Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఆర్జీవీ ఆ పని చేసినందుకు సెటైర్లు వేస్తున్న నెటిజన్లు...
కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు, కొవ్వొత్తులు లేదా టార్చ్ లైట్స్ వేసి వెలిగించమన్నారు.
కరోనా వైరస్ చైనాలోని వూహాన్ లో పుట్టి ప్రస్తుతం ప్రపంచాన్ని అల్లకల్లలోలం చేస్తున్నసంగతి అందరికీ తెలిసిందే. అక్కడి నుండి అది అత్యంత వేగంగా విశ్వవ్యాప్తంగా వ్యాపించింది. దీని దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాతో సహా అనేక దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి.
మన దేశంలో కూడా ఇప్పటివరకు కంట్రోల్ గా ఉందంటుకున్న సమయంలోనే తబ్లిగ్ జమాత్ ఘటన వల్ల కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం దాదాపు 4 వేల మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకు ఈ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
వీటన్నింటి సంగతి పక్కనబెడితే కరోనా వైరస్ కు వ్యతిరేకంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటల నుండి 9 నిమిషాల పాటు దీపాలు, కొవ్వొత్తులు లేదా టార్చ్ లైట్లు వెలిగించాలని కోరారు. దీని వల్ల మన భారత ఐక్యత చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు దేశ ప్రజలందరూ ఆ సమయంలో లైట్లు ఆపేసి, దీపాలను, కొవ్వొత్తులను, టార్చ్ లను వెలిగించారు.
9 నిమిషాల పాటు కరోనా చీకట్లు తొలగిపోవాలని స్వచ్ఛందంగా 'గో కరోనా గో' నినాదాలు చేశారు. అయితే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అందరిలా కాకుండా అందరి కంటే భిన్నంగా చేశాడు. ఇందులోనూ కొందరిని రెచ్చగొట్టాడు. దీంతో నెటిజన్లు అతనిపై సెటైర్లు వేయడం మొదలెట్టారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
వెరైటీగా లైటర్ తో...
అందరిలా చేస్తే వెరైటీ ఏముంటుంది... తను ఏది చేసినా వెరైటీగా చేస్తా.. స్టైట్ గా చేసేస్తా.. అని ఎప్పుడూ చెప్పే రామ్ గోపాల్ వర్మ ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు తన లైటర్ తో సిగరెట్ వెలిగించాడు. కేవలం కొన్ని సెకన్ల పాటు ఉండే ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు.

నెటిజన్ల సెటైర్లు...
అందరూ కరోనా చీకట్లను తరమికొట్టేందుకు దేశాన్ని దీపకాంతులతో దేదీపమ్యమానంగా వెలిగించారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కొవ్వొత్తులు, దీపాలు వెలిగిస్తే.. కొందరు కాగడాలను కూడా వెలిగించాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు.

కరోనా పాటపై కూడా..
అంతేకాదు అంతకుముందు ఆర్జీవీ సొంతంగా పాడి యూట్యూబ్ లో విడుదల చేసిన పాటకు సంబంధించి కూడా నెటిజన్లు వేశారు. అందులో కొన్నింటిని మనం ఇప్పుడు చూద్దాం.. ‘నువ్వు ఆపకుంటే నా బుర్ర తిరుగు.. నోట్లోంచి వచ్చేలా ఉంది నురుగు.. నీ పాట విని జనాలు అందరూ ఇంట్లోకి పరుగు.. ఎందుకంటే బయట ఉంది ఆ పురుగు‘ అని కామెంట్ చేశారు. దీనికి వేల సంఖ్యలో లైకులు, వందల సంఖ్యలో సానుకూల స్పందనలు వస్తున్నాయి.

మరికొందరు నెటిజన్లు..
‘కరోనాకి ఏ మాత్రం సిగ్గు, శరం ఉన్నా ఆర్జీవీ పాట విన్న వెంటనే చచ్చిపోవడం ఖాయం‘
‘అతని పేరు వర్మ.. అతని కంట పడటం కరోనా కర్మ.. దాన్ని చేశాడు బంగాళ దుంప కుర్మా‘
‘ఆర్జీవీకి దూరంగ జరుగు.. లేకపోతే అంటుకుంటుంది పురుగు.. తర్వాత నీ ఒళ్లంతా మరుగు.. చివరికి నీ ఆయుష్ తరుగు‘ అంటూ రకరకాల సెటైర్లు వేశారు నెటిజన్లు.

సినీ ప్రముఖులు..
మోడీ పిలుపునకు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించి దేశ ఐక్యతకు మద్దతుగా తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి తమ ఇంటి ముందు దీపాలు పట్టుకుని నిలబడ్డారు. అలాగే అల్లుఅర్జున్, అల్లుఅరవింద్, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, మనోజ్, రజనీకాంత్ తో పాటు ఇంకా ఎందరో ప్రముఖులు కొవ్వొత్తులు వెలిగించి ఆ ఫొటోలను ట్వీట్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో బాగా వైర్ అయ్యాయి.



Click it and Unblock the Notifications

