త్వరగా సంతానం కలగాలన్నా వీర్యం వృద్ధి చెంది శృంగార సామర్థ్యం పెరగాలన్నా ఇలానే చేయాలి

Written By:
Subscribe to Boldsky

తేనె, దాల్చిన చెక్క పొడిలను ఆయుర్వేద వైద్యంలో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. అనేక రకాల వ్యాధులను తగ్గించేందుకు ఈ రెండింటి మిశ్రమం పనికొస్తుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు, శ్వాస కోశ సమస్యలు, నొప్పులు మాయమవుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మూత్రాశయ సమస్యలు పోతాయి. అయితే ఈ రెండింటి మిశ్రమాన్ని ఎలా ఉపయోగిస్తే ఆయా అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌రువు తగ్గేందుకు

బ‌రువు తగ్గేందుకు

అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో తేనె, దాల్చిన చెక్క పొడిల మిశ్ర‌మం అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 టీస్పూన్ల తేనెల‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఒక‌సారి, ఉద‌యం అల్పాహారం చేసే ముందు మ‌రోసారి, రాత్రి నిద్రించే ముందు మ‌రోసారి మొత్తం 3 సార్లు తాగితే శ‌రీరంలో ఉన్న కొవ్వు అంతా క‌రిగిపోతుంది. చాలా త్వ‌రగా బ‌రువు త‌గ్గుతారు.

రోగ నిరోధక శక్తి పెరిగేందుకు

రోగ నిరోధక శక్తి పెరిగేందుకు

నిత్యం ఉదయాన్నే పరగడుపున 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి మిశ్రమంగా చేసుకుని తింటూ ఉంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లతో బాధపడేవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ మిశ్రమాన్ని నిత్యం తీసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

ఆర్థరైటిస్ నొప్పులు

ఆర్థరైటిస్ నొప్పులు

ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలను తీసుకుని 60 ఎంఎల్ గోరు వెచ్చని నీటిలో కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని నొప్పులు ఉన్న చోట రాయాలి. తరచూ ఇలా చేస్తే ఆర్థరైటిస్ నొప్పులు తగ్గిపోతాయి. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 టీస్పూన్ల తేనె బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజూ తాగుతూ ఉన్న కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

కొలెస్ట్రాల్ తగ్గించడానికి

కొలెస్ట్రాల్ తగ్గించడానికి

శరీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ తేనె, దాల్చిన చెక్క పొడి మిశ్రమం బాగా పనిచేస్తుంది. 3 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల తేనెను టీ డికాషన్‌లో కలిపి తాగుతూ ఉంటే కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

ఇన్‌ఫెర్టిలిటీ

ఇన్‌ఫెర్టిలిటీ

2 టీస్పూన్ల తేనె, 2 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిని కలిపి మిశ్రమంగా చేసి తింటూ ఉంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అలాగే మహిళలు తీసుకుంటే వారిలో గర్భాశయంలో ఉండే సమస్యలు పోతాయి. సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. దీంతోపాటు మహిళల్లో సాధారణంగా వచ్చే పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) అనే వ్యాధి కూడా తగ్గుతుంది.

జుట్టు సమస్యలకు

జుట్టు సమస్యలకు

తేనె, దాల్చిన చెక్క పొడిలను సమాన భాగాల్లో తీసుకుని కొంత ఆలివ్ ఆయిల్‌లో రెండింటినీ కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని తలకు పట్టించాలి. 15 నిమిషాలు ఆగాక స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు ఉండవు. చుండ్రు తగ్గుతుంది. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.

మూత్రాశయ సమస్యలు

మూత్రాశయ సమస్యలు

2 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడి, 1 టీస్పూన్ తేనెను కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగేయాలి. ఇలా రోజూ తీసుకుంటే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉండవు.

చర్మ సమస్యలు

చర్మ సమస్యలు

2 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడి, 3 టేబుల్ స్పూన్ల తేనెలను కలిపి పేస్ట్‌లా చేసి దీన్ని సమస్య ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. కొంత సేపు ఆగాక వేడి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల తామర, గజ్జి, ఇతర చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

దగ్గు, జలుబు

దగ్గు, జలుబు

2 టీస్పూన్ల తేనె, 2 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిలను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ముక్కు రంధ్రాలు క్లియర్ అవుతాయి. జలుబు, దగ్గు తగ్గుతాయి. ఈ మిశ్రమంలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు శ్వాస కోశ సమస్యలకు పవర్‌ఫుల్ మెడిసిన్‌లా పనిచేస్తాయి. దీంతో ఆయా సమస్యలు త్వరగా తగ్గుముఖం పడతాయి.

మొటిమలు

మొటిమలు

ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 3 టేబుల్ స్పూన్ల తేనె తీసుకుని బాగా కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని రాత్రి పూట నిద్రించేముందు మొటిమలపై రాయాలి. ఉదయాన్నే ముఖాన్ని కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.

కెలోరీలు తగ్గాలంటే

కెలోరీలు తగ్గాలంటే

ఇక కెలోరీలు తగ్గాలంటే దాల్చిన చెక్కను వాడాలి. దాల్చిన చెక్కను వాడటం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. తద్వారా శరీర బరువు కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే రోజు తినే పెరుగు లేదా తృణధాన్యాల్లో పావు స్పూన్ దాల్చినచెక్క పొడిని వేస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతారు.

టైప్ 2 మధుమేహం

టైప్ 2 మధుమేహం

టైప్ 2 మధుమేహంతో బాధపడేవారిలో షుగర్ లెవల్ని నియంత్రించడంలో దాల్చిన చెక్క సమర్థవంతంగా పనిచేస్తుంది. కొంతమంది రోజూ ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను నములుతుంటారు. ఐతే షుగర్ నిలువలు బాగా వున్నప్పుడు ఆ మోతాదు చాలదు.

షుగర్ నిల్వలు

షుగర్ నిల్వలు

దాల్చిన చెక్కను పొడి చేసి ఒక డబ్బాలో భద్రపరుచుకుని రోజూ ఉదయాన్నే బాగా మరిగించిన నీటిలో ఓ అరచెంచా పొడిని వేయాలి. అది వెంటనే ఎర్రగా మారిపోతుంది. ఈ చెక్క ఘాటుతో పాటు తీపిగా కూడా వుంటుంది. కాబట్టి చెక్కర లేదా బెల్లం కానీ వేయాల్సిన పనిలేదు. రోజూ ఈ ద్రావణాన్ని తాగుతూ వుంటే షుగర్ నిల్వలు పూర్తి నియంత్రణలో వుంటాయి. క్రమంతప్పకుండా సేవిస్తే మున్ముందు సమస్యలు తలెత్తే ప్రమాదం వుండదు.

క్యాన్స‌ర్లు రాకుండా

క్యాన్స‌ర్లు రాకుండా

దాల్చిన‌చెక్క‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. పాలిఫినాల్స్ అన‌బ‌డే ప్ర‌త్యేక‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. ఇన్ ఫెక్ష‌న్ల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు దాల్చిన చెక్క‌లో ఉన్నాయి. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగ‌వుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

English summary

amazing health benefits of cinnamon

amazing health benefits of cinnamon
Story first published: Friday, May 4, 2018, 9:00 [IST]