Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భిణీలు బేరిపండ్లు తినడం వల్ల పొందే ప్రయోజనాలు..!!
సామాన్యులకు మాత్రమే కాదు , గర్భిణీలకు కూడా బేరిపండ్లు గ్రేట్ గా సహాయపడుతాయి. ఎందుకంటే బేరిపండ్లలో యాంటీఆక్సిడెంట్స్, మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి .
గర్భిణీలకు హెల్తీ అండ్ న్యూట్రీషియన్ ఫుడ్స్ ను అధికంగా తీసుకోవాల్సిందిగా డాక్టర్స్ సూచిస్తుంటారు. గర్భం పొందిన తర్వాత ప్రతి గర్భిణీ ఆమె తీసుకునే ఆహారాల పట్ల తగిన జాగ్రత్తలు కలిగి ఉండటం చాలా అవసరం. గర్భణిలు రెగ్యులర్ గా తీసుకోవాల్సిన ఆహారాల్లో కొన్ని తినాల్సినవి, కొన్ని తినకూడనవి కూడా ఉంటాయి. ఉదాహరణకు, మహిళ గర్భం పొందిన తర్వాత బొప్పాయి, పైనాపిల్, ద్రాక్ష వంటివి తినకూడదని ఆంక్షలు పెడుతుంటారు. అయితే రెగ్యురల్ గా తినాల్సిన ఆహారాల్లో కొన్ని హెల్తీ ఫుడ్స్ తినడానికి సందేహపడుతుంటారు. అలాంటి ఫుడ్స్ లో బేరిపండ్లు ఒకటి. ఇది సీజనల్ గా మనకు అందుబాటులో ఉండే ఫ్రూట్ కాబట్టి, దీన్ని గర్భధారణ సమయంలో తినడం సురక్షితమా కాదా అని ఆలోచిస్తుంటారు.

సామాన్యులకు మాత్రమే కాదు , గర్భిణీలకు కూడా బేరిపండ్లు గ్రేట్ గా సహాయపడుతాయి. ఎందుకంటే బేరిపండ్లలో యాంటీఆక్సిడెంట్స్, మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి . విటమిన్స్ లో విటమిన్ బి9, కె, సి, ఎ లు ఎక్కువ. ఇంకా బేరిపండ్లలో క్యాల్షియం, కోబాల్ట్, కాపర్, జింక్, ఐరన్, పొటాసియం, ఫాస్పరస్, పెక్టిన్, ఫైబర్, సల్ఫర్ లు కూడా ఎక్కువగా ఉంటాయి.
బేరిపండ్లను తినడానికి ముందు క్లీన్ గా కడిగి, బ్యాక్టీరియా, ఇతర మైక్రోబ్స్ లేకుండా జాగ్రతపడాలి. కాబట్టి, మంచి నీటితో శుభ్రం చేసి తినాలి. లేదంటే జబ్బుల భారీన పడాల్సి వస్తుంది. ఇంకా సందేహం ఉంటే మీ రెగ్యులర్ డాక్టర్ ను కలిసి బేరిపండ్లు తినొచ్చా..? తినకూడదా...? నిర్ధారించుకున్న తర్వాత తీసుకోవాలి. అంతకు ముందుగా గర్భిణీలు బేరిపండ్లు తినడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:
బేరిపండ్లలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల దగ్గు, జలుబు, బ్రొంకైటిస్, నిద్రలేమి మరియు ఫ్లూ వంటి సమస్యలను నివారిస్తుంది.

మలబద్దకాన్ని నివారిస్తుంది:
బేరిపండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకం నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బేరిపండ్లను రెగ్యులర్ గా తినడం కూడా మంచిది.

ఎనర్జీ ఫ్రూట్ :
బేరిపండ్ల లోఫ్యాట్ ఫ్రూట్ కాబట్టి, ఎనర్జీ బూస్టర్ గా సహాయపడుతుంది. ఆవరేజ్ ఫ్రూట్ లో 100 క్యాలరీలుంటాయి. కాబట్టి, గర్భిణీలకు అవసరమయ్యే క్యాలరీలు ఒక పండు ద్వారా పూర్తిగా అందుతాయి.

ఆకలిని కోరికలను తగ్గిస్తాయి:
బేరిపండ్లలో నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల తినడం స్వీట్ గా ఉంటుంది. దాంతో ఇతర ఆహారాల మీద, స్వీట్స్ తినాలన్న కోరికను తగ్గిస్తుంది.

హార్ట్ హెల్త్ :
బేరిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి, ఇది హార్ట్ ఫంక్షన్స్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. తల్లి బిడ్డ ఇద్దరికి కావల్సిన మినిరల్స్ ను అందించి హార్ట్ ను హెల్తీగా ఉంచుతుంది.

బోన్ హెల్త్ :
బేరిపండ్లలో క్యాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే మినిరల్స్ బోన్స్ కు కావల్సిన బలాన్ని చేకూర్చుతుంది. ఇది బేబీ మరియు తల్లికి కూడా ఆరోగ్యకరమైనదే...



Click it and Unblock the Notifications