Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
టెన్షన్ పడ్డప్పుడు చెమట ఎందుకొస్తుంది? సైన్స్ ఏం చెబుతోందంటే..
చెమట ఎందుకొస్తుంది.. ఎప్పుడు వస్తుంది.. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత కంటే బయటి ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు, శరీరాన్ని చల్లబరిచేందుకు శరీరం చెమటను ఉత్పత్తి చేస్తుంది. చెమట వెనక ఉన్న ఈ కారణం చాలా మందికి తెలిసిందే. అయితే టెన్షన్, భయం, ఆందోళన, ఒత్తిడి, ఆత్రుత లాంటి సమయాల్లో కూడా చెమట పట్టడం గమినించే ఉంటారు చాలా మంది.
ఇలా టెన్షన్ పడ్డప్పుడు, భయపడ్డప్పుడు, ఆందోళన సమయంలో చెమట ఎందుకు వస్తుంది.. దీని వెనక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టెన్షన్ పడ్డప్పుడు చెమట ఎందుకొస్తుందంటే..:
నాడీ వ్యవస్థ:
ఒత్తిడి, ఆందోళన, ఆత్రుతగా ఉన్నప్పుడు నర్వస్ గా ఫీలైనప్పుడు నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ఈ సమస్యను ఎదుర్కొవడానికి నాడీ వ్యవస్థ రెండు రకాలుగా సిద్ధమవుతుంది. అయితే ఎదురొడ్డి పోరాడుతుంది, లేదంటే తప్పించుకుని పారిపోతుంది. ఆందోళన, ఒత్తిడి, ఆత్రుతగా ఉన్నప్పుడు నాడీ వ్యవస్థ హృదయ స్పందన రేటును, రక్తపోటును పెంచుతుంది. దీని వల్ల చెమట వస్తుంది. అరచేతులు, పాదాలు, చంకలు, ముఖంపై, మెడపై చెమట పడుతుంది.
హార్మోన్ల విడుదల:
ఆత్రుతగా ఉన్నప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు నర్వస్ గా అనిపించినప్పుడు, మన శరీరాలు అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్లు చెమటను కూడా ప్రేరేపిస్తాయి.
జన్యుశాస్త్రం:
కొంత మందికి ఇతరుల కన్నా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది జన్యుశాస్త్రం లేదై ఇతర కారణాల వల్ల కావొచ్చు.
ఆత్రుత, ఒత్తిడి లేదా నర్వస్‌నెస్ సమయంలో చెమటలు పట్టడం సాధారణమే. అయితే కొన్ని సందర్భాల్లో చెమటలు విపరీతంగా పడుతుంటాయి. ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. విపరీతమైన చెమట వల్ల సోషల్ ఆంగ్జైటీ కూడా రావొచ్చు.
టెన్షన్ పడ్డప్పుడు చెమట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి:
* ట్రిగ్గర్స్‌ను గుర్తించాలి:
అసలు చెమట ఎందుకు వస్తుందో ఆ ట్రిగ్గర్స్ ను గుర్తించాలి. ఏ కారణాల వల్ల చెమట పడుతుందో గుర్తిస్తే ఆ ట్రిగ్గర్స్ ను నివారించడానికి ప్రయత్నించవచ్చు.
* మందులు వాడటం:
చెమటను తగ్గించడానికి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మందులను నోటి ద్వారా తీసుకోవాలి. మరికొన్నింటిని చర్మంపై రాసుకోవాలి.
* జీవనశైలి మార్పులు:
చెమటను తగ్గించడంలో సహాయపడే అనేక జీవనశైలి మార్పులు ఉంటాయి. వాటి వల్ల చెమట సమస్యను ఎదుర్కోవచ్చు.
బరువు తగ్గడం: అధిక బరువు లేదా ఊబకాయం తో ఉన్నట్లయితే, బరువు తగ్గడం చెమటను తగ్గించడంలో సహాయపడుతుంది.
కెఫీన్, ఆల్కహాల్ ఆపేయడం: కెఫిన్, ఆల్కహాల్ రెండూ చెమటను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. వాటిని తీసుకోవడం ఆపేయాలి.
వదులుగా ఉండే దుస్తులు: వదులుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల చెమట పట్టకుండా ఉంటుంది.
యాంటిపెర్స్పిరెంట్, డియోడరెంట్: యాంటీపెర్స్పిరెంట్స్, డియోడరెంట్స్ చెమట పట్టడాన్ని, శరీర దుర్వాసనను తగ్గిస్తుంది.
డీప్ బ్రీత్: టెన్షన్ గా ఉన్నప్పుడు లోతుగా శ్వాస తీసుకోవాలి. దీని వల్ల హృదయ స్పందన రేటు తగ్గుతుంది. దాంతో చెమట పట్టడం కూడా తగ్గుతుంది.
రిలాక్సేషన్ టెక్నిక్స్: ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి రిలాక్సేషన్ టెక్నిక్ లు సాధన చేయాలి. వీటి ద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications