Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
చలికాలంలో నీళ్లు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా ?
కామన్ గా అందరూ చెప్పే మాటే ఇది. నీళ్లు బాగా తాగండి.. ఆరోగ్యంగా ఉండండి అని. అయితే అన్ని కాలాలలో నీళ్లు బాగానే తాగినా.. చలికాలం వచ్చిందంటే.. మంచి నీళ్లని నిర్లక్ష్యం చేస్తారు చాలామంది. క్లైమెట్ చల్లగా ఉండటం, చల్లటి గాలి ప్రభావం వల్ల నీళ్లు తాగాలంటే ఇబ్బంది పడతారు. నీళ్లు తాగాలి అని చెప్పినా.. పట్టించుకోరు. కానీ.. చలికాలంలో కూడా ఎక్కువగా నీళ్లు తాగాలని సూచిస్తున్నారు నిపుణులు.
READ MORE: బరువు తగ్గడానికి, బీపీ నియంత్రణకి.. వార్మ్ వాటర్ బాత్
చలికాలం వచ్చిందంటే ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చేది చర్మానికి. పొడిబారిన చర్మం, ఎండిపోయిన చర్మం, నిర్జీవంగా మారిన చర్మంపై కేర్ తీసుకుంటారు. చర్మం మరీ పొడిబారిత.. దురద సమస్య వేధిస్తుంది. అలాగే ఈ కాలంలో నీళ్లు తాగడానికి కూడా ఇష్టపడరు. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుంది. కాబట్టే.. చలికాలంలో కూడా రోజుకి 2 లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి.

ఫ్లూయిడ్ లెవెల్స్:
చలికాలంలో దుప్పట్లు, స్వెట్టర్లు, రూమ్ హీటర్స్ ద్వారా వెచ్చని వాతావరణం క్రియేట్ చేసుకుంటాం. ఇదంతా ఆర్టిఫిషియల్ గా మనం క్రియేట్ చేసుకునే ఎన్విరాన్ మెంట్. అయితే.. బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండాలి.. అలాగే ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గిపోకూడదు. అందుకే.. చలికాలంలో కూడా 8 గ్లాసులు నీళ్లు తాగడం వల్ల ఈ సమస్య ఎదురవదు. చర్మ సమస్యలు కూడా దరిచేరవు.
READ MORE: చౌకైన నిమ్మరసం డైట్ తో.. ఫ్యాట్ కరిగించడం ఈజీ
యాక్టివ్:
మన శరీరం 75 శాతం నీటితో ఉంటుంది. మనం మన బాడీని తినడానికి, శ్వాస తీసుకోవడానికి, నడవడానికి, ఇంకా రకరకాల పనుల కోసం ఉపయోగిస్తాం. ఇలాంటి శారీరక పనులన్నీ చలికాలంలో కూడా యాక్టివ్ గా చేయాలి అంటే.. సరైన పరిమాణంలో నీళ్లు తీసుకోవాలి. అప్పుడు మనం చేసే పనులకు మన శరీరం సహకరిస్తుంది. అలాగే చలికాలంలో మంచినీళ్లు ఫస్ట్ ఎయిడ్ లా పనిచేస్తాయి.

డీహైడ్రేషన్:
సాధారణంగా చలికాలంలో ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటూ ఉంటాం. ఇలాంటి పదార్థాలే చలికాలంలో ఎట్రాక్ట్ చేస్తాయి.. మనకు అనుకూలమని అనిపిస్తాయి. వాటిలో చాక్లెట్స్, కాఫీ, టీ వంటివి ఎక్కువగా తీసుకుంటాం. అయితే.. వీటన్నింటి నుంచి హాని కలుగకూడదు అంటే.. నీటి పరిమాణం పెంచడం చాలా అవసరం.
ఒకవేళ మీ శరీరం ఎక్కువగా పొడిబారుతున్నా.. డీహైడ్రేషన్ కి గురవుతున్నారని అనిపించినా.. మీరు సరైన మోతాదులో నీళ్లు తాగడం లేదని సంకేతం. కాబట్టి వెంటనే మీరు చలికాలం కదా అని నిర్లక్ష్యం చేయకుండా.. మంచి నీళ్లు తాగే పరిమాణం పెంచాలి.

కిడ్నీ డిసీజ్:
శరీరానికి కావాల్సిన పరిమాణంలో నీళ్లు తాగడం వల్ల కిడ్నీ డిసీజ్ ల రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి.. రోజుకి 8 గ్లాసులు ఖచ్చితంగా తాగాలి. కొంతమందికి అంతకంటే ఎక్కువ తాగాలని కూడా ఉంటుంది. 8 గ్లాసులు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంలో నీళ్లు తాగితే.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.. అలాగే మీరూ ఆరోగ్యంగా ఉంటారు.
READ MORE: బరువు తగ్గాలనుకొనే వారికి 7 రోజుల వాటర్ డైట్ తో గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్
చల్లటినీళ్లకు దూరం:
అయితే చలికాలంలో చల్లని నీళ్లు తాగకూడదు. వీలైతే గోరువెచ్చని నీళ్లు తాగితే మంచిది. లేదా వేడిగా ఉన్న హెర్బల్ టీ తాగినా మంచి ఫలితాలు పొందవచ్చు. కానీ.. చల్లని నీటికి, పానీయాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
