world sleep day 2020 : వేకువజామున నిద్రలేవడం వల్ల 7 అమేజింగ్ బెనిఫిట్స్

వేకువజామున నిద్రలేవడం వల్ల 7 అమేజింగ్ బెనిఫిట్స్

7 Benefits Of Waking Up Early In The Morning || 7 అమేజింగ్ బెనిఫిట్స్ || Boldsky Telugu

ఎర్లీ మార్నింగ్ (వేకువ జామున) నిద్రలేవాలంటే చిన్నపిల్లలు టేబుల్స్ చెప్పినంత కష్టం. మన అందరం వేకువజామునే లేవడానికి ఇష్టపడతాము. కానీ మనలో కొంత మంది మాత్రం ఈ రోజు రేపు అని వాయిదాలు వేస్తుంటారు. నిద్రించే పక్క సౌకర్యంగా ఉండి, మంచి నిద్ర పొందితే తప్పకుండా టైమ్ కు లేవగలుగుతారు, అయితే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కొన్ని రకాల మందులు మరియు దీర్ఘకాలిక నొప్పులు వంటి విషయాల వల్ల ఎర్లీగా లేవడానికి ఇబ్బంది పడుతారు. దాంతో ఆ రోజంతా కూడా ఇబ్బంది కరంగా ఉంటుంది.

ఇటీవల జరిపిన కొన్ని పరిశోధన ద్వారా ప్రొడక్టివిటి మరియు నిద్ర విధానాల మధ్య సంబంధాన్ని కనుగొన్నారు . ఎర్లీగా నిద్రలేచే వారు మిగిలిన వారి కంటే చురుకుగా పనిచేస్తారని తేల్చారు. వాస్తవానికి , వేకువ జామునే నిద్రలేవడం వల్ల ఈ బిజీ ప్రపంచంలో మరో గంట అదనపు సమయాన్ని గడిపేలా చేస్తుంది. ఎక్కువ సమయం ఎక్కువ ప్రొడక్టివిటిని సూచిస్తుంది. అలా కాకుండా , వేకువ జామున నిద్రలేచేవారికి రాత్రి త్వరగా పడుకునే అలవాటు కూడా ఉంటుంది.ఇది వంద శాతం ఆరోగ్యానికి మంచిది.

నిద్ర మైండు మరియు చర్మం శరీరంలోని అన్ని రకాల కణజాలన్నింటినీ మరమ్మత్తు చేస్తుంది. నిద్రలేమి మీ ప్రొడక్టివిటినీ, ఆరోగ్యాన్ని మరియు చర్మాన్ని కూడా పాడు చేస్తుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, వేకువజామున్నే మనం ఎందుకు నిద్రలేవాలి అన్నదానికి కారణాల గురించి తెలుసుకుందాం..

7 Benefits Of Waking Up Early In The Morning

వేకువ జామున నిద్ర లేవడం వల్ల ప్రయోజనాలు :
వేకువ జామున నిద్రలేవడం వల్ల పొందే ఫిజికల్ బెనిఫిట్స్

హెల్తీ డైట్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.
ఉదయాన్నే తినే అల్పాహారం రోజంతటికీ అతి ముఖ్యమైన ఆహారం . రోజంతా చురుకుగా పనిచేయడానికి కావల్సినంత సామర్థ్యాన్ని పెంచుతుంది. వేకువజామునే నిద్రలేవడం వల్ల సహజంగానే ఉదయం అల్పాహారం తీసుకోవడం అలవాటు చేస్తుంది. అల్పాహారం తీసుకోకపోతే అహారపు అలవాట్లు తక్కువగా ఉంటాయి. దాంతో జంక్ ఫుడ్ ఎక్కువగా తినడానికి కోరిక పెరుగుతుంది.

వ్యాయామానికి ఎక్కువ సమయం
చాలా మంది లేటుగా నిద్రలేవడం వల్ల రోజు వ్యాయామం చేయడానికి సమయం లేదని చెబుతుంటారు. అదే రోజూ వేకువజామునే నిద్రలేవడం వల్ల తగినంత సమయం ఉండటం వల్ల వ్యాయామానికి ఆ సమయం కేటాయించవచ్చు. ఇంకా సాయంత్ర పని ముగించుకుని కూడా వ్యాయామం చేయడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.

చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది
వ్యాయామం మరియు అల్పాహారం తీసుకునే అలవాట్లు మాదిరగానే , వేకువ జామన లేవడం వల్ల మీ స్కిన్ క్వాలిటీని పెంచుతుంది. మీకే వండర్ అవుతుంది. ఈ అలవాట్లు డైలీలైఫ్ లో చేరడం వల్ల, స్కిన్ హైడ్రేషన్, ఆక్సిజనేషన్ మరియు రక్తప్రసరణ వల్ల మీ చర్మ ఆరోగ్యం న్యాచురల్ గా మెరుగుపడుతుంది.

వేకువ జామున నిద్ర లేవడం వల్ల మానసిక ప్రయోజనాలు
ప్రొడక్టివిటీ మెరుగుపడుతుంది.
వేకువ జామున చాలా వరకు ప్రొడక్టివిటి సమయం బాగుంటుంది. వేకువజామునే నిద్రలేవడం వల్ల ఎటువంటి అవాంతరాలు లేకుండా ముఖ్యమైన పనులపై ఏకాగ్రతను ఉంచుతారు. దాంతో పాటు మెదడు ఉదయం సమయంలో అత్యంత వాంఛనీయ స్థాయిలో ఉంటుంది. మంచి నిర్ణయం తీసుకోవటానికి దోహదం చేస్తుంది. అలాగే పరిశోధనల ప్రకారం వేకువజామున నిద్రలేచే వారు మంచి ప్లానర్లు.

ఏకాగ్రతను ప్రోత్సహిస్తుంది.
వేకువజామున నిద్ర లేవడం వల్ల ఏకాగ్రత స్థాయిలు మెరుగుపరచడుతాయి. ఎటువంటి అవాంతరాలుండవు. మెదడు మంచి విషయాల పట్ల ఏకాగ్రతతో పనిచేయడాన్ని ప్రోత్సహిస్తుంది. పనులు ప్రభావంతంగా పూర్తి చేయగలరు.

వేకువ జామున నిద్రలేవడం వల్ల భావోద్వేగపు ప్రయోజనాలు
మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది
రొటీన్ గా మీ ఈశరీరాన్ని నిద్రకు సిద్దం చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. దాంతో త్వరగా నిద్రపోతారు అలాగే త్వరగా నిద్రలేస్తారు. ఇలా రొటీన్ గా జరగడం వల్ల శరీరానికి ఇంటర్నల్ క్లాక్ లా చాలా ప్రయోజనం. దాంతో మంచి నిద్ర పొందుతారు. మంచి రెస్ట్ పొందిన భావన కలుగుతుంది.

మంచి సమయం గడపడానికి అనుమతిస్తుంది
వేకువజామున చాలా ప్రశాంతంగా, నిశబ్దంగా ఉండటం వల్ల మెడిటేషన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన మనస్సు మరింత చురుకుగా పనిచేస్తుంది. నిశ్శబ్దం మరియు ప్రశాంతత వల్ల పగటి పూట నిద్ర రాకుండా ఉంటుంది . మైండ్ తో పాటు బాడీని కూడా ప్రశాంతంగా ఉంచుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion