Latest Updates
-
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే!
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నాం. దీని ఫలితంగా ఎన్నో కొత్త రోగాలు మనపై దాడి చేస్తున్నాయి. అందులో ప్రధానమైనది, తీవ్రమైన నొప్పితో నిద్రలేకుండా చేసే సమస్య కిడ్నీలో రాళ్లు. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ సమస్య, నేడు యువతను సైతం తీవ్రంగా వేధిస్తోంది. మనం తినే ఆహారంలో ఉండే కొన్ని మినరల్స్ శరీరంలో మోతాదుకు మించి పేరుకుపోయి, క్రమంగా చిన్న చిన్న రాళ్లుగా మారతాయి. దీనికి ప్రధాన కారణం మనం తినే చెడు ఆహారం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలే.

నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు.. ఇవే లక్షణాలు
కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు నడుము కింది భాగంలో లేదా పొత్తికడుపులో భరించలేని నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఒక్కోసారి ప్రాణం పోతుందా అన్నంతగా బాధిస్తుంది. మూత్ర విసర్జన చేసే సమయంలో తీవ్రమైన మంట, పదే పదే మూత్రానికి వెళ్లాలనే భావన, వికారం, వాంతులు వంటివి దీని ప్రధాన లక్షణాలు. చాలామంది దీన్ని సాధారణ కడుపునొప్పిగా భావించి పెయిన్ కిల్లర్స్ వేసుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఆ నిర్లక్ష్యమే సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
మనం రోజూ తినే కొన్ని ఆహారాలే కిడ్నీలో రాళ్లకు కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడటం, బేకరీ ఫుడ్స్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు కిడ్నీలకు బద్ధ శత్రువులు. కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల్లో ఆక్సలేట్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని పరిమితికి మించి తీసుకుంటే అవి శరీరంలో పేరుకుపోయి రాళ్లుగా మారుతాయి.
ఇక నేటి తరానికి ఇష్టమైన జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన పానీయాలు కిడ్నీల పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తాయి. వీటికి తోడు నీళ్లు తాగకపోవడం వల్ల ఈ రాళ్లు పెద్దవిగా మారతాయి.
కిడ్నీలను కాపాడే సంజీవని నీరు..
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నీరుకు మించిన ఔషధం లేదు. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, పీచుపదార్థం ఎక్కువగా ఉండే తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా నిమ్మరసం, కొబ్బరినీళ్లు తరచుగా తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోయి, శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది. బయటి ఆహారానికి, అధిక ఉప్పుకు ఎంత దూరంగా ఉంటే కిడ్నీలు అంత సురక్షితంగా ఉంటాయి.
డాక్టర్ ని ఎప్పుడు కలవాలి?
మీకు కడుపులో లేదా నడుము భాగంలో తీవ్రమైన నొప్పి ఎడతెగకుండా వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. మూత్రంలో రక్తం పడటం, మూత్ర విసర్జనలో ఇబ్బంది, భరించలేని మంట, వీటికి తోడు జ్వరం, తరచుగా వాంతులు వస్తుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
