Latest Updates
-
వృషభం, సింహం, కుంభ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ రాశి ఉందా? - 03 నుండి 09 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి ఆదివారం అదృష్ట యోగం..! - ఆదివారం, 03 మే 2026 -
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
మీరు ఖచ్చితంగా నేలపై కూర్చుని తినాలి అనడానికి 12 కారణాలు.. !
ఇప్పుడు భోజనం చేయాలన్నా, టిఫిన్ చేయాలన్నా, తినాలన్నా, తాగాలన్నా.. అన్నింటికీ కుర్చీలు, టేబుల్స్ కి బాగా అలవాటు పడిపోయాం. ఏ మాత్రం నడుము వంచకుండా.. అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నాం. కానీ.. మన పూర్వీకులు మనకు నేర్పిన అలవాట్లు, పద్ధతులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. కానీ మనం వాటిని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం.
చాలామంది సంప్రదాయబద్ధం కింద నేలపై కూర్చుకుని భోజనం చేయడం చూస్తూ ఉంటాం. డైనింగ్ టేబుల్, చెయిర్ ఉన్నా కూడా మన పెద్దవాళ్లు దానిపై తినడానికి ఇబ్బందిగా ఫీలవుతారు. అందుకే.. పాత పద్ధతినే పాటిస్తూ కింద కూర్చుని తింటారు. అయితే ఈ కాలం పిల్లలకు, పెద్దవాళ్లకు టీవీ ముందు కూర్చుని, సోఫాలు, మంచాలు, కుర్చీలు.. ఏది అనుకూలంగా ఉంటే వాటిపై కూర్చుని ఆరగించేస్తుంటారు.
ఇలా కూర్చుని తినడం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ.. ఇది ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాన్ని అందివ్వదు. మనం నేలపై కూర్చుని తినాలని మన పెద్దవాళ్లు చెప్పిన పద్ధతి వెనక చాలా ప్రయోజనాలున్నాయి. కూర్చునే పద్ధతి కూడా రెండు కాళ్లు క్రాస్ గా మడతపెట్టి కూర్చుని తినాలి. ఇలా తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు మీరు విస్తుపోయేలా చేస్తాయి. మీరు ఖచ్చితంగా నేలపై కూర్చుని తినే అలవాటుకి మీ మనసు మారేలా చేసే కారణాలేంటో చూసేద్దామా..

జీర్ణక్రియ
తినడానికి నేలపై కూర్చునప్పుడు ఖచ్చితంగా మీరు కాళ్లు మడతపెట్టి కూర్చుంటారు. అంటే.. దాన్నే సుఖాసన లేదా హాఫ్ పద్మాసన అని పిలుస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇలా ఆహారం ముందు కూర్చోవడం వల్ల జీర్ణక్రియకు సిద్ధంగా ఉండాలని మెదడుకి సంకేతాలు అందుతాయి.

జీర్ణక్రియ
ప్లేట్ ఫ్లోర్ పై ఉండటం వల్ల ఆటోమెటిక్ గా మీ శరీరం కిందకు వంగుతుంది. ఆహారం తీసుకున్న తర్వాత మళ్లీ వెనక్కి కూర్చున్న పొజిషన్ కి వస్తుంది. ఇలా వెనక్కి, ముందుకి వెళ్లడం వల్ల.. పొట్టలో ఉండే కండరాలు యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల ఆహారం త్వరగా, సులువుగా జీర్ణమవుతుంది.

బరువు తగ్గడానికి
ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇలా కూర్చుని తినేటప్పుడు ఆహారంపై మెదడు ఫోకస్ పెడుతుంది. ఎంత పరిమాణంలో ఆహారం తిన్నారు అనే విషయాన్ని గుర్తించి.. పొట్ట నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది.

బరువు తగ్గడానికి ఎలా ?
సాధారణంగా పొట్ట నుంచి బ్రెయిన్ కి వాగస్ నెర్వ్ సిగ్నల్స్ అందజేస్తుంది. మీరు తిన్న ఆహారం మీ పొట్ట నింపిందా లేదా అనే విషయాన్ని ఈ సిగ్నల్స్ అందిస్తాయి. ఎప్పుడైతే కింద ఫ్లోర్ పై కూర్చుని తింటారో అప్పుడు ఈ నరం బాగా పనిచేసి.. ఎఫెక్టివ్ గా సిగ్నల్స్ అందిస్తుంది. టేబుల్ పై కూర్చుని తినడం కంటే.. కింద నిదానంగా తింటారు. దీనివల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అలా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అనుకూలంగా
పద్మాసనంలో కూర్చుని తినడం వల్ల నడుము కింద భాగం, పెల్పిస్, పొట్ట చుట్టూ.. కండరాల నొప్పులు తగ్గుతాయి. మీ జీర్ణవ్యవస్థ రిలాక్స్ గా, నార్మల్ పొజిషన్ లో ఉండేలా సహాయపడతాయి. త్వరగా, వేగంగా జీర్ణమవడానికి ఈ పద్మాసనం సహాయపడుతుంది.

జాగ్రత్తగా తినడానికి
ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల జాగ్రత్తగా ఆహారాన్ని ఎంచుకుంటారు. మీ శరీరం న్యూట్రీషన్ ఫుడ్ తీసుకోవడానికి సహాయపడుతుంది. స్మెల్, టేస్ట్, టెక్చర్, ఎంత తింటున్నాం అనే విషయాలను ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల గమనిస్తారని.. స్టడీస్ చెబుతున్నాయి.

కుటుంబంతో అనుబంధం
సాధారణంగా ఫ్లోర్ పై కూర్చుని తినేది ఫ్యామిలీ యాక్టివిటీ. ఇది కుంటుంబంతో సంబంధం ఏర్పరచుకోవడానికి సరైన సమయం. కింద కూర్చుని తినడం వల్ల ప్రశాంతమైన, హ్యాపీ మూడ్ ఉంటుంది. ఇది కుటుంబంతో బాంధవ్యాన్ని పెంచుతుంది. అలాగే.. కింద కూర్చుని తినేటప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి తినడం కూడా ఆనవాయితీ ఉంటుంది.

భంగిమ
ఆరోగ్యంగా ఉండటానికి భంగిమ చాలా అవసరం. మంచి భంగిమ కేవలం ఆరోగ్యానికే కాదు.. గాయాలను తగ్గిస్తుంది. కండరాలు, కీళ్లపై ఒత్తిడి పడకుండా నివారిస్తుంది. అలాగే రకరకాల బ్యాక్ పెయిన్, ఇతర నొప్పులు రాకుండా అరికడుతుంది.

ఆయుష్షు
ఇది నమ్మసక్యంగా లేదు కదూ.. కానీ ఇది నిజం. ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల ఎక్కువకాలం జీవించడానికి సహాయపడుతుందని.. అధ్యయనాలు నిరూపించాయి. ఎలాంటి సపోర్ట్ లేకుండా పద్మాసనం వేసేవాళ్లు ఎక్కువకాలం బతుకుతారని ఈ స్టడీస్ వెల్లడించాయి.

మోకాళ్లు కీళ్ల ఆరోగ్యానికి
పద్మాసనం శరీరం మొత్తానికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. కీళ్లు ఆరోగ్యంగా, కదలికలు మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. మోకాళ్లు వంచడం, పాదాలు, పిరుదుల భాగాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచడం వల్ల.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.

నరాలకు
సుఖాసన లేదా పద్మాసనం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. అందుకే ఫ్లోర్ పై కూర్చుని తినే సంప్రదాయం మన పూర్వీకులు కనుగొన్నారు. ఇలా కూర్చుని తినడం వల్ల మైండ్ చాలా రిలాక్స్ గా ఉంటుంది. దీనివల్ల నరాలు ఉత్తేజితమవుతాయి.

రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యానికి
తినేటప్పుడు శరీరంలో వేడిగా అనిపించడం గమనించారా ? కొన్ని సందర్భాల్లో చెమట కూడా పడుతుంది. ఇది ఎందుకంటే.. తినేటప్పుడు పొట్టకు ఎనర్జీ చాలా అవసరం. డైజెషన్ కి ప్రధానంగా బ్లడ్ సర్క్యులేషన్. కాబట్టి ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అదే డైనింగ్ టేబుల్ లేదా చెయిర్ పై కూర్చుంటే.. బ్లడ్ ఫ్లో హార్ట్ కి సరిగా ఉండదు. కాబట్టి నిత్యం ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల హెల్తీ హార్ట్, స్ట్రాంగ్ మజిల్స్ పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ పద్ధతిని ఫాలో అయిపోతారు కదూ..



Click it and Unblock the Notifications