Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
బట్టతల నాన్న,తాత వల్ల వస్తుందా? అమ్మ వల్లా? అసలు విషయం తెలిస్తే అవునా,నిజమా అనాల్సిందే!
ప్రస్తుతం మనదేశంలో చాలామంది యువత బాధపడే అతిపెద్ద సమస్య జుట్టు ఊడిపోవడం. చిన్నవయస్సులోనే బట్టతల వచ్చేస్తుండంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు..అయితే ఎన్ని చేసినా చాలామందికి అసలు ఎలాంటి ఫలితం ఉండట్లేదు.

దీంతో విసిగిపోయి మా నాన్నకు బట్టతల ఉంది కదా, బహుశా ఈ జెనెటిక్స్ వల్లే నాకూ వస్తోంది.. ఇదంతా నాన్న వల్లే వచ్చింది అని తండ్రిని నిందిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అనుకునే మాట ఇదే. అయితే అందరూ నమ్మే ఈ మాట నూటికి నూరు శాతం నిజం కాదని వైద్య శాస్త్రం చెబుతోంది. అవును మీ బట్టతలకు మీ నాన్న మాత్రమే కారణం కాదు. దీని వెనుక మీరు ఊహించని ఒక పెద్ద సైన్స్ దాగి ఉంది.
అసలు సీక్రెట్ ఎక్కడుందంటే..
మగవారిలో వచ్చే బట్టతలను మేల్ ప్యాటర్న్ బాల్డ్ నెస్ అంటారు. దీనికి ప్రధాన కారణమయ్యే ఆండ్రోజెన్ రిసెప్టార్ (AR) అనే జన్యువులు X క్రోమోజోమ్‌లో ఉంటాయి. జీవశాస్త్రం ప్రకారం.. మగపిల్లల పుట్టుకలో తండ్రి నుంచి Y క్రోమోజోమ్, తల్లి నుంచి X క్రోమోజోమ్ వస్తుంది. అంటే, మీ జుట్టు భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన X క్రోమోజోమ్ మీ అమ్మగారి నుంచే మీకు వస్తుందన్నమాట.
మీ అమ్మగారి తరపున, అంటే మీ తాతయ్యకు (అమ్మ వాళ్ల నాన్న) లేదా మీ మేనమామలకు బట్టతల ఉంటే, మీకు కూడా బట్టతల వచ్చే అవకాశం ఏకంగా 70 శాతం ఎక్కువగా ఉంటుందట. ఒకవేళ దురదృష్టవశాత్తూ మీ నాన్నగారికి బట్టతల ఉండి, అటు మీ అమ్మగారి కుటుంబంలో (మేనమామలు లేదా తాతయ్య) కూడా బట్టతల ఉంటే.. ఇక మీకు బట్టతల వచ్చే ఛాన్స్ 90 శాతానికి పైనే ఉంటుందని తెలంగాణలోని ఖమ్మంకు చెందిన డాక్టర్ భగత్ సింగ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో తెలిపారు.
జీన్స్ మాత్రమే కాదు..మీ అలవాట్లు కూడా
నా కుటుంబంలో ఎవరికీ బట్టతల లేదు కదా నాకెందుకు వస్తుందిలే అని నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మన జీవనశైలి కూడా జుట్టు రాలడాన్ని తీవ్రం చేస్తోందని డాక్టర్ భగత్ సింగ్ తెలిపారు.
ముఖ్యంగా విపరీతమైన మానసిక ఒత్తిడి వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. ఇక ధూమపానం అలవాటు ఉన్నవారిలో రక్తనాళాలు కుంచించుకుపోయి, తల మాడుకు సరిపడా ఆక్సిజన్, పోషకాలు అందక జుట్టు త్వరగా రాలిపోతుంది. జన్యుపరంగా బట్టతల వచ్చే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ చెడు అలవాట్ల వల్ల మీ జుట్టు నిర్ణీత వయసు కంటే ముందే రాలిపోయి బట్టతల బారిన పడతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
