For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా ప్ర‌వ‌ర్తిస్తే ఆయుర్దాయం త‌గ్గిపోతుంది!

By Sujeeth Kumar
|

విదుర నీతి ప్ర‌కారం ప్ర‌తి మాన‌వుడు 100 ఏళ్ల పాటు భూమిపైన జీవిస్తాడు. అయితే దాదాపు చాలా సంద‌ర్భాల్లో నూరేళ్లు నిండ‌కుండానే క‌న్ను మూస్తున్నారు. ఇలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా? జీవ‌న ప్ర‌మాణాల నాణ్యత‌లో లోపం, వంశ‌పారంప‌ర్య కార‌ణాలు కాకుండా కొన్ని ర‌కాల అల‌వాట్లు మ‌న ఆయువును త‌గ్గిస్తున్నాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

మితిమీరిన గ‌ర్వం

మితిమీరిన గ‌ర్వం

సంప‌ద క‌లిగి ఉండ‌డంలో ఎలాంటి త‌ప్పు లేదు. దాన్ని చూసుకొని మిడిసిప‌డితేనే ప్ర‌మాదం. ఎవ‌రికైతే మితిమీరిన గ‌ర్వం ఉంటుందో వాళ్లు ఇత‌రులను త‌క్కువ‌గా చూస్తారు. అన‌వ‌స‌ర‌మైన ఈగోలు పెంచుకుంటారు. ఇలాంటివారు మిగ‌తావారి కంటే తొంద‌ర‌గానే పైకి పోతారు.

కోపంగా ఉండేవారు

కోపంగా ఉండేవారు

త‌న కోప‌మే త‌న‌కు శ‌త్రువు అని వేమ‌న ఆనాడే అన్నాడు. కొన్నిసార్లు ఆవేశంతో ర‌గిలిపోవ‌డం మంచిదే. న్యాయ‌బ‌ద్ధ‌మైన విష‌యాల‌కు కోపం తెచ్చుకోవ‌డాన్ని ఎవ్వ‌రం ఆప‌లేం. అయితే ప్ర‌తి చిన్న‌దానికీ కోపం తెచ్చుకుంటే మాత్రం మ‌న జీవితాన్ని ప‌ణంగా పెడుతున్న‌ట్టే లెక్క‌. మితిమీరిన కోపం ప్ర‌ద‌ర్శించేవారు త్వ‌ర‌గా బ‌ల‌హీన‌మై తొంద‌ర‌గా జీవితాన్ని ముగించే అవ‌కాశాలున్నాయి.

స్వార్థ‌పరులు..

స్వార్థ‌పరులు..

ఉన్న‌ది ఇత‌రుల‌తో పంచుకుంటేనే క‌దా అస‌లైన సంతోషం. మ‌న‌కు కావ‌ల‌సిన‌వ‌న్నీ మ‌నకు అందుబాటులో ఉంటే అంత‌క‌న్నా ఆనందం ఏముంటుంది. అయితే మ‌న‌కున్నది ఇత‌రుల‌తో పంచుకోక‌పోతే ఏం లాభం. స్వార్థ‌ప‌రులుగా మిగిలిపోతాం. ఒక్కోసారి స్వార్థ‌ప‌రులుగా ఉండ‌టం మంచిదే. ప్ర‌తిసారీ, ప్ర‌తి అవ‌స‌రానికి స్వార్థం పనికిరాదు. స‌మాజంలో మ‌న‌పై చెడు ప్ర‌భావం ప‌డిపోయి తొంద‌ర‌గా జీవితం అస్త‌మయ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

అత్యాశ‌ప‌రులు..

అత్యాశ‌ప‌రులు..

మీరు జీవితంలో ఎప్పుడైనా అసంతృప్తికి గుర‌య్యారా? అవును మ‌న‌మంతా ఎప్పుడో ఒక‌సారి అసంతృప్తికి గుర‌య్యే ఉంటాం. ఎంత సంపాదించినా డ‌బ్బు పైన అత్యాశ కొంద‌రికి చావ‌దు. ప్రాపంచిక సుఖాల‌పై అత్యాశ క‌లిగి ఉండ‌డం మ‌న‌ల్ని జాలి లేనివారిగా చేస్తుంది. జీవితం క‌ళావిహీనంగా మారి తొంద‌ర‌గానే చ‌నిపోయే ప్ర‌మాద‌ముంది.

వెన్నుపోటు పొడిచేవారు...

వెన్నుపోటు పొడిచేవారు...

స్నేహితులు, కుటుంబ‌స‌భ్యులు ఉండ‌డం ప‌రిపాటే. మ‌న‌కు సన్నిహితుల్లో ఎవ‌రైనా మ‌న‌ల్ని వెన్నుపోటు పొడిస్తే ప‌రిణామాలు ఎలా ఉంటాయో వూహించారా? కుటుంబ‌స‌భ్యునిగా భావించిన స్నేహితుడే వెన్నుపోటు పొడిస్తే అంత‌క‌న్నా దారుణం మ‌రొక‌టి ఉంటుందా? ఇలా వెన్నుపోటు పొడిచేవారి మ‌న‌సు శాంతంగా ఉండ‌దు. వారు త్వ‌ర‌గానే చ‌నిపోయే అవ‌కాశాలున్నాయి.

తీరిక‌లేకుండా గ‌డిపేవారు..

తీరిక‌లేకుండా గ‌డిపేవారు..

ప‌నే ప్ర‌త్య‌క్ష దైవం.. కాద‌న‌లేం! కేవ‌లం ప‌ని ప‌ని పని... జీవితంలో స్నేహితులు, కుటుంబ‌స‌భ్యులు లేక‌పోతే ఎలా ఉంటుందో వూహించండి. మ‌న విజ‌యాలు, అప‌జ‌యాలు పంచుకునేందుకు ఎవ‌రో ఒక‌రు కావాలి క‌దా. ఎంత తీరిక‌లేకుండా ఉన్నా స‌రే కాస్త స‌మ‌యాన్ని స్నేహితులు, కుటుంబ‌స‌భ్యుల‌తో గ‌డిపే ప్ర‌య‌త్నం చేయండి. వాళ్లే మీ క‌ష్ట‌కాలంలో, సంతోష‌స‌మ‌యాల్లో తోడుంటారు.

విస్మ‌రించేవారు..

విస్మ‌రించేవారు..

స్వార్థ‌ప‌రులుగా ఉండేవారే కాదండోయ్ త‌మ‌ను తాము పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసేవారు తొంద‌ర‌గా చ‌నిపోయే ప్ర‌మాద‌ముంది. మీ కంటే ఇత‌రుల అవ‌స‌రాల‌కే ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తూ పోతే అది మిమ్మ‌ల్ని బ‌ల‌హీనుల‌ను చేయ‌గ‌ల‌దు. ఇలాంటివారు ఇత‌రుల‌తో పోలిస్తే తొంద‌ర‌గా చ‌నిపోతారు.

ఏం చేస్తే బాగుంటుంది?

ఏం చేస్తే బాగుంటుంది?

పైన చ‌ర్చించిన అంశాల‌న్నీ వూరికే చెప్పిన‌వి కాదు. క‌చ్చితంగా జ‌రుగుతాయ‌ని కాదు. జీవితం నాణ్య‌త‌ను మాత్రం త‌గ్గిస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కాబ‌ట్టి ఏది జ‌రిగినా ఎల్ల‌ప్పుడు పాజిటివ్ దృక్ప‌థాన్ని క‌లిగి ఉండాలి. అంద‌రికి మంచి చేయాలి, మ‌నం ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే నిండు నూరేళ్లు సుఖ‌సంతోషాల‌తో వ‌ర్ధిల్లుతాం.

English summary

You Believe it or not, your life span might decrease if you do any of these things!

You Believe it or not, your life span might decrease if you do any of these things!,According to Vidur Niti, every human being is destined to live for no less than 100 years in this world. However, most of us will die early than that. Have you ever wondered why? Well, apart from lifestyle factors and genetic diseases,
Story first published:Tuesday, February 6, 2018, 15:18 [IST]
Desktop Bottom Promotion