Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
తెలుపు లేదా ఎరుపు.. ఏ జామ తినాలి? ఏది ఆరోగ్యానికి మంచిది?
సీజనల్ ఫ్రూట్స్ తినాలని వైద్యులు సూచిస్తారు. ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తప్పకుండా తినాలని అంటారు. ఆయా కాలాల్లోని వాతావరణ మార్పులకు అనుగుణంగా శరీరాన్ని మలచడంలో సీజనల్ ఫ్రూట్స్ సహాయం చేస్తాయి. వర్షాకాలం వచ్చిందంటే జామ పండ్లు ఎక్కువగా లభిస్తాయి. జామ వర్షాకాల పండు. అయితే జామ తెలుగు రంగులో, ఎరుపు(గులాబీ) రంగుల్లో లభిస్తాయి. ఈ రెండు రకాల జామ పండ్ల మధ్య తేడాలేంటి.. ఏది తినాలి, ఏది తింటే ఎక్కువ పోషకాలు అందుతాయో ఎప్పుడైనా ఆలోచించారా?

జామతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది
- గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
- రుతుస్రావం సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది
- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది
- బరుగు తగ్గడానికి సహాయపడుతుంది
- క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది
- రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది
- చర్మానికి మేలు చేస్తుంది
జామ పండ్లలో ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జామలో డైటరీ ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
తెలుపు లేదా ఎరుపు ఏ జామ మంచిది?
ఎరుపు జామలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా తక్కువగానే ఉంటుంది. విటమిన్ సి, తక్కువ గింజలు, కొన్ని రకాల్లో గింజలు కూడా ఉండవు. తెల్ల జామలో ఎక్కువ చక్కెర స్థాయిలు ఉంటాయి. స్టార్చ్, విటమిన్ సి, గింజలు కూడా ఎక్కువగా ఉంటాయి. తెల్లని జామలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎరుపు జామలో మరింత ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఎరుపు జామలో సహజంగా లభించే కెరోటినాయిడ్ అనే సేంద్రీయి వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది క్యారెట్, టమాటాలకు ప్రత్యేకమైన ఎరుపు రంగును ఇస్తుంది. కెరోటినాయిడ్ సాంద్రత జాతుల నుంచి జాతులకు మారుతూ ఉంటుంది. జామపండ్ల రంగు కూడా లేత గులాబీ నుంచి ఎరుపు వరకు ఉంటుంది. తెల్ల జామలో ఉండె కెరోటినాయిడ్ స్థాయిలు తక్కువ. అందుకే అవి తెలుపులో ఉంటాయి.
సూపర్ ఫ్రూట్ ఏది?
ఎరుపు జామను సూపర్ ఫ్రూట్ గా పరిగణిస్తారు. ఇందులో విటమిన్ ఏ, సి, ఒమేగా-3, ఒమేగా-6 పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ డయాబెటిక్ పేషెంట్లను ఎంతో ప్రయోజనకరం.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications