ప్రెష్ జింజర్ - క్యారెట్ జ్యూస్ లో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్..!!

By Super Admin

ఒక మనిషికి ఆరోగ్యకరమైన శరీరం మరియు అందమైన చర్మం కలిగి ఉంటే, ఇంత కంటే ఏం కావాలి . హెల్తీ బాడీ , హెల్తీ స్కిన్ పొందడానికి బ్యాలెన్డ్ డైట్ చాలా ముఖ్యం. మనిషి తీసుకునే సమతుల్య ఆహారం మీద ఆరోగ్యం, అందం ఆధారపడి ఉంటుంది.

అందంగా ఆరోగ్యంగా ఉండటానికి కొంత మంది కార్బోనేటెడ్ డ్రింక్స్ ను ఎక్కువగా తీసుకుంటుంటారు. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి .కాబట్టి ఇంట్లో ఉండే కొన్ని ఆరోగ్యమైన పదార్థాలను ఉపయోగించి హెల్తీ డ్రింక్ తయారుచేసుకోవచ్చు.

అటువంటి హెల్తీ డ్రింక్ లో ఫ్రెష్ జింజర్ క్యారెట్ జ్యూస్ ఒకటి. ఇది ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ డ్రింక్ వల్ల ఆరోగ్యపరంగా ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఈ రెండు వెజిటేబుల్స్ లో న్యూట్రీషియన్స్ , మల్టీ విటమిన్స్, మినిరల్స్ మరియ యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి, ఈ రెండింటి కాంబినేషన్ లో జ్యూస్ తయారీ..

కావల్సినవి: క్యారెట్స్ – 4 to 5

అల్లం –½ inch

నిమ్మకాయ–½

దాల్చిన చెక్క (చిటికెడు)

సీసాల్ట్(చిటికెడు)


జ్యూస్ తయారీ: క్యారెట్, అల్లం తొక్క తీసి శుభ్రంగా కడిగాలి.ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూసర్ లో వేసి జ్యూస్ రెడీ చేయాలి. ఈ జ్యూస్ ను గ్లాసులోకి తీసుకుని నిమ్మరసం

పిండి, కొద్దిగా సీసాల్ట్, దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేసి ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ తో పాటు తీసుకోవాలి. ఈ ఫ్రెష్ జింజర్ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..

వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది:

వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది:

ఈ జ్యూస్ ను రెగ్యులర్ రోజకొకసారి తాగడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది, పిల్లల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందులో ఉండే విటిమిన్ ఎ మరియు సిలు ఇమ్యూన్ సెల్స్ ఉత్పత్తికి సహాయపడుతాయి. ముఖ్యంగా విటమిన్ ఎ వైట్ బ్లడ్ సెల్స్ పెంచుతుంది. దాంతో అనారోగ్య సమస్యలుండవు. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి, ఇవి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది . ఎక్కువ ఆక్సిజన్ సప్లైకు సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యం మెరుగు:

చర్మ ఆరోగ్యం మెరుగు:

అల్లం, క్యారెట్ జ్యూస్ లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇవి హెల్తీ స్కిన్ ను ప్రోత్సహిస్తుంది . చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ఈ డ్రింక్ లో ఉండే విటిమన్ ఇతర యాంటీఆక్సిడెంట్స్ , క్యారెట్ చర్మ ఆరోగ్యాయినికి చాలా మేలు చేస్తుంది. ఇవి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది . మొటిమలను , పిగ్మెంటేషన్ , స్కిన్ టోన్ సమస్యలను నివారిస్తుంది. క్యారెట్ లోని బీటా కెరోటిన్ హెల్తీ స్కిన్ పొందడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

ఫ్రెష్ జింజర్ క్యారెట్ జ్యూస్ లో అన్ని రకాల క్యాన్సర్ లక్షణాలను దూరం చేస్తుంది. శరీరానికి రక్షణ కల్పిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాక్సిడేటివ్ లక్షణాలు , యాంటీ మెటాస్టాటిక్ లక్షాలు కలిగి ఉంటుంది. అల్లం ఓవేరియన్, లంగ్, బ్రెస్ట్, స్కిన్, ప్రొస్టేట్ మరియు ప్యాంక్రియాటిక్ వంటి వివిధ రకాల క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది.

కార్డియో వాస్క్యులర్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

కార్డియో వాస్క్యులర్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

అల్లం మరియు క్యారెట్ లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. ఇది కార్డియో వ్యాస్కులర్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. హార్ట్ హెల్త్ కు క్యారెట్ గ్రేట్ గా సహాయపడుతుంది. క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్ మరియు లూటిన్ కొలెస్ట్రాల్ తో పోరాడుతుంది మరియు హార్ట్ అటాక్ ప్రమాధంను తగ్గిస్తుంది. పొటాషియం హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది:

డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది:

డయాబెటిస్ తో బాధపడుతున్న వారు, క్యారెట్ , జింజ్ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. అల్లం బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది . ఇన్సులిన్ లెవల్స్ ను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ తో వచ్చే ఇతర అనారోగ్య సమస్యను దూరం చేస్తుంది.

జీర్ణ శక్తిని పెంచుతుంది:

జీర్ణ శక్తిని పెంచుతుంది:

అల్లం, క్యారెట్ జ్యూస్ జీర్ణ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో క్యారెట్, అ్లలం తప్పనిసరిగా చేర్చుకోవాలి. రెండింటిలో న్యూట్రీషియన్ ఎక్కువగా ఉండటం వల్ల ,ఇవి కోలన్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. పచ్చి క్యారెట్ జ్యూస్ పొట్ట సమస్యలను నివారిస్తుంది. మలబద్దక సమస్య ఉండదు. అల్లం వికారం, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. హార్ట్ బర్న్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Desktop Bottom Promotion