Latest Updates
-
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు! -
వట్టి నీళ్లు తాగలేకపోతున్నారా? డీహైడ్రేషన్ కు చెక్ పెట్టే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే!
రాత్రి 7 తర్వాత ఈ ఆహారాలను ఖచ్చితంగా ఎందుకు తినకూడదంటే..!?
సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం, శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు లేదా భారీకాయం వంటి అంశాల వల్ల కూడా సరిగ్గా నిద్రపట్టదు. అటువంటి సమస్యలకు తోడు మానసిక ఆదుర్దా, అతి ఆలోచనలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడుతుంది. ఇటు వంటి అసౌకర్యాలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలి. రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. అంతే కాదు చాలా మంది నిద్రపోవడానికి నిద్రమాత్రలు వేసుకుంటారు అది ఆరోగ్యానికి మంచిది కాదు.
నిద్రలేమికి మరో ముఖ్యం కారణం కూడా ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. ఉదయం నిద్రలేవగాని కడుపు ఉబ్బరం, మలబద్దకం, గ్యాస్, అజీర్ణం, యాసిడి రిఫ్లెక్షన్, విరేచనాలు ఇలాంటివి మరికొన్ని జీర్ణక్రియ సమస్యలు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. కొవ్వు పదార్ధాలు, మసాలా దినుసులు తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవటం మంచిది. ఇవి కడుపును అసౌకర్యంగా ఉంచుతాయి.
ముఖ్యంగా రాత్రిళ్ళు తీసుకొనే కొన్ని ఆహారాలు నిద్రలేకుండా చేస్తాయి. ఉదాహరణకు ఉదయం నిద్రలలేవగానే యాసిడ్ రిఫ్లెక్షన్ గురైతే, రాత్రిళ్లో కార్బొనేటెడ్ డ్రింక్స్, సోడాలకు దూరంగా ఉండాలి. అదే విధంగా అజీర్తి సమస్యలు గమనించినట్లైతే, రాత్రిళ్లో హార్డ్ గా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఉదా: పచ్చి ఉల్లిపాయలు, చిదిమిన బంగాళదుంపలు వంటి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలు రాత్రిళ్ళో తినడం మానేయాలి.
కాబట్టి మీరు రాత్రుల్లో ప్రశాంతమైన నిద్ర పొందాలన్నా ఆరోగ్యరంగా నిద్రలేవన్నా కొన్ని ఆహారాలు రాత్రుల్లో తినడం మానుకోవడంతో పాటు, రాత్రివేళ భోజనం మితంగా తినాలి. పొద్దున పూట కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు కానీ రాత్రి పూట మాత్రం కడుపులో కొంచెం ఖాళీ ఉండగానే కంచం ముందు నుంచి లేవటం మంచిది. కాబట్టి ఇటు మంచి నిద్ర కోసం.. అటు ఆరోగ్యానికి... నిద్రించే ముందు అంటే 7 గంటల సమయం తర్వాత తీసుకోకూడని కొన్ని ఆహారాలు మీకోసం...

డిజర్ట్స్ :
రాత్రుల్లో డిజర్ట్స్ తినడం వల్ల ఓవర్ వెయిట్ పెరుగుతారు. గ్రీసీ ఫుడ్స్, అంటే క్రీమ్(ఐస్ క్రీమ్స్), ఆయిల్, ఫ్యాట్ ఫుడ్స్, రాత్రి సమయంలో తినడం మానేయాలి. వీటిని రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల మిమ్మల్ని అలసటకు గురిచేయడమే కాకుండా మరుసటి రోజు ఉదయానికి బద్దకస్తులుగా మార్చుతుంది. కడుపులో వీటివల్ల వికారం ఏర్పడి, విరేచనాలకు దారితీస్తుంది. బరువు పెరగడానికి దారితీసి ఆ ఫ్యాట్ ఫుడ్ ను నిద్రకు ముందు తీసుకోకపోవడం చాలా మంచిది.

పొటాటో చిప్స్ వంటి స్నాక్స్ :
ఫ్రైడ్ ఫుడ్స్ రాత్రిళ్లో తినకూడదు. వీటిని హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి కొవ్వు మరియు ట్రాన్స్ కొవ్వు థమనులను పాడుచేస్తాయి. జీర్ణం అవ్వడానికి కూడా కష్టం అవుతుంది. దాంతో నిద్రలేకుండా చేస్తుంది.

అన్నం:
ప్లేట్ నిండుగా రైస్ తినడం , రాత్రుల్లో రైస్ పాటు, ఇతర ఫ్యాట్ ఫుడ్స్ ను హెవీగా తీసుకోవడం వల్ల టమ్మీ ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు:
హై ఫైబర్ ఫుడ్స్ లో స్ట్రాచ్ (గంజి) ఎక్కువగా ఉంటుంది, కాబట్టి, రాత్రుల్లో ఓట్ మీల్, బేక్ చేసిన పొటాటో, హోల్ వీట్ బ్రెడ్ ను 7 గంటల తర్వాత ఖచ్చితంగా నివారించాలి.

జంక్ ఫుడ్స్:
ఇతర ఫ్యాటీ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్, చీజ్ బర్గర్స్ వంటి ఆహారాలను నింద్రించే ముందు తప్పనిసరిగా నివారించాలి. ఎందుకంటే అవి కడుపులో నేచురల్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి హార్ట్ బర్న్ కు దారితీస్తుంది.

పాస్తా:
ఫాస్ట్ ఫుడ్ సంబంధించిన పాస్తా పిండితో కూడినటువంటి ఆహారం. ఒక రకమైనటువంటి నిశితమైన ధాన్యంతో తయారు చేయబడిన పాస్తా తినడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకొని, నిద్రకు అంతరాయ్యం కలిగిస్తుంది. కాబట్టి నిద్రించే ముందు వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

డార్క్ చాక్లెట్స్:
చాక్లెట్స్ లో ప్యాట్స్, కెఫిన్ మరియు కోకా అధికంగా ఉండటం వల్ల ఎసిడిటి సమస్యను తీవ్రతరం చేస్తాయి. డిన్నర్ తర్వాత కొన్ని డిజర్ట్స్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రుల్లో చాక్లెట్స్ కు దూరంగా ఉండాలి. లేదంటే మీకు నిద్రలేకుండా చేస్తుంది.

సెరల్స్ :
నిద్రించడానికి ముందు సెరల్స్ తీసుకోకపోవడం మంచిది, వీటిలో షుగర్ కంటెంట్ మరియు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి, వీటికి దూరంగా ఉండటమే మంచిది.

పాలు:
ఆహారాలు అంటే అధిక కొవ్వున్న పాలు, పెరుగు, వెన్న మరియు జున్ను వంటివి రాత్రి సమయంలో జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది. అంతే కాదు వీటిని తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దాంతో గుండెలో మంటగా అనిపిస్తుంది. నిద్రసరిగా పట్టకుండా చేస్తుంది.

హై షుగర్ ఫుడ్స్:
ఈ ప్రపంచంలో క్యాండీస్ అంటే ఇష్టపడని వారు ఉండరంటే ఆశ్చర్యపడాల్సిందే. ఎవరైనా సరే ఏదో ఒక వయస్సులో వీటిని టేస్ట్ చూసే ఉంటారు. అంతే కాదు, ఇప్పటీకి వీటి మీద మక్కువ ఏమాత్రం తగ్గదు. అయితే బరువు తగ్గించుకోవాలనుకొనే డైటర్స్ మాత్రం వీటికి దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరిగేలా చేస్తుంది. ఇవి రాత్రి సమయంలో తినడం వల్ల అలసటకు గురిచేస్తుంది. మీకు ప్రశాంతంగా మరియు పీస్ ఫుల్ గా నిద్రించాలంటే, మీ ప్రియమైన షుగర్ ఫుడ్స్ కు దూరంగా ఉండాల్సిందే..

పండ్లు:
మనక ఆశ్చర్యం కలగవచ్చు . అయితే ఫ్రూట్స్ లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది డ్యూరియాటిక్ కు కారణం అవుతుంది. దాంతో మీరు రాత్రుల్లో ఎప్పుడు పడితే అప్పుడు మూత్ర విసర్జనుకు లేయాల్సి వస్తుంది . కాబట్టి ఇటువంటి ఫ్రూట్ సలాడ్స్ ను రాత్రుల్లో తీసుకోవడం మానేయండి. కొంతం మందికి పండ్లు యాసిడ్ రిఫ్లెక్షన్ కు దారితీస్తాయి.

ఫ్రూట్ జ్యూస్ లు :
ఫ్రూట్ జ్యూసుల్లో ఉండే అసిడిక్ నేచర్ వల్ల హార్ట్ బర్న్ కు గురిచేస్తుంది. దాంతో నిద్ర సరిగా పట్టదు. కాబట్టి రాత్రుల్లో వీటిని తీసుకోకపోవడమే మంచిది.

ఆల్కహాల్:
శరీరంలో ఉండే నీరును తగ్గిస్తుంది. శరీరాన్ని డీహైడ్రేట్ కు గురిచేస్తుంది. అంతే కాదు ఇది శరీరంలో ఉండే సెరోటిన్(serotonin)స్థాయిని తగ్గించి నిద్రలేమికి గురిచేస్తుంది.

నట్స్ :
నట్స్ ఎప్పుడూ ఉదయం తింటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు, రాత్రుల్లో ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, జీర్ణం సరిగా అవ్వక నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది.

స్పైసీ ఫుడ్స్ :
స్పైసీఫుడ్స్ అతి కారంగా ఉన్న ఆహారాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు, కారంగా ఉన్న సాస్ ఫుడ్స్, కారంగా ఉన్న పెప్పర్ ఫుడ్ తినడం వల్ల కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. ఈ నిరుపయోగకరమైన ఆహారాలను రాత్రి నిద్రించే ముందు తినకపోవడం వల్ల మీకు మంచి నిద్ర పట్టవచ్చు. కావట్టి ఎక్కువ కారం ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి.

రెడ్ మీట్:
రాత్రి సమయంలో రెడ్ మీట్ తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. అయితే పూర్తిగా నిలిపివేయడం కంటే ఈ ప్రోటీన్ ఫుడ్ ను తగిన మోతదాలో తీసుకోవడం మంచిది. అది కూడా లేట్ నైట్ కాకుండా త్వరగా తీసుకొంటే ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం తీసుకొన్న తర్వాత వేడి నీళ్ళు లేదా వేడి పాలను త్రాగి నిద్రించడం వల్ల అటు జీర్ణశక్తికి ఇటు మీ గాఢ నిద్రకు ఎటువంటి భంగం కలగదు.

చిల్లీ లేదా చిల్లీ పెప్పర్ :
పగలు మన శరీరంలో మెటబాలిక్ రేటు(జీవక్రియలు చురుగా పనిచేస్తాయి) ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పగలు చీల్లీ లేదా చిల్లీ పెప్పర్స్ తిన్నా తేలికగా జీర్ణమవుతాయి. రాత్రుల్లో జీర్ణంకాకపోగా, కడుపులో మంట, నిద్రలేమికి దారితస్తుంది. కాబట్టి, రాత్రుల్లో వీటిని ఖచ్చితంగా మానుకోవాలి.

చైనీస్ ఫుడ్స్:
నూడిల్స్ లో అత్యధికంగా కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇవి బరువును సులభంగా పెంచుతాయి . వీటిలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండటం వల్ల ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఓబేసిటికి దారితీస్తుంది. దాంతో జీర్ణక్రియకు కష్టం అవుతుంది. కాబట్టి రాత్రుల్తో నూడిల్స్ తినడం మానుకోండి. అలాగే స్పైసీ గ్రేవీ మంచూరియన్ వంటి ఆహారాలకు కూడా దూరంగా ఉండండి. లేదంటే ఇవి హార్ట్ బర్న్ కు కారణం అవుతాయి.

సెలరీ:
సెలరీ గురించి ఆశ్చర్యం కలగవచ్చు. ఇది నేచురల్ డ్యూరియాటిక్ పదార్థం. ఇది రాత్రుల్లో ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు దారి తీస్తుంది. దాంతో నిద్రలేమి, ఉదయం అసౌకర్యం. కాబట్టి రాత్రుల్లో ఈ ఆహారానికి చెక్ పెట్టండి.

పాలు, గుడ్డు కలిపి తీసుకోకూడదు:
రాత్రుల్లో పాలు, గుడ్లు రెండి కాంబినేషన్స్ డెడ్లీ కాంబినేషన్ ఫుడ్స్. ఇవి జీర్ణవ్యవస్థ మీద తీవ్రప్రభావం చూపుతాయి. నిద్రకు భంగం కలిగిస్తాయి.



Click it and Unblock the Notifications