Latest Updates
-
గురు పుష్య యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకమే మారిపోతుందా? అదృష్టం మీ వెంటే! -
మంగళవారం పనులు మొదలుపెడుతున్నారా? ఈరోజు శుభ ముహూర్తాలు, రాహుకాలం తెలుసుకోకపోతే పనుల్లో ఆటంకాలు తప్పవా? -
రేవతిలో శని, రోహిణిలో బుధుడు: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. ఎవరికి ధన లాభం? - మంగళవారం, 19 మే 2026 -
నీట్ రద్దుతో మొదలైన గొడవలు.. మీ రిలేషన్షిప్ను కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
పెళ్లికి ముందే ఆస్తుల ఒప్పందం… ఇది విడాకుల కోసమా లేక బంధం కోసం భద్రతా? అసలు నిజం ఇదే! -
మే 18: గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ రాశి ఉందేమో చూడండి! -
రాజయోగం, ధన యోగం కలయిక.. ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మైసూర్ మటన్ పులావ్..టేస్ట్ కి సలాం కొట్టాల్సిందే!..ఈజీగా చేసుకోండిలా.. -
ఈరోజు సోమవారం.. పనులు మొదలుపెట్టే ముందు ఈ రాహుకాలం, శుభ ముహూర్తాలు చూసుకున్నారా?
మీ ఒంట్లో ఈ 7 లక్షణాలు కనిపిస్తే.. మీరు కరెక్ట్ గా నీళ్లు తాగుతున్నట్టే లెక్క!
మన శరీరంలో 60 శాతానికి పైగా నీరే ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఉరుకులు పరుగుల జీవితంలో, ఏసీ గదుల్లో కూర్చొని పనిచేసే బిజీలో పడిపోయి చాలామంది తగినన్ని నీళ్లు తాగడమే మర్చిపోతున్నారు. అయితే మన శరీరం హైడ్రేటెడ్ గా (తగినన్ని నీళ్లతో) ఉన్నప్పుడు మన ఆరోగ్య స్థితి ఎంత అద్భుతంగా మారుతుందో వివరిస్తూ.. ఖమ్మం పట్టణానికి చెందిన ప్రముఖ సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్ గౌతమ్ యలముడి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. మనం రోజూ తగినన్ని నీళ్లు తాగినప్పుడు మన శరీరంలో కనిపించే 7 స్పష్టమైన, అద్భుతమైన మార్పులను ఆయన ఈ వీడియోలో వివరించారు. అవేంటో ఇక్కడ చూడండి.

మూత్రం లేత పసుపు రంగులో ఉండటం
మన శరీరానికి తగినన్ని నీళ్లు అందుతున్నాయా లేదా అని చెప్పడానికి మూత్రం రంగు ఒక అద్దం లాంటిది. మీరు నీళ్లు బాగా తాగినప్పుడు, శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. అప్పుడు మూత్రం ముదురు రంగులో కాకుండా, చాలా లేత పసుపు రంగులో లేదా నీళ్లలాగా పారదర్శకంగా వస్తుంది. ఇది మీరు పూర్తి ఆరోగ్యంగా, హైడ్రేటెడ్ గా ఉన్నారని చెప్పడానికి తొలి సంకేతం.
రోజంతా నోరు తడిగా ఉండటం
నీళ్లు సరిగ్గా తాగని వారిలో తరచుగా నోరు పిడచకట్టుకుపోవడం, గొంతు ఆరిపోవడం జరుగుతుంది. కానీ తగినన్ని నీళ్లు తాగితే, లాలాజల గ్రంథులు చురుగ్గా పనిచేసి రోజంతా నోరు తడిగా, తాజాగా ఉంటుంది. దీనివల్ల పదే పదే విపరీతమైన దాహం వేయదు, అలాగే నోటి దుర్వాసన సమస్య కూడా దరిచేరదు.
మలబద్ధకం మాయం - సాఫీగా జీర్ణక్రియ
మనం తీసుకున్న ఆహారం సాఫీగా జీర్ణం కావాలన్నా, వ్యర్థాలు పేగుల గుండా సులభంగా కదలాలన్నా నీరు మృదువైన కందెనలా పనిచేస్తుంది. నీళ్లు బాగా తాగడం వల్ల మలబద్ధకం సమస్యే ఉండదు. ప్రతిరోజూ ఉదయాన్నే మోషన్ ఫ్రీగా అవుతుంది. పొట్ట తేలికగా, ఆరోగ్యంగా ఉంటుంది.
నిగారింపును సంతరించుకునే చర్మం
ఖరీదైన క్రీములు వాడితే రాని గ్లో, ఉచితంగా దొరికే నీళ్లు తాగితే వస్తుంది. అవును.. శరీరంలో నీటి శాతం సరిగ్గా ఉంటే చర్మం పొడిబారదు. చర్మ కణాలకు తగినంత తేమ అంది, ముఖం మంచి గ్లో తో, కాంతివంతంగా మెరిసిపోతుంది. ముడతలు కూడా త్వరగా రావు.
తరచుగా వేధించే తలనొప్పికి చెక్
చాలామందికి కారణం లేకుండానే తరచుగా తలనొప్పి వస్తుంటుంది. దానికి ప్రధాన కారణం 'డీహైడ్రేషన్' (నీటి కొరత). మీరు రోజుకు సరిపడా నీళ్లు తాగడం మొదలుపెడితే, మెదడుకు ఆక్సిజన్ మరియు రక్తప్రసరణ బాగా జరిగి ఈ తరచుగా వచ్చే తలనొప్పులు మాయం అవుతాయి.
చెమట దుర్వాసన రాకపోవడం
చెమట పట్టడం సహజం. కానీ కొందరిలో అది విపరీతమైన దుర్వాసన వస్తుంది. మీరు నీళ్లు బాగా తాగినప్పుడు, శరీరంలో పేరుకుపోయిన మలినాలు (Toxins) పలుచబడి చెమట రూపంలో బయటకు వస్తాయి. దీనివల్ల మీ చెమటలో ఎటువంటి చెడు వాసన ఉండదు. ఇది మీకు నలుగురిలో మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
అలసట మాయం - అద్భుతమైన ఏకాగ్రత
శరీరంలో నీటి శాతం తగ్గితే ముందుగా నీరసం ఆవహిస్తుంది. మెదడు పనితీరు మందగిస్తుంది. అదే నీళ్లు బాగా తాగితే.. రోజంతా యాక్టివ్ గా ఉంటారు. ఏ పని చేసినా త్వరగా అలసిపోరు. అంతేకాకుండా మెదడు చురుగ్గా పనిచేయడం వల్ల మీరు చేసే పని మీద, చదువు మీద మీ 'కాన్సంట్రేషన్' (ఏకాగ్రత) ఎన్నో రెట్లు పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications