుపరుస్తుంది. అంటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నార్మల్ చేస్తుంది. దీనివల్ల డయాబెటిస్ కి దూరంగా ఉండవచ్చు. అలాగే డయాబెటిస్ తో బాధపడేవాళ్లు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది.

మెటబాలిజం
గ్రీన్ టీ మెటబాలిజం ని పెంచడానికి సహాయపడుతుంది. మెటబాలిజం మెరుగైనప్పుడు బరువు తగ్గడం తేలికవుతుంది. వేగవంతమవుతుంది. ప్రతి గంటకు ఒకసారి కాఫీ తాగడం కంటే.. గ్రీన్ టీ తాగితే.. ఇలాంటి ఎన్నో హెల్త్ బెన్ఫిట్స్ పొందవచ్చు. మరి ఇక ఇప్పటినుంచే గ్రీన్ టీ తాగడం అలవరుచుకోండి.



Click it and Unblock the Notifications