For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆవనూనెతో అదిరిపోయే ప్రయోజనాలు.. ఆ ఒక్క ప్రయోజనం కోసమైనా కచ్చితంగా ఆవాల నూనె వాడాలి

ఆయుర్వేద ఔషదాలు మన ఇంట్లో ఎన్నో దినుసులో ఉంటాయి. వాటి తో మనం ఇంట్లో చక్కటి వైద్యం చేసుకోవచ్చు.వాటిలో ముఖ్యంగా నల్ల ఆవాలు ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఆవాలు, ఆవాల నూనె, ఆవాలు ఉపయోగాలు.

|

ఆయుర్వేద ఔషదాలు మన ఇంట్లో ఎన్నో దినుసులో ఉంటాయి. వాటి తో మనం ఇంట్లో చక్కటి వైద్యం చేసుకోవచ్చు.వాటిలో ముఖ్యంగా నల్ల ఆవాలు ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. వీటిలో చాల ఔషదా ఉన్నాయి.

పోపుల పెట్టలో తప్పనిసరిగా ఉండే ఈ ఆవాలు కొద్దిగా చేదు గా ఉంటాయి. పోపు పెట్టడానికి వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి వర్కౌట్లు చేయకపోయినా, సులభంగా బరువు తగ్గుతారు.

పోపు దినుసులుగా ఉపయోగించే ఆవాలు ఎంతో మంచిచేస్తాయి. అదే ఆవాలను నూనె పట్టించి వాడితే అద్భుతాలే జరుగుతాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు, చర్మ సంరక్షణకు ఆవనూనె బాగా ఉపయోగపడుతుంది. ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లలో ఆవనూనె ఎక్కువగా వాడతారు.

మెటబాలిజన్ని వేగవంతం చేసి

మెటబాలిజన్ని వేగవంతం చేసి

ఆవనూనె మెటబాలిజన్ని వేగవంతం చేసి, ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయడుతుంది. దాంతో బరువు తగ్గడం చాల సులువు. శరీరంలో ఫ్యాట్ కణాలు నిల్వ చేరకుండా చేస్తుంది. పసుపు ఆవాల నూనెను వంటలకు ఉపయోగించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఆవాలలో బికాంప్లెక్స్ విటమిన్స్ అయిన నియాసిన్, రిబోఫ్లోవిన్లు శరీరం జీవక్రియలను వేగవంతం చేయడానికి సహాయపడుతాయి.

ఆస్త్మా నివారణ కోసం

ఆస్త్మా నివారణ కోసం

ఆవాల నూనెను ఆస్త్మా నివారణ కోసం ఉపయోగిస్తారు. సైనసైటిస్ తో బాధపడే వారు ఆవనూనెను ఉపయోగించడం వల్ల ఆస్త్మా నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆవనూనెను ఉదరం, చాతీకి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల శ్వాసనాళంకు గాలిబాగా ఆడుతుంది, నాజల్ ఫ్రీ అవుతుంది. రెగ్యులర్ గా ఆవనూనె తినడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.

దగ్గు, జలుబు తగ్గాలంటే..

దగ్గు, జలుబు తగ్గాలంటే..

దగ్గు, జలుబు తగ్గించడానికి ఆవనూనె బాగాసహాయపడుతుంది. కొద్దిగా ఆవనూనెను వేడి చేసి, అరచేతులు, అరికాళ్ళకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల శరీరంలో వేడి కలిగి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ నూనెను చాతీకి అప్లై చేయడం లేదా వాసన చూడటం, ఆవిరి పట్టడం వల్ల మీ రెస్పిరేటరీ ట్రాక్ట్ క్లియర్ అవుతుంది.

స్థూలకాయం దరి చేరదు

స్థూలకాయం దరి చేరదు

వంటల్లో ఆవనూనె వాడకం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ నూనె వాడకం వల్ల బ్యాడ్‌ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్‌ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే ట్రైగ్లిసరైడ్స్‌, రక్తంలోని కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి. ఫలితంగా స్థూలకాయం దరి చేరదు.

మూత్రపిండాల సమస్యలకు దూరంగా..

మూత్రపిండాల సమస్యలకు దూరంగా..

ఆవనూనె వాడకం వల్ల మూత్రపిండాల సమస్యలకి దూరంగా ఉండొచ్చు. ఈ నూనె వాడకం వల్ల హైపర్‌ థైరాయిడ్‌ రాకుండా ఉంటుంది. ఆవనూనెను ఆహారంతో తీసుకుంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు. జీర్ణవ్యవస్థతో సంబంధం ఉన్న చిన్నపేగు, జీర్ణాశయం, పెద్ద పేగుల్లో బ్యాక్టీరియాలను హరిస్తుంది.

వంటకాల్లో ఇలా వాడాలి

వంటకాల్లో ఇలా వాడాలి

ఈ నూనెను నేరుగా కాకుండా పొగలొచ్చేవరకూ వేడిచేసి చల్లార్చి వాడాలి. వేడి చేయటం ఇష్టంలేని వాళ్లు ఆవనూనెను నెయ్యి, వేరుశనగ నూనెలతో కలిపి కూడా వాడొచ్చు. కూరలు, పకోడీలాంటి వేపుళ్లు, పచ్చళ్ల తయారీకి ఉపయోగించొచ్చు.

సౌందర్య విషయాల్లోనూ..

సౌందర్య విషయాల్లోనూ..

ఆవనూనె ఆరోగ్యపరంగానే కాదు పలు సౌందర్య విషయాలకు కూడా ఉపయోగపడుతుంది. మేకప్ రిమూవర్‌గా కూడా పనిచేస్తుంది. ట్యాన్ అరికట్టేందుకు ఈ ఆయిల్‌లో నిమ్మరసం, శనగపిండితో కలిపి పేస్ట్ చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.డ్రై, డ్యామెజ్డ్ హెయిర్ సమస్యల నుంచే కాదు..కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలను తొలిగించడానికి మస్టర్డ్ ఆయిల్‌ను రాసుకుంటే మంచిది.

న్యూట్రిషనల్‌ ఫ్యాక్ట్స్‌

న్యూట్రిషనల్‌ ఫ్యాక్ట్స్‌

ఆవనూనె - 100గ్రా, కెలోరీలు - 884, మొత్తం కొవ్వు - 153 గ్రా, దీన్లో శాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 12గ్రా, పాలీ శాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 21గ్రా, మోనో శాచురేటెడ్‌ ఫ్యాట్‌ -59గ్రా .

ఆవాల నుంచి 2 నూనెలు

ఆవాల నుంచి 2 నూనెలు

ఆవాలను ఒత్తి వాటి నుంచి కొవ్వుతో కూడుకున్న ‘వెజిటబుల్‌ ఆయిల్‌', నీళ్లతో కలిపి నూరి ‘ఎసెన్షియల్‌ ఆయిల్‌'- ఇలా రెండు రకాల నూనెలు తయారు చేస్తారు. మొదటిది వంటల్లోకి, రెండవది సౌందర్య సాధనాల్లోకి ఉపయోగిస్తారు. వెజిటబుల్‌ ఆయిల్‌ కాస్త ఘాటుగా ఉంటుంది. అందుకే అందరూ ఈ నూనెను వంటల్లో వాడటానికి ఇష్టపడరు. అయితే దీన్లోని ఒమేగాఆల్ఫా3, ఒమేగాఆల్ఫా6 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌ ఇ, యాంటిఆక్సిడెంట్స్‌ సమృద్ధిగా ఉంటాయి.

పీహెచ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తూ

పీహెచ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తూ

చర్మంపై పీహెచ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తూ నూనెను నియంత్రించే సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ నూనె. దీంట్లో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి దూదితో యాక్నే ఉన్న చోట ఐప్లె చేయాలి. తద్వారా యాక్నే, మచ్చల నుంచి రక్షణ పొందవచ్చు.

టోనర్‌లా ఉపయోగించాలి

టోనర్‌లా ఉపయోగించాలి

ఒక స్ప్రే బాటిల్‌లో మస్టర్డ్ ఆయిల్, రోజ్‌వాటర్‌ని తీసుకోవాలి. వీటిని బాగా షేక్ చేసి ఫేస్ పై టోనర్‌లా ఉపయోగించాలి. మాయిశ్చరైజర్‌ని ఐప్లె చేసుకునే ముందు ఈ స్ప్రేని వాడాలి. దీనిని ప్రతిరోజూ వాడితే మంచి ఫలితం ఉంటుంది.

పెదవులకు అప్లై

పెదవులకు అప్లై

నిద్ర పోయే ముందు ప్రతిరోజూ మస్టర్డ్ ఆయిల్‌ను పెదవులకు అప్లై చేసుకోవాలి. వీలైతే బీట్‌రూట్‌ని ఎండబెట్టి పొడి చేసి ఈ నూనెలో కలిపి పెదవులకు రాస్తే ఎర్రని పెదవులను సొంతం చేసుకోవచ్చు.

పొట్ట తగ్గాలంటే

పొట్ట తగ్గాలంటే

పొట్ట తగ్గించాలంటే కొవ్వును కరిగించే పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ విధంగా ఇచ్చిన సలహాల్లో ఆవనూనె ఇప్పుడు ప్రత్యేకత సంతరించుకుంది. వంటల్లో ఎలాగో ఏదో ఒక నూనెను వాడాలి. ఆ నూనె ద్వారానే పొట్ట పెరుగుతోంది. అదే ఆవనూనె వాడడం ద్వారా రివర్స్ లో కొవ్వును కరిగించుకోవచ్చని పరిశోధనాత్మకంగా రుజువైంది.

నెలరోజుల్లోనే తగ్గుతుంది

నెలరోజుల్లోనే తగ్గుతుంది

ఆవ నూనెను వంటల్లో క్రమం తప్పక వాడితే కేవలం నెల రోజుల్లోనే బాన పొట్టను తగ్గించుకోవచ్చు. పొట్ట చుట్టూ పేరుకుపోయి ఉండే కొవ్వు వల్ల హృద్రోగాలు, మధుమేహం బారినపడే ప్రమాదం ఎక్కువ. ఆవ నూనె లో ఉండే మోనోఅన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు ఈ బెల్లీని తగ్గించేందుకు ఉపయోగపడుతాయని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

కొవ్వులను కరిగించడంలో..

కొవ్వులను కరిగించడంలో..

సాధారణం గా శరీరంలో ఒక నిర్దిష్టమైన భాగంలో కొవ్వును/బరువును తగ్గించడం సాధ్యపడదు. కానీ, ఆవ నూనె లో ఉండే మోనోఅన్‌శాచ్యురేటెడ్‌ యాసిడ్స్‌ మాత్రం ప్రత్యేకించి పొట్ట భాగంలోనే ఉండే కొవ్వులను కరిగించడంలో తోడ్పడుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ప్రమాదం కూడా ఉంది

ప్రమాదం కూడా ఉంది

ఇక్కడ మరో విషయం ఏమిటంటే జన్యు మార్పిడి చేసిన ఆవాల నుంచి తీసిన నూనెను వినియోగిస్తే దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉందన్నారు. సాధారణ ఆవాలను వినియోగించి అధిక బరువు సమస్య నుంచి బయటపడాలని సూచిస్తున్నారు.

ఈ ఒక్క కారణం

ఈ ఒక్క కారణం

మొత్తానికి బాన పొట్టను కొద్ది రోజుల్లేనే తగ్గించే శక్తి ఉన్న ఆవాల నూనె పొట్ట ఉన్న ప్రతి ఒక్కరూ వాడడం మంచిది. ఈ ఒక్క కారణం కోసమైనా మీ ఇంట్లో ఇప్పటి నుంచి ఆవాల నూనెను వాడండి.

English summary

20 fantastic benefits of mustard oil for your health skin and hair

20 fantastic benefits of mustard oil for your health skin and hair
Story first published:Friday, May 18, 2018, 12:18 [IST]
Desktop Bottom Promotion