Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
సంక్రాంతికి బెల్లం ఎక్కువగా ఎందుకు వాడుతారో తెలుసా, బోలెడు ప్రయోజనాలున్నాయి..
సంక్రాంతికి బెల్లం ఎక్కువగా ఎందుకు వాడుతారో తెలుసా, బోలెడు ప్రయోజనాలున్నాయి..
ఈ సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లోనూ రకరకా పిండివంటలు, వివిధ రకా స్వీట్స్ తయారుచేస్తారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగకు బెల్లంను ఎక్కువగా ఉపయోగిస్తారు. బెల్లంతో పొంగలి తప్పనిసరిగా చేస్తారు. అలాగే బెల్లం, నువ్వులు, చెరకు, శెనగపప్పు, కొబ్బరి ముక్కల మిశ్రమాన్ని అందరికీ పంచిపెట్టడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. ఈ పండుగ సందర్భంగా తయారుచేసే వంటలకు వీలైనంత వరకు తాజా బెల్లం వాడితే పండగ వంటల్లో రుచి పెరగడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

సంక్రాంతి చలికాలంలో వస్తుంది. కాబట్టి మీ కాఫీ లేదా టీలో పంచదారకు బదులుగా కొంచెం బెల్లం వేసి త్రాగండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని మీరు వినే ఉంటారు. అవును వందకు 100% నిజం. ఎందుకంటే చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.
అయితే ఈ రోజుల్లో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల బెల్లం మన రోజువారీ ఉపయోగం యొక్క పరిశుభ్రత గురించి మనం వేరే చెప్పనవసరం లేదు! అందుకనీ, కేవలం ఆకర్షణీయంగా కనబడే ప్యాకెట్‌లో బెల్లం కొని మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా, మనం రోజువారీ ఆహారంలో వీలైనంత వరకు స్వచ్చమైన, తాజా మరియు సేద్రియ బెల్లం ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. బెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి నేటి కథనంలో చూద్దాం...

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది
సేంద్రియ బెల్లంలో జింక్ మరియు సెలీనియం పుష్కలంగా ఉంటాయి. కావున, మన ఆహారంలో మితంగా సేంద్రియ బెల్లం చేర్చడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఈ చలికాలంలో మనల్ని అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.

జీర్ణవ్యవస్థకు చాలా మంచిది
మనం తినే రోజవారి ఆహారంలో బెల్లంను మితంగా చేర్చడం వల్ల శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేసి కడుపులో ఎసిటిక్ యాసిడ్‌గా మారుస్తుంది. ఇది అజీర్ణం మరియు గ్యాస్ట్రిక్ సమస్యను దూరం చేయడమే కాకుండా మలబద్ధకం సమస్యను కూడా పరిష్కరిస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేయడంలో బెల్లం
మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే అందుకు శరీరంలో ప్రవహించే రక్తం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో ప్రవహించే రక్తం ఆరోగ్యంగా ఉండాలి. అందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఒకటి సేంద్రియ బెల్లం.
స్వచ్చమైన బెల్లంలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో రక్త ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడమే కాకుండా, ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత సమస్యను కూడా క్రమంగా దూరం చేస్తుంది.

చర్మ, జుట్టు ఆరోగ్యానికి
సేంద్రియ బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను, వాపును కలిగించే ఫ్రీ రాడికల్స్ నుండి నిరోధిస్తాయి. దీని వల్ల చర్మ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, జుట్టు సమస్యలు నివారంచబడుతాయి, శరీరంలోని స్ట్రాంగ్ గా ఉంటాయి.

వెన్నునొప్పి సమస్య ఉన్నవారికి
ఆఫీస్ ల్లో పనిచేసే వారికి మాత్రమే కాదు, సాధారణ ప్రజలకు కూడా వెన్ను నొప్పి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఉన్న వారు సరిగ్గా కూర్చోవడంకానీ, నిన్చోవడం కానీ చేయాలేరు. అందులో మీరు కూడా ఒకరైతే ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర మరియు చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలిపి త్రాగితే మీరు వెన్ను నొప్పి సమస్య నుండి తక్షణ ఉపశమనం పొందుతారు. దీర్ఘకాలిక వెన్ను నొప్పికి ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

తక్కువ బరువు
చక్కెరతో పోలిస్తే బెల్లంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. చక్కెర యొక్క సరళమైన రూపం గ్లూకోజ్. కానీ బెల్లం చాలా కనిష్టం మరియు నెమ్మదిగా జీర్ణం అవుతుంది. బెల్లంలో మంచి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు.

క్యాన్సర్
బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి క్యాన్సర్ కారక క్రిములతో పోరాడి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.

శరీరం చల్లబరుస్తుంది
చెరకు రసంతో చేసిన బెల్లం నీటిలో కరిగించి తాగితే కడుపులో చికాకును పోగొట్టి చల్లగా ఉంచుతుంది. ముఖ్యంగా వేసవిలో ఈ పద్ధతిని చేస్తే శరీరం చల్లబడుతుంది.



Click it and Unblock the Notifications