Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
యోగా బ్యూటీ చెబుతున్న ఫిట్ నెస్ మంత్ర
సైజ్ జీరో అయినా.. బిగ్ సైజ్ అయినా.. అనుష్క శెట్టి టాలెంట్ ముందు బలాదూర్. లేడీ ఓరియెంటెండ్ చేసినా, ఇన్నోసెంట్ గాల్ గా చేసినా.. స్వీటీ వందకు వంద మార్కులు కొట్టేయాల్సిందే. తెలుగు, తమిళ్ సినిమాల్లో సూపర్ సక్సెస్ అయిన ఈ బ్యూటీ క్రేజ్ బాలీవుడ్ దాకా చేరింది.
అనుష్క శెట్టి సూపర్ హాట్ శారీ స్టిల్స్
ఫ్యాట్ నుంచి స్లిమ్ లుక్.. స్లిమ్ లుక్ నుంచి ఫ్యాట్ లుక్ వరకు తన శరీరాన్ని ఎలా కావాలంటే.. అలా మలుచుకునే టాలెంట్ ఈ యోగా బ్యూటీకే సొంతం. అందరి హీరోయిన్స్ లోకి తనకంటూ ఓ ప్రత్యేకత నిరూపించుకుంది. సక్సెస్ ఫుల్ గా సినిమా రంగంలో రాణిస్తోంది. మరి ఈ క్యూట్ స్వీటీ స్వీట్ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుందా ?

కరెక్ట్ ఫుడ్
ఈ ముద్దుగుమ్మ ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుందట. అయితే.. కంట్రోల్ గా, క్వాలిటీ ఉన్న ఫుడ్ నే ఎంపిక చేసుకుని తింటుంది. అమ్మాయిలందరికీ ఈ అమ్మడు జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి అని సూచిస్తోంది. ఉదయం అల్పాహారం బ్రెడ్, తేనె తినడం అలవాటు చేసుకుందట. ఇదైతే ఆరోగ్యకరమని, పొట్టనిండిన ఫీలింగ్ కలుగజేస్తుందని సీక్రెట్ రివీల్ చేసింది ఈ బ్యూటీ.

డ్రింకింగ్ హ్యాబిట్స్
ఫుడ్ నే కాకుండా.. ఎప్పుడూ నీళ్లు, ఇతర హెల్తీ డ్రింక్స్ పైనా ఫోకస్ పెట్టాలని సలహా ఇస్తోంది అనుష్క. తాను ఎప్పుడూ సోడా తాగనని.. అలాగే తన ఫ్యాన్స్ కూడా సోడా తాగద్దని సూచిస్తోంది. ఎందుకంటే.. అది హెల్తీ కాదు కాబట్టి. తాను ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతానని, దీనివల్ల శరీరంలోని మలినాలు బయటకు పోతాయని సలహా ఇస్తోంది.

ఎక్సర్ సైజ్
అనుష్క శెట్టి ఖచ్చితంగా వ్యాయానికి కొంత సమయం కేటాయిస్తుందట. వ్యాయామం వల్ల స్టామినాతో పాటు, శరీరం ఫిట్ గా ఉంటుందని చెబుతోంది. అలాగే యోగా, మెడిటేషన్ ద్వారా ఆరోగ్యం, ప్రశాంతత పొందవచ్చు అంటోంది.

ఒత్తిడి
అనుష్క శెట్టి ఒత్తిడిని జయించడానికి ఒక ఇంట్రెస్టింగ్ హ్యాబిట్ అలవాటు చేసుకుంది. తనకు బాగా ఇష్టమైన, ఆసక్తికరంగా ఉన్న సామెతలను రాసుకుంటుందట. ఎప్పుడైతే ఒత్తిడిగా ఫీలవుతుందో అప్పుడు వాటిని చదువుతుందట. అంతే రిలాక్స్ అయిపోతుందట. బాగుంది కదూ.. ఈ సింపుల్ ట్రిక్.

టైమింగ్
ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉన్నా.. ఆహారం విషయంలో కరెక్ట్ టైం ఫాలో అవుతుందట స్వీటీ. సమయానికి సరిగ్గా ఆహారం తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటామని చెబుతోంది. రాత్రి భోజనం 8లోపు పూర్తి చేస్తుందట. దీనివల్ల మంచి నిద్ర పడుతుందంటోంది. అలాగే ఉదయం 7 గంటలకు లేచి యోగాతో రోజుని ప్రారంభిస్తానని క్యూట్ స్వీటీ ఫిట్ నెస్ సీక్రెట్ చెబుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ యోగా బ్యూటీని ఫాలో అయిపోండి.



Click it and Unblock the Notifications