Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఆదివారం బ్రేక్ ఫాస్ట్ అదిరిపోవాలా? వేడి వేడి ఇడ్లీలోకి కేరళ మటన్ పెప్పర్ ఫ్రై..ఈజీగా ఎలా చేయాలంటే..
ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది వేడి వేడి ఇడ్లీలు, దానికి జతగా ఘుమఘుమలాడే మటన్ కూర ఉంటే అదరహో అనాల్సిందే. అయితే ప్రతి వారం ఎప్పటిలాగే చేసుకునే ఒకే రకమైన మటన్ కూర కాకుండా.. ఈ వారం మీ నాలుకకు కొత్త రుచిని పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే కేరళ స్టైల్ మటన్ పెప్పర్ ఫ్రై ట్రై చేసి చూడండి. దీన్ని ఇడ్లీ, దోశలతోనే కాకుండా వేడి వేడి అన్నం, బగారా రైస్ లో కలుపుకుని తింటే అమృతంలా ఉంటుంది.

కేరళ మటన్ పెప్పర్ ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు
లేత మటన్ - అర కిలో
మిరియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి మిరపకాయ - 1
వెల్లుల్లి రెబ్బలు - 8
అల్లం - 1 అంగుళం ముక్క
ఉల్లిపాయలు - 2 పెద్దవి (సన్నగా తరుగుకోవాలి)
పండిన టమాటా - 1 (సన్నని ముక్కలు)
పసుపు - ½ టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
సోంపు పొడి - ½ టేబుల్ స్పూన్
గరం మసాలా - ½ టేబుల్ స్పూన్
కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - 2 కట్టలు (తాజావి)
ఉప్పు - రుచికి సరిపడా
కొబ్బరి నూనె (లేదా వంట నూనె) - 4 టేబుల్ స్పూన్లు

కేరళ మటన్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని.. అందులో మిరియాల పొడి, పొట్టు తీసిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని, ఈ మిరియాల పేస్ట్‌ను వేయాలి. అందులోనే తగినంత ఉప్పు, గుప్పెడు కరివేపాకు వేసి మటన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలా చేత్తో కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి మారి మెత్తబడే వరకు వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి, అవి బాగా మగ్గి గుజ్జులా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో పసుపు, ధనియాల పొడి, సోంపు పొడి, గరం మసాలా వేసి పచ్చివాసన పోయేలా బాగా వేయించండి.
-నూనె పైకి తేలుతున్న సమయంలో.. పక్కన ఉంచుకున్న మటన్ ముక్కలను, మరో కట్ట కరివేపాకును వేసి బాగా కలపండి. ఐదు నిమిషాలు వేయించాక, రెండు కప్పుల నీళ్లు పోసి, ఉప్పు సరిచూసుకుని మూతపెట్టండి. దీన్ని సన్నని మంటపై మటన్ మెత్తబడే వరకు ఉడికించండి.
-మటన్ చక్కగా ఉడికిన తర్వాత, స్టవ్ మంటను కాస్త పెంచి గ్రేవీ దగ్గరపడేలా ఉడికించండి. చివరగా కూర దించే ముందు.. పైన కొద్దిగా మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే మీ ఇల్లంతా సువాసనలు వెదజల్లే కేరళ స్టైల్ మటన్ పెప్పర్ ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications