Latest Updates
-
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ..
14 రోజులు కోకనట్ వాటర్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..!!
రోజూ కోట్లాది రూపాయలు విలువజేసే పలు రకాల కంపెనీల శీతల పానీయాలు అమ్ముడవుతున్నా తరతరాలుగా కొబ్బరి నీటికిగల విశిష్టత తగ్గలేదు. నేటికీ కొబ్బరి నీళ్లంటే ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అందుకే మన దేశంలో దే
రోజూ కోట్లాది రూపాయలు విలువజేసే పలు రకాల కంపెనీల శీతల పానీయాలు అమ్ముడవుతున్నా తరతరాలుగా కొబ్బరి నీటికిగల విశిష్టత తగ్గలేదు. నేటికీ కొబ్బరి నీళ్లంటే ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అందుకే మన దేశంలో దేవుళ్లకు ఎన్ని రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించినా పూజార్హత మాత్రం కొబ్బరి కాయకే. కొబ్బరికాయ అనగానే మనకందరికీ కేరళ గుర్తుకొస్తుంది. అక్కడ చిన్న గుమ్మడికాయ సైజు కొబ్బరికాయలు ఉంటాయని, అందులో పెద్ద చెంబుడు నీళ్లుంటాయని చెప్పుకుంటారు.

కోకనట్ వాటర్ గురించి తెలియని వారుండరు. దీంట్లో అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. శరీరానికి అవసరమయ్యే అనేక న్యూట్రీషిన్స్ ఈ కోకనట్ వాటర్లో అద్భుతంగా ఉన్నాయి. శరీరం ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉండాలంటే ప్రతి రోజూ కోకనట్ వాటర్ ను తాగాల్సిందే. కోకనట్ వాటర్ ఆరోగ్యానికి వివిద రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది.
లేత కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, కాల్షియం, భాస్వరం, ఇనుము, రాగి, గంధకం, ఫ్లోరైడ్ తదితర ఖనిజాలు కూడా ఉంటాయి. కోకనట్ వాటర్ లో నేచురల్ ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉన్నాయి. పొటాషియం పుష్కలం. ఆర్టిఫిషియల్ స్పోర్ట్స్ డ్రింక్స్ తో పోల్చితే కోకనట్ వాటర్ లో కార్బోహైడ్రేట్స్ తక్కువ .
ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ గుణాలు వీటిలో అధికంగా ఉన్నాయి, ముఖ్యంగా స్టొమక్ అప్ సెట్ ను నివారిస్తుంది. పొట్టలో చల్లదనం కలిగిస్తుంది, ఇది వికారం, వాంతులు, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంతో పాటు, ఆకలిని తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, కొబ్బరి బోండాంలోనే అనేక ప్రయోజనాలున్నాయి. ఇది ఇన్ఫెక్షన్స్ కూడా నివారిస్తుంది. ఇందులో ఉండే లోరిక్ యాసిడ్ యాంటీమైక్రోబయల్ లక్షణాలను నివారిస్తుంది. కోకనట్ వాటర్ రోజూ తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను తగ్గిస్తుంది. ఇది గ్రేట్ పోస్ట్ వర్కౌట్ డ్రింక్. ఇది బౌల్ మూమెంట్ ను రెల్యుగర్ చేస్తుంది. ఇంకా బరువు తగ్గడానికి సహాయపడుతుంద. కోకనట్ వాటర్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల పొందే మరికొన్ని అమేజింగ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:
కోకనట్ వాటర్ లో ఉండే పొటాషియం కంటెంట్ బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేస్తుంది. బ్లడ్ పెజర్ ను తగ్గిస్తుంది. కోకనట్ వాటరు ను రెగ్యులర్ గా తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉండి, ఆరోగ్యంగా ఉండవచ్చు

కొలెస్ట్రాల్ మరియు ట్రై గ్లిజరైడ్ లెవల్స్ ను తగ్గిస్తుంది:
కోకనట్ వాటర్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల టోటల్ కొలెస్ట్రాల్ ట్రై గ్లిజరైడ్స్ లెవల్స్ ను మరియు ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ ను ముఖ్యంగా హార్ట్ కు సంబందించిన కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కోకనట్ వాటర్ లో ఉండే ఎలక్ట్రోలైట్స్ పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

పిహెచ్ లెవల్ ను బ్యాలెన్స్ చేస్తుంది :
వాతావరణం, ఆహారాల ద్వారా శరీరంలో చేరే టాక్సిన్స్ ను నివారించడంలో పిహెచ్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. శరీరంలో అసిడిక్ లెవల్స్ పెరగకుండా నివారిస్తుంది. జాయింట్ పెయిన్, ఎక్సెసివ్ మ్యూకస్ బిల్డప్ కాకుండా, హార్ట్ బర్న్, కెమికల్ సెన్సిటివిటి వంటి అనేక సమస్యలను దూరం చేస్తుంది

ఎనర్జీ పెంచుతుంది:
ఆర్టిఫిషియల్ ఎనర్జీ డ్రింక్స్ ను దూరం చేసి, ఫ్రెష్ కోకనట్ వాటర్ తాగడం వల్ల ఎనర్జీ లెవల్స్ అద్భుతంగా పెరుగుతాయి. ఇందులో ఎనర్జీ బూస్టర్ లక్షణాలు అద్భుతంగా ఉన్నాయి. ఇవి నేచురల్ ఫ్రక్టోజ్ షుగర్స్ రూపంలో మార్పు చెంది ఎనర్జీని అందిస్తాయి.

కిడ్నీ ఫంక్షన్ ను నివారిస్తుంది:
మూత్రపిండాలు, మూత్ర నాళాలలో ఏర్పడే రాళ్లను కరిగించే డ్యూరియాటిక్ గుణం కొబ్బరి నీటిలో ఉంది. లేత కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, కాల్షియం, భాస్వరం, ఇనుము, రాగి, గంధకం, ఫ్లోరైడ్ తదితర ఖనిజాలు కూడా ఉంటాయి.వీర్య వృద్ధికి, మూత్ర విసర్జన సులభంగా అయ్యేందుకు కొబ్బరినీరు ఎంతో ఉపయోగకరం.

గ్లూకోమా నివారిస్తుంది :
కంటికి సంబంధించిన డిజార్డర్స్ లో గ్లూకోమా ఒకటి. ఇది చాలా చిన్న బ్లడ్ వెజల్, ఆప్టిక్ నరం. కళ్ళకు ఎక్కువ ప్రెజర్ కలిగినప్పుడు కళ్ళు డ్యామేజ్ అవుతాయి. ఈ సమస్యను నివారించడంలో ఫ్రెష్ కోకనట్ వాటర్ గ్రేట్ గా సమాయపడుతుంది. అలాగే అడ్రినలిన్ బ్లాకేజ్ ను నివారిస్తుంది. కళ్ళలో ప్రెజర్ తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications
