For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ క్రికెటర్స్ ఎంతవరకు చదువుకున్నారు ? అసలు కాలేజీ మెట్లు ఎక్కారా ?

By Swathi
|

వాళ్లు చాలా స్టైలిష్ గా ఉంటారు, వాళ్లు చాలా డేర్ గా ఉంటారు. వాళ్లు బాగా కష్టపడతారు.. వాళ్లే ఇండియన్ క్రికెటర్స్..! వాళ్లంతా క్రికెట్ అద్భుతంగా ఆడతారు, అందరినీ అభిమానాన్ని, అప్రిషియేషన్ ను పొందుతారు. వందలాది పరుగులు పెట్టే సత్తా, వికెట్స్ తీసే కలేజా ఉన్న మొనగాళ్లు. మరి వాళ్ల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా ?

డిగ్రీ లేకపోయినా.. వాళ్లు టెక్నాలజీ రంగంలో వరల్డ్ ఫేమస్.. ! డిగ్రీ లేకపోయినా.. వాళ్లు టెక్నాలజీ రంగంలో వరల్డ్ ఫేమస్.. !

క్రికెట్ స్టేడియంలో సిక్సర్స్, ఫోర్స్ బాదేస్తూ, బౌలింగ్, ఫీల్డింగ్ తో అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకిత్తించే స్టార్స్ మన ఇండియన్ క్రికెటర్స్. క్రికెట్ యే ప్రాణంగా, సెంచరీల మీద సెంచరీలు, వికెట్ల మీ వికెట్లు తీసే క్రికెటర్స్ కి అభిమానులు చాలా ఎక్కువే. మ్యాచ్ ఉందంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ.. ఈ బ్యాటింగ్ బాయ్స్ విన్యాసాలు చూడట్టానికి టీవీలకు అతుక్కుపోతారు.

సాధారణ జీవితం నుంచి సెలబ్రెటీ స్థాయికి ఎదిగిన స్టార్స్.. సాధారణ జీవితం నుంచి సెలబ్రెటీ స్థాయికి ఎదిగిన స్టార్స్..

తమకున్న ఇంట్రెస్ట్ నే లక్ష్యంగా మార్చుకుని, తమకు ఆసక్తి ఉన్న రంగంలోకి ఎంటర్ అయ్యారు. సక్సెస్ అయ్యారు. వరల్డ్ ఫేమస్ క్రికెటర్స్ గా అభిమానాన్ని అందుకుంటున్నారు. ఇండియన్ క్రికెటర్స్ కొంతమంది టెన్త్ కే పరిమితం అయితే, మరికొందరు ఇంటర్ తోనే ఫుల్ స్టాప్ పెట్టారు, ఇంకొందరు డిగ్రీలు అందుకుని.. అటు చదువుకి, ఇటు ఇష్టమైన క్రికెట్ కి న్యాయం చేస్తున్నారు.

అయితే ఫీల్డ్ అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే క్రికెటర్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంతో తెలుసా ? తక్కు ఎడ్యుకేషన్ ఉన్నా.. వాళ్లు ప్రపంచాన్నే ఏలుతున్నారు. మనలో సత్తా, కలేజా ఉంటే.. చదువు అవసరం లేదని నిరూపిస్తున్నారు క్రికెట్ స్టార్స్. అయితే వాళ్లు కన్న కలలు, అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకున్నారు. యువతరం అభిమాన నిరాజనాలు అందుకుంటున్న ఇండియన్ ఫేమస్ క్రికెటర్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోవాలనుందా ? అయితే.. కింది స్లైడ్స్ క్లిక్ చేయండి..

విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి

స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ తాజా మ్యాచ్ తో క్రేజ్ పెరిగిపోయింది. విరాట్ కోహ్లీ చిన్న వయసులోనే క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. కోహ్లీ ఇంటర్ వరకు చదివాడు.

ధోనీ

ధోనీ

పాపులర్ క్రికెట్ స్టార్ ఎంఎస్ ధోనీ.. ఇప్పటికీ ఓ కాలేజీలో స్టూడెంట్ అని మీకు తెలుసా ? నిజమే.. 10వ తరగతి పూర్తి అయిన తర్వాత క్రికకెటర్ గా మారాడు. ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేశాడు. ప్రస్తుతం బీకామ్ చదువుతున్నాడు.

సౌరవ్ గంగూలి

సౌరవ్ గంగూలి

ఫేమస్ ఇండియన్ క్రికెటర్ సౌరవ్ గంగూలి సెయింట్ జూనియర్స్ కాలేజీలో కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

సురేష్ రైనా

సురేష్ రైనా

వన్డే, టెస్ట్, టీ20 అన్ని మ్యాచ్ లలో ఇండియా తరపున సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా రికార్డ్ క్రియేట్ చేసిన సురేష్ రైనా హైస్కూల్ వరకే చదివాడని మీకు తెలుసా ?

సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిన్నతనంలోనే క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడని అందరికీ తెలుసు. అయితే.. సచిన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా ? ఇంటర్.. !

వివిఎస్ లక్ష్మణ్

వివిఎస్ లక్ష్మణ్

హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్ మెన్ వివిఎస్ లక్ష్మణ్ స్టతస్ స్కోప్ పట్టాల్సింది.. బ్యాట్ పట్టాడు. ఎమ్ బీబీఎస్ మధ్యలోనే ఆపేసి.. క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టాడు.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

వన్డే చరిత్రలో రెండు డబుల్ సెంచరీలతో ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రేకెత్తించిన బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ ఇంటర్ వరకు చదివాడు.

శికర్ ధావన్

శికర్ ధావన్

శికర్ ధావన్ కేవలం హైస్కూల్ విద్యకు పూర్తీ చేశాడు.

రాహుల్ ద్రావిడ్

రాహుల్ ద్రావిడ్

రాహుల్ ద్రావిడ్ బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీ ఫర్ కామర్స్ లో డిగ్రీ అందుకున్నాడు. తర్వాత ఎంబీఏలో జాయిన్ అయ్యాడు.. కానీ.. మధ్యలోనే మానేసి ఇండియన్ క్రికెట్ టీంలో చేరాడు.

యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్

పంజాబ్ కి చెందిన క్రికెటర్ యువరాజ్ ిసంగ్ స్కూలింగ్ స్కేటింగ్ లో రాణించాడు.. ఇంటర్ తర్వాత క్రికెట్ పై ఉన్న అభిమానంతో క్రికెటర్ గా మారాడు.

అనిల్ కుంబ్లే

అనిల్ కుంబ్లే

స్పిన్ అంటే అనిల్ కుంబ్లే ఫేమస్. ఈ స్టార్ క్రికెటర్ ఇంజినీరింగ్ పూర్తీ చేశాడు.

జహీర్ ఖాన్

జహీర్ ఖాన్

జహీర్ ఖాన్ కూడా ఇంజినీరింగ్ లో జాయిన్ అయ్యాడు. కానీ.. క్రికెట్ పై ఆసక్తి వల్ల మధ్యలోనే మానేశాడు.

శ్రీనాథ్

శ్రీనాథ్

శ్రీనాథ్ మైసూర్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత క్రికెట్ రంగంలోకి ఎంటర్ అయ్యాడు.

వీరేంద్ర సెహ్వాగ్

వీరేంద్ర సెహ్వాగ్

పవర్ ఫుల్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. క్రికెటర్ లోకి ఎంటర్ అవడానికి ముందే.. ఇస్లామియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్ ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ అందుకున్నాడు.

అశ్విన్

అశ్విన్

అశ్విన్ కూడా ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కానీ క్రికెట్ పై ఉన్న ఇంట్రెస్ట్ తనను క్రికెటర్ గా మార్చింది.

ఉమేష్ యాదవ్

ఉమేష్ యాదవ్

ఉమేష్ యాదవ్ స్కూలింగ్ పూర్తి చేశాడు. తర్వాత చదువు మీద ఆసక్తి లేకపోవడంతో.. క్రికెట్ ని ఎంచుకుని.. సక్సెస్ అయ్యాడు.

English summary

Famous Cricketers and Their Educational Qualifications

Famous Cricketers and Their Educational Qualifications. We all know our cricketers for their brilliant batting bowling fielding or wicket-keeping. They know the numbers of runs they scored or the balls they bowled but were they as good in studies?
Desktop Bottom Promotion