అయ్యబాబోయ్, ఈ సెల్ఫీలు చూస్తే ఒక్క క్షణం హార్ట్ బీట్ ఆగిపోవాల్సిందే!

Posted By:
Subscribe to Boldsky

ఒక కొత్త మొబైల్ తీసుకుంటే చాలు మొదట సెల్ఫీ దిగాల్సిందే. ఈ మోడ్రన్ ప్రపంచంలో ప్రస్తుతం సెల్ఫీలు రాజ్యమేలుతున్నాయి. మొబైల్స్ లో క్రేజీగా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి ఆనందించడంలో ఉండే ఆ కిక్కే వేరప్ప అంటారు కొందరు. సెల్ఫీలు దిగడానికి ఎంతటి రిస్క్ అయినా చేస్తారు.

ఐదేళ్ల కిందట ఈ పేరు కూడా చాలా మంది విని ఉండరు. ఇప్పుడు ఐదేళ్ల చిన్నారిని అడిగినా ఠక్కున చెప్పేస్తాడు. తమదైన ఫొటో కోసం కుర్రకారు సాహసాలకు వెనుకాడటం లేదు. ప్రమాదకర ప్రదేశాల్లో ఫీట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

సెల్ఫీ మొదటి జ్ఞాపకం. దీనిని ఎవరైనా అంగీకరిస్తారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్ లలో సెల్ఫీలకు విపరీతమైన క్రేజ్‌. ఇటీవల వేగంగా వచ్చిన మార్పుల్లో సెల్ఫీ ఒకటి. కాలేజీ విద్యార్థులు నలుగురు ఒకచోట చేరితే చాలు అర చేతిలో సెల్‌ఫోన పట్టుకుని సెల్ఫీ దిగాలని ఉబలాటపడుతున్నారు. ప్రమాదకర జోన్ ల వద్ద సెల్ఫీలకు ప్రయత్నించి, వారికి సెల్ఫీ మీదున్న క్రేజ్ ఎలాంటిదో తెలియజేస్తుంటారు. అలాంటి వాటిలో కొన్ని ఈ క్రింద ఉన్న ఫోటోలు తెలియజేస్తాయి. ఈ క్రింది లిస్ట్ లో ఉన్న ఫోటోలన్నీ కూడా ఇంటర్నెంట్లో హాల్ చేసినవే. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేయండి. అయితే మీరు మాత్రం ట్రై చేయకండి..

1. నింగిలో సెల్ఫీ:

1. నింగిలో సెల్ఫీ:

నింగిలో ప్రయాణిస్తూ సెల్ఫీ దిగాలనే ఈ బాస్ కు హాట్సాఫ్ చెప్పాల్సిందే..

ఈ మోడల్ ను చూస్తే మీకేమనిపిస్తుంది..? ఆడ..మగ..?

2. హైవే మీద సెల్ఫీ:

2. హైవే మీద సెల్ఫీ:

హైవే చూస్తానే సెల్ఫీ దిగాలనే కోరిక..హైవే మీద ఇలా ఫోటో దిగే వారిని హైవే పోలీసులు చూస్తే ఏమౌతుంది?

3. ఈ ఎత్తు చూస్తే కళ్ళు తిరగాల్సిందే:

3. ఈ ఎత్తు చూస్తే కళ్ళు తిరగాల్సిందే:

ఈ హాట్ గర్ల్ మాత్రం ఎంచెక్కా ఫర్ఫెక్ట్ సెల్ఫీ దిగడం కోసం చూస్తోన్నట్లు కనబడుతున్నది.

4. ఆకట్టుకునే షాట్స్ :

4. ఆకట్టుకునే షాట్స్ :

ఇంప్రెసివ్ షాట్స్ తో సర్ఫింగ్ చేస్తూనే సెల్ఫీ దిగడం అమేజింగ్.

5. వాల్కనోతో సెల్ఫీ:

5. వాల్కనోతో సెల్ఫీ:

ఏ మాత్రం భయం లేకుండా ఇండోనేషియాలో బ్రోమో వాల్కనో కు వ్యతిరేఖ దిశలో నిలబడి సెల్ఫీ దిగడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

వారణాసిని మ్యాజికల్ ప్లేస్ గా ఎందుకు పిలుస్తారు..!?

6. బుల్ తో సెల్ఫీ :

6. బుల్ తో సెల్ఫీ :

ఈ ఇమేజ్ చూస్తుంటే పందెంలో కూడా బుల్ (ఎద్దు) తో ఒక మంచి సెల్ఫీ దిగాలనే కోరిక కలడం నిజంగా ఆశ్చర్యమే..

7. వోటివ్ చెర్చ్ పై వరకూ ఎక్కిన ఘనుడు :

7. వోటివ్ చెర్చ్ పై వరకూ ఎక్కిన ఘనుడు :

సెల్ఫీ కోసం వోటివ్ చర్చ్ పై వరకూ ఎక్కిన ఘనుడు, చివరికి ఫర్ఫెక్ట్ షాట్ సాధించాడు.

8. సెల్ఫీతో బిజీ:

8. సెల్ఫీతో బిజీ:

ఇలాంటి పిక్చర్స్ చూసినప్పుడు, ఇలాంటి సిల్లీ పనుల వల్లే ప్లెయిన్ క్రాష్ అవుతుంటాయోమన్నా భయం కలుగుతుంది.

9. రియో డి జనైరో:

9. రియో డి జనైరో:

రియో డి జనైరోలో రిడీమర్ విగ్రహం మీద సెల్ఫీ దిగాలనే ఆలోచన అతన్ని టాప్ వరకూ తీసుకెళ్లింది.

10.ఒంటెతో ఫర్ఫెక్ట్ సెల్ఫీ:

10.ఒంటెతో ఫర్ఫెక్ట్ సెల్ఫీ:

ఈ పిక్చర్ చూస్తే ఒంటే చాలా ఆకలిగా ఉండటంతో ఆమెను తినడానికి ప్రయత్నిస్తుండగా సెల్ఫీ దిగినట్లు అగుపిస్తోంది.

500k యూట్యూబ్ క్లిక్స్ తో సంతోషంలో నగ్నంగా డ్యాన్స్ చేసిన జాన్ సీనా, నిక్కి బెల్లా.!

11. గుండె ఆగిపోవడం కాయం :

11. గుండె ఆగిపోవడం కాయం :

ఈ పిక్చర్ చూస్తే ఒక్క క్షణం గుండె ఆగిపోవడం కాయం. ఈ పిక్చర్ లో ఒక పెద్ద అంతస్తో లేక వంతెనో తెలియదు కానీ, చాలా హైట్ లో నిలబడి సెల్ఫీ దిగడం అతని గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

12. ఇతన్ని చూస్తే పిచ్చోడేమో అనిపిస్తుంది.. :

12. ఇతన్ని చూస్తే పిచ్చోడేమో అనిపిస్తుంది.. :

పిచ్చోడు కాదు కానీ, సెల్ఫీ మీద ఉన్న క్రేజ్ తనంతట తాను ఫైయర్ అంటించుకుని, సెల్ఫీ దిగడం పిచ్చికాక ఏంటి...?

13. సింహంతో చెలగాటం:

13. సింహంతో చెలగాటం:

వరెవ్వా ఇలాంటి మూమెంట్ ను చూడటానికి ఈ ప్రపంచంలోని వారు ఎలా మిస్ అవుతారు. ఏకంగా సింహం నోట్లో చెయ్యే పెట్టేశాడు? ఖచ్ఛితంగా అతను సెల్ఫీకి అర్హుడనే చెప్పాలి..మరి మీరేమంటారు?

14. రియలా? ఫోటో ఎడిటింగా?

14. రియలా? ఫోటో ఎడిటింగా?

ఇతన్ని చూస్తుంటే అడ్వర్టైజర్ గా చెప్పవచ్చు, ఎందుకంటే ఫోటో ఎడిటింగ్ తో ఫర్ఫెక్ట్ పిక్చర్ దిగాడు కాబట్టి.

English summary

Selfies That Can Make You Skip Your Heartbeat

All the images that we have shared in this article are from around the Internet that quite simply can take away your breath. Take a look, but don't try doing this by yourself!
Subscribe Newsletter