Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
Gupt Navratri 2020 : ఈ మంత్రాలను జపిస్తే అద్భుత ప్రయోజనాలు మీ సొంతం...!
గుప్త నవరాత్రి 2020 సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఏయే మంత్రాలనో జపిస్తే ఫలితం ఉంటుందో తెలుసుకోండి.
ఆషాఢ మాసం అంటేనే అందరికీ 'కొత్త కోడలు అత్త ముఖం చూడకూడదు' 'భర్తతో కలయికలో పాల్గొనకూడదు' అనే విషయాలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. అయితే ఇదే నెలలో మరో ప్రత్యేకత కూడా ఉంది.

అదేంటంటే గుప్త నవరాత్రులు. సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా నాలుగు నవరాత్రులు వస్తాయి. ఛైత్ర మాసంలో వసంత నవరాత్రులు, అశ్వీయుజ మాసంలో శారదీయ నవరాత్రులు ఆషాఢ, మాఘ మాసాల్లో గుప్త నవరాత్రులు.

అయితే దక్షిణ భారతంలో తొలి రెండు నవరాత్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాటిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సమయంలో వారు ఉపవాసాలు ఉండి, నదీ స్నానాలు చేసి ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు.

అదే విధంగా ఆషాఢ మాసంలోనూ గుప్త నవరాత్రులు వస్తాయి. అయితే వీటికి దక్షిణ భారతంలో అంతగా ప్రాధాన్యత లేదు.కానీ ఉత్తర భారతంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను విశేషంగా జరుపుకుంటారు. ఇవి జూన్ 22 నుండి జులై 1వ తేదీ వరకు కొనసాగుతాయి.

గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాల మాదిరిగా అందరినీ పిలిచి చేయరు. వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు. అందులోనూ ఈ నవరాత్రుల్లో ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు ఈ సమయంలో ఏదైనా దానం చేయాలనుకుంటే, చాలా రహస్యంగా చేస్తారు. ఉదాహరణకు 'కుడి చేత్తో చేసే పని, ఎడమ చేతికి కూడా తెలియకూడదు' అంత గోప్యంగా ఈ పూజలు, వ్రతాలను చేస్తారు. మరో విశేషం ఏమిటంటే ఈ గుప్త నవరాత్రుల్లో ఎక్కువగా తాంత్రిక పూజలను ఎక్కువగా చేస్తారు. ఈ సమయంలో దుర్గామాతను పూజిస్తారు. ఈ పూజలను ఎక్కువగా చీకటి పడిన వెంటనే మొదలుపెడతారు. దీని వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. గుప్త నవరాత్రుల్లోని మంత్రం, తంత్రం మరియు యంత్రాలకు ప్రత్యేకమైనవిగా భావిస్తారు. జీవితంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆ తల్లికి విన్నవించేందుకు ఇలా చేస్తారు. ఈ నేపథ్యంలో గుప్త నవరాత్రుల సమయంలో ఆ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ మంత్రాన్ని జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి...
ఓం ఉమాదేవియే నమః

వృషభరాశి..
ఓం క్రీం కాళీదేవియే నమః

మిధున రాశి..
ఓం దన్ దుర్గాయ నమః

కర్కాటక రాశి..
ఓం లలితా దేవియా నమః

సింహ రాశి..
ఓం మహా సరస్వతి దేవియా నమః

కన్య రాశి..
ఝల్ ధారిని దేవీ నమః

తుల రాశి..
ఓం హరి మహాలక్ష్మీ నమః

వృశ్చికరాశి..
ఓం శక్తి రూపాయ నమః

ధనస్సురాశి..
క్లిన్ కామాఖ్య నమః

మకర రాశి..
ఓం పార్వతీదేవియే నమః

కుంభ రాశి..
ఓం పార్వతీదేవి నమఃః

మీన రాశి..
ఓం శ్రీమాన్ దుర్గా దేవియే నమః



Click it and Unblock the Notifications
