Stress Symptoms: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే ఒత్తిడి కుదిపేయనుందని గమనించండి

చాలా మంది జీవితంలో ఒత్తిడి అనుభవిస్తారు. ఎప్పుడో ఒకప్పుడు ఒత్తిడి బాధిస్తుంది. అధిక ఒత్తిడి హోర్మోన్లు బరువు తగ్గడానికి, ఉత్పాదకను తగ్గించడానికి కారణం అవుతాయి. కార్టిసాల్ ఒత్తిడి హార్మోన్, అడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అవ

Stress Symptoms: చాలా మంది జీవితంలో ఒత్తిడి అనుభవిస్తారు. ఎప్పుడో ఒకప్పుడు ఒత్తిడి బాధిస్తుంది. అధిక ఒత్తిడి హోర్మోన్లు బరువు తగ్గడానికి, ఉత్పాదకను తగ్గించడానికి కారణం అవుతాయి. కార్టిసాల్ ఒత్తిడి హార్మోన్, అడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అవుతుంది. శరీరంలోని చాలా కణాలు కార్టిసాల్ గ్రాహకాలను కలిగి ఉంటాయి. అవి కార్టిసాల్ ను వివిధ విధుల కోసం పురికొల్పుతాయి.

stress

రక్తంలో చక్కెర నియంత్రణ, వాపు తగ్గింపు, జీవక్రియ నియంత్రణ, జ్ఞాపకశక్తి వంటివి నిర్వర్తించడానికి కార్టిసాల్ అవసరం. కానీ కార్టిసాల్ ఎక్కువగా ఉంటే అది శరీరానికి హాని చేస్తుంది. అధిక స్థాయి ఒత్తిడి మొత్తం పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. మీరు ఈ లక్షణాలు కనిపిస్తే శరీరంలో కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవచ్చు.

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు

కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే అది మలబద్దకానికి దారి తీస్తుంది. ఒత్తిడి హార్మోన్లు ప్రతి రోజూ శరీరం ద్వారా పంప్ అవుతాయి. కార్టిసాల్ జీర్ణ వ్యవస్థ నుండి రక్తాన్ని మళ్లీస్తాయి. గట్ సూక్ష జీవులను ప్రభావితం చేస్తాయి. అలా మలబద్ధకం బాధిస్తుంది.

ఆకలి లేకపోవడం లేదా అతిగా తినడం

ఆకలి లేకపోవడం లేదా అతిగా తినడం

శరీరంలో ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా ఉంటే ఆకలి వేయదు. ముఖ్యంగా ఉదయం పూట ఒత్తిడి హార్మోన్లు అధికంగా ఉంటాయి. అవి ఆకలిని కలిగించే హార్మోన్లను ప్రభావితం చేస్తాయి.

కొందరిలో ఆకలి విపరీతంగా ఉంటుంది. జీవక్రియలో, జీర్ణక్రియలో గందరగోళాన్ని కలిగించడం వల్ల కొందరిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది.

నిద్ర ఉండదు

నిద్ర ఉండదు

ఒత్తిడి హార్మోన్లు అధికంగా ఉండటం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. తీవ్రమైన ఒత్తిడి వల్ల రాత్రుళ్లు నిద్ర రాదు. నిద్ర లేకపోతే ఒత్తిడి వస్తుంది. ఇది ఒక సర్కిల్ లా పని చేస్తుంది.

శరీర బరువులో హెచ్చుతగ్గులు

శరీర బరువులో హెచ్చుతగ్గులు

ఆరోగ్యకరమైన బరువు మెయింటైన్ చేయడంలో విఫలం కావడానికి ఒత్తిడి హార్మోన్లు కూడా కారణం అవుతాయి. ఈ హార్మోన్ల వల్ల కొందరు బరువు తగ్గుతారు, మరికొందరు బరువు పెరుగుతారు. ఎక్కువ కేలరీలు తీసుకుంటారు లేదా తక్కువ కేలరీలు తీసుకుని సన్నబడతారు.

గుండె దడ

గుండె దడ

విపరీతమైన ఆందోళనతో ఉండడం. ఒత్తిడి ఆందోళనకు దారితీస్తుంది మరియు ఈ ఆందోళన రక్తపోటుకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండె రక్తపోటు రావడానికి ప్రదానలక్షణాల్లో ఇది ఒకటి. మీకు తరచూ ఇలా గుండె దడగా అనిపిస్తుంటే డాక్టర్ తప్పకుండా కలవాలి.

తలనొప్పి

తలనొప్పి

తరచూ తలనొప్పి, దవడల నొప్పులు రావడం. ఇవి టెన్షన్ వల్లే వస్తాయి. ఎక్కువగా ఒత్తిడికి గురైన్పుడు మెదడు లోని రక్త నాళాలు స్తంభించడం వల్ల తలనొప్పికి కారణం అవుతుంది.

ముక్కు నుండి రక్తం కారడం

ముక్కు నుండి రక్తం కారడం

మీలో బ్లడ్ ప్రెజర్ సడెన్ గా పెరిగినప్పుడు ముక్కులో నుండి రక్తం కారుతుంది. మీ బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడానికి కొన్ని సహజ రక్షణ పద్దతులు ఉన్నాయి. కాబట్టి ముక్కులో రక్తం కారుతుంటే ఈ సమస్యను తక్కువగా అంచానా వేయకండి. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళండి.

జుట్టు రాలడం

జుట్టు రాలడం

ఈ మోడ్రన్ యుగంలో జుట్టు రాలడానికి ప్రధాన కారణం స్ట్రెస్. మీరు 20వయస్సు వాళ్ళలోనే చాలా మందిలో ఈ సమస్యను గమనించవచ్చు. ఇవన్నీ వర్క్ ప్రెజర్ మరియు ఒత్తిడి వల్లే జరుగుతున్నాయి.

టెంపరెరీ మెమొరీ లాస్

టెంపరెరీ మెమొరీ లాస్

ఒత్తిడి మిమ్మల్ని తాత్కాలికంగా మతిమరుపుకు గురిచేస్తుంది. మీరు ఎప్పుడైతే అధిక పని ఒత్తిడి లేదా పూర్తిగా ఒత్తిడితో కూడి జీవశైలి ఉన్నప్పుడు ఇలా షార్ట్ టర్మ్ మెమరీలాస్ జరుగుతుంది. మీ మెమరీ లాస్ అవుతున్నట్లు మీకు అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా విరామం తీసుకోవడం చాలా అవసరం.

Story first published: Thursday, December 1, 2022, 18:08 [IST]
Desktop Bottom Promotion